Thursday, October 8, 2026
More
    HomePoliticsDistrict SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, హత్య కేసులో నింది తుడికి...

    District SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, హత్య కేసులో నింది తుడికి ద్విగుణ జీవిత ఖైదు, శాస్త్రీ య దర్యాప్తుతో న్యాయం సాధిం చాం

    📰 Generate e-Paper Clip

    —నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్

    District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ పట్టణంలో 2018లో సంచ లనం సృష్టించిన హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018 డిసెంబర్ 12న జరిగిన ఈ ఘట న లో నిందితుడు రామాపురం మల్లే శ్వర్ రావుకు Spl. Sessions Co urt for SC/ST (POA) Act Ca ses -cum- II nd Addl. Dist & Sessions Judge ద్విగుణ జీ వి త ఖైదు విధిస్తూ తీర్పు వెలువ రిం చిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వార్ వెల్లడించారు.

    *ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి…*

    ఈ సంఘటనకు సంబంధించి మృ తుడు రామావత్ బాల (35) నల్ల గొండ పట్టణంలోని తులసి నగర్ ప్రాంతానికి చెందినవాడు కాగా కు టుంబ విభేదాలతో పాటు అక్రమ సంబంధం నేపథ్యంలో పథకం ప్రకా రం 2018 డిసెంబర్ 12 వ తేదీన ఉదయం నల్లగొండ రైల్వే ఓవర్ బ్రి డ్జ్ సమీపంలో దారుణహత్య జరి గింది. ఈ క్రమంలో మృతుడి సో దరి ఫిర్యాదు మేరకు నల్లగొండ టౌ న్ పోలీసులు కేసు నమోదు చేసి శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చే పట్టారు.

    *శాస్త్రీయ ఆధారాలే దర్యాప్తులో కీలకంగా….*

    హత్య జరిగిన సంఘటన స్థలం నుంచి రక్తంతో తడిసిన బండరా యి, లుంగీ, ఇతర దుస్తులు స్వా ధీనం చేసుకోవడంతో పాటు రక్తపు నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యా బ్‌కు పంపించారు. డీఎన్‌ఏ విశ్లే ష ణలో సంఘటన స్థలంలోని రక్తపు మరకలు, నిందితుడి దుస్తులపై ఉ న్న మరకలు ఒకే జీవసంబంధ మూలానికి చెందినవని నిర్ధారణ కావడంతో 164 Cr.P.C. ప్రకారం కీ లక సాక్షుల వాంగ్మూలాలు మేజి స్ట్రేట్ సమక్షంలో నమోదు చేయ డంతో ఈ సమగ్ర సాక్ష్యాధారాల ఆ ధారంగా కోర్టు నిందితుడి నేరాన్ని నిర్ధారించింది.

    న్యాయస్థానంలో నేరం నిరూపణ కావడంతో కోర్టు పలు సెక్షన్ ల కిం ద శిక్షలు విధించిoది. IPC సెక్షన్ 302 కింద జీవిత ఖైదు శిక్షతో పా టు రూ. 10వేల జరిమానా విధిం చడం, అదే సందర్భంలో SC/ST (POA) చట్టం సెక్షన్ 3(2)(v) కింద మరో జీవిత ఖైదుకు తోడు రూ. 10వేల జరిమానా, IPC సెక్షన్ 2 01 కింద 3 సంవత్సరాల కఠిన కా రాగార శిక్షతో పాటు రూ. 10వేలు జరిమానాతో మొత్తంగా రూ. 30 వేలు జరిమానా విధించగా, అన్ని శిక్షలు సమాంతరంగా అమలులో ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.

    ఇదిలా ఉండగా ఈ కేసును శాస్త్రీ యంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చే సి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చే సిన అప్పటి, ప్రస్తుత దర్యాప్తు అ ధికారులను జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ అభినందించారు. శాస్త్రీ య ఆధారాలు, నిష్పాక్షిక దర్యా ప్తు, న్యాయవ్యవస్థపై విశ్వాసం ఇ వే సమాజానికి భద్రతా భరోసా అ ని ఎస్పీ శరత్ చంద్రపవార్ ఈ సం దర్భంగా పేర్కొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.