Thursday, October 8, 2026
More
    HomeIndiaCivilsupplies commissioner StephenRaveendra : బిగ్ బ్రేకింగ్, ధాన్యం కొనుగోలు కేంద్రంలో పౌర సరఫరాలశాఖ కమిషనర్...

    Civilsupplies commissioner StephenRaveendra : బిగ్ బ్రేకింగ్, ధాన్యం కొనుగోలు కేంద్రంలో పౌర సరఫరాలశాఖ కమిషనర్ ఆకస్మిక తనిఖీ, కొనుగోళ్లపై ఆరా

    📰 Generate e-Paper Clip

     

    Civilsupplies commissioner StephenRaveendra:  ప్రజా దీవెన చిట్యాల: రబీ ధాన్యం సేకరణలో భాగంగా మి ల్లుల వద్ద అన్లోడింగ్ పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిష నర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. అ న్లోడింగ్ తోపాటు, వెహికల్ రోటేష న్, కొనుగోలు కేంద్రాల నుండి ధా న్యం తరలించడం, లారీలు, హ మాలీలను పెంచాలని ఆ యన ఆ దేశాలు జారీ చేశారు.మంగళవారం ఆయన నల్గొం డ జిల్లా చిట్యాల మండలం, పెద్దకాపర్తిలో ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘం ఆ ధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెద కాపర్తి కేంద్రానికి ఇప్పటివరకు వచ్చిన దా న్యం వివరాలు, హమా లీ లు,ట్రక్ షీట్లు, మిల్లుల ట్యాగింగ్ చే సిన వాహనాలు, టార్పాలిన్లు, తది తర వివరాలను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, కేంద్రం నిర్వాహకు ల ద్వారా అడిగి తెలుసుకున్నారు.

     

    కాగా ఇప్పటివరకు ఈ కేంద్రానికి 25 వేల క్వింటాళ్ల దాన్యం వచ్చింద ని, ఇందులో 7000 క్వింటాళ్లు కొనుగోలు చేయడం జరిగిందని, ట్యా బ్ ఎంట్రీ కూడా పూర్తి చేశామని, ఇంకా కొ నుగోలు కేంద్రంలో 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు అధికారులు వివరించారు. పెదకా పర్తి కేంద్రం పెద్ద సెంటర్ అ.యినం దున అన్ని పెద్ద సెంటర్లలో 10 నుం డి 20 వరకు ఎక్స్ట్రా లారీలు ఏ ర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ సివిల్ సప్లై కమిషనర్ కు వివరించారు. హమాలీల కొ రత లేకుండా మిల్లర్లకు ముందే సమా చారం ఇవ్వడం జరి గిందని, ఒక్కొ క్క కొనుగోలు కేంద్రంలో 30 వరకు హమాలీ లు ఉన్నారని, అదేవిధం గా మిల్లుల్లో సైతం 30 నుండి 35 వరకు హమాలీలను ఉంచడం జరిగిందని తెలిపారు.

    ఈ సందర్భంగా పౌరసరఫరాల శా ఖ కమిషనర్ స్టీఫెన్ ర వీంద్ర మాట్లా డుతూ ట్యాబ్ ఎంట్రీ నూటికి నూ రు శాతం కావాలని, కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని శుభ్రపరిచేం దుకు డ్రయ్యర్లు, శుభ్రపరిచే విధా నాలను అడిగి తెలుసుకున్నా రు. గన్ని బ్యాగుల వివరాలను, టార్పా లిన్లను అడిగారు. అవసరమైతే ఎ క్స్ట్రా టార్పాలిన్లు కొనుగోలు కేం ద్రాలలో పెట్టాలని ఆయన ఆదేశా లు జారీ చేశారు.

    అనంతరం కమి షనర్ వట్టిమర్తిలో ఉన్న సిద్ధార్థ రైస్ ఇండ స్ట్రీస్ ను సందర్శించి అ క్కడ ఎంత మంది హమాలీలు ఉ న్నారని? అడగ గా 35 మంది ఉ న్నారని తెలిపారు. ఆన్ లోడింగ్, వెహికల్ రోటేషన్ పెంచాలని చె ప్పారు.అంతేకాక సిస్టం ద్వారా ధాన్యం వివరాల అప్లోడింగ్ ,ట్యాబ్ ఎంట్రీ వివ రాలను ఆయన పరిశీలించారు.

    జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరో జు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేస్తున్నామ ని చెప్పారు. ట్యాబ్ ఎంట్రీ పెండింగ్ ఉన్న కొను గోలు కేంద్రాలపై ఎక్కు వ దృష్టి కేంద్రీకరించాలని, మిల్లుల లో స్థలం లేకుంటే ఇంటర్మీడియట్ గోడౌన్లకు తరలించాలని, ధాన్యం తరలింపు తో పాటు, మరిన్ని వా హనాలు ఏర్పాటు చేయాలని ట్రా న్స్పోర్ట్ శాఖ డిప్యూటీ కమిషనర్ వాణిని సివిల్ సప్లైస్ కమీషనర్ ఆదేశించారు.

    పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ రోహిత్ సింగ్,జిల్లా ఎస్పీ శ రత్చంద్ర పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ జీఎం నాగేశ్వర రావు, ట్రా న్స్పోర్ట్ డిప్యూ టీ కమిషనర్ వాణి, పౌరసరఫరాల శాఖ అధికారి వెంక టేశం, డిఎం.రాంపతి నాయక్, డిసీ ఓ పత్యానాయక్, మార్కెటింగ్ శా ఖ ఎడి ఛాయాదేవి, చిట్యాల తహ సిల్దార్ విజయ్ తది తరులు ఉన్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.