Wednesday, October 7, 2026
More
    HomeOpinionACB surprise rides in Miryalaguda : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంపై...

    ACB surprise rides in Miryalaguda : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంపై ఏసీబీ మెరుపు దాడి, చిక్కిన ‘పెద్దతిమింగలం’

    📰 Generate e-Paper Clip

    ACB surprise rides in Miryalaguda :  ప్రజా దీవెన, న ల్లగొండ క్రైమ్: నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ ఒక్కసారి గా ఉలిక్కిపడింది. వక్ఫ్ బోర్డు కార్యాలయం లక్ష్యంగా అవి నీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శనివారం భారీ స్కె చ్‌తో రంగంలోకి దిగారు. ఎన్నోఏళ్లుగా అధికారుల కళ్లు గ ప్పుతూ, అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఒక ‘పెద్ద తి మింగలం’ ఎట్టకేలకు ఏసీబీ వలలో చిక్కినట్లు అత్యంత వి శ్వసనీయ వర్గాల సమాచారం.

    నల్లగొండలోని వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. మి ర్యాలగూడలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఓవ్యక్తిని నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా వక్ఫ్‌ బోర్డు ఇన్‌స్పెక్టర్ మహమూదద్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు కున్నారు.మహమూద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మిర్యాలగూడ పట్టణంలోని మందుల వారి కాల నీలో ఉన్న అతని నివాసంలోనూ సోదాలు చేపట్టారు. అలా గే నల్లగొండలోని నివాసంలోనూ ఏసీబీ బృందం తనిఖీలు చేపట్టింది.

    సంచలనం రేకెత్తించిన నల్లగొండ కార్యాలయంలో ఏసీబీ దాడుల పూర్వపురాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం హైదరా బాద్‌ వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారుల బృందం నల్లగొండలోని ‘ఘాటు రోడ్డు’ సర్వే కోసం వచ్చింది.సర్వేను అడ్డుకునేందు కు, వచ్చిన అధికారులను భయభ్రాంతులకు గురిచేసేందు కు లోకల్ వక్ఫ్ బోర్డు కార్యాలయంలోని కొందరు తీవ్ర ప్రయ త్నాలు చేసినట్లు ప్రచారం సాగింది.

          సీఈఓ సీరియస్ యాక్షన్ ?

    ఈ బెదిరింపుల ఉదంతాన్ని వక్ఫ్ బోర్డు సీఈవో (CEO) అ త్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉన్నతాధికారు లపై నే తిరగబడటం తో తెరవెనుక పావులు కదిపారని నిర్ధారిం చుకున్నారు. సీఈవో సీరియస్ కావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ శనివారం ఉదయం పక్కా ప్లాన్‌తో నల్లగొండ వక్ఫ్ బో ర్డు కార్యాలయంపై ఆకస్మికంగా విరుచుకుపడింది.

    కార్యాలయం తలుపులు మూసివేసి అధికారులు ప్రస్తుతం అంగు ళం అంగుళం సోదా చేస్తున్నారు. రికార్డులను క్షుణ్ణం గా పరిశీలిస్తున్నారు. ఇన్నాళ్లూ లంచాల పర్వంలో ఆరితేరి న ఒక కీలక అధికారిని టార్గెట్ చేసే ఈ మెరుపు దాడులు జరి గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తనిఖీలు ఇంకా కొన సా గుతు న్నాయి.ఈ దాడిలో ఎంత నగదు దొరికింది? ఆ ‘పెద్ద తిమిం గలం’ ఎవరు? అనే మరిన్ని పూర్తి వివరాలు అధికారి కంగా తెలియాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.