Thursday, October 8, 2026
More
    HomeIndiaCJP Protest delhi Jantar Mantar : జంతర్ మంతర్‌లో సీజేపీ నిరసన

    CJP Protest delhi Jantar Mantar : జంతర్ మంతర్‌లో సీజేపీ నిరసన

    📰 Generate e-Paper Clip

    CJP Protest delhi Jantar Mantar: దేశవ్యాప్తంగా వివి ధ పరీక్షలు, నియామక ప్రక్రియలపై వస్తున్న ఆరోపణల నేప థ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం భారీ నిర సన కార్యక్రమం నిర్వహించారు. ఆన్‌లైన్ ఆధారిత ఉద్య మంగా గుర్తింపు పొందిన కాక్రోచ్ జనతా పార్టీ (cockorach janata party) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వం దలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగార్థులు పాల్గొ న్నారు.

    సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) కూడా ఈ నిరసనలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యమం పూర్తిగా శాంతియుతంగా సాగాల ని, ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా క్రమశిక్షణతో వ్యవ హరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రేమ, శాంతి, ప్రజా స్వామ్య విలువలను కాపాడుతూ తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని మద్దతుదారులకు సూచించారు.

    నిరసనకు హాజరైన వారిలో ఎక్కువ మంది పాఠశాల, కళా శాల విద్యార్థులు, యువ ఉద్యోగులు, పోటీ పరీక్షలకు సిద్ధ మవుతున్న అభ్యర్థులే ఉన్నారు. పలువురు బొద్దింక ఆకార ముసుగులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొందరు చేతుల్లో పూలు పట్టుకుని శాంతియుత నిరసనకు మద్దతు తెలిపారు.

    నీట్, సీబీఎస్ఈ, సీయూఈటీ, ఎస్ఎస్సీ వంటి కీలక పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ నిరస నకారులు జవాబుదారీతనం కోరారు. విద్యార్థుల భవిష్య త్తుతో ముడిపడిన అంశాల్లో బాధ్యులపై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పలువురు నిరసనకారులు నినాదాలు చేశారు.

    సోషల్ మీడియా (Social Media)వేదిక ఎక్స్‌లో ముందు గానే స్పందించిన అభిజీత్ దీప్కే, నిరసనకు హాజరయ్యే వా రు ఒక పుస్తకం, జాతీయ జెండా తీసుకురావాలని సూచిం చారు. అలాగే పోలీసు సిబ్బందికి కృతజ్ఞత, గౌరవ సూచకం గా పూలు అందించాలని పిలుపునిచ్చారు.

    Also Read:NEET Retest Fear Letter: నీట్ రీటెస్ట్ భయం.. విద్యార్థిని ఆవేదనతో రాసిన లేఖ వెలుగులోకి

    నిరసన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలతో పాటు కీలక కూడళ్లలో అదనపు బలగాలను మోహరించారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్ర యం (indira gandhi international airport), నగర ప్రవే శ మార్గాలు, ఇతర సున్నిత ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

    అధికారుల సమాచారం ప్రకారం, వెయ్యికి పైగా పోలీసు సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో విధుల్లో నియమించారు. నిర సన శాంతియుతంగా ముగిసేలా ముందస్తు చర్యలు తీసు కున్నారు. ఇదే సమయంలో ఉద్యమానికి మద్దతు ప్రకటిం చిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, ఒకవేళ అభి జీత్ దీప్కేపై చర్యలు తీసుకుంటే తాను నిరాహార దీక్ష చేప డతానని ప్రకటించారు.దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ, నియామక వ్యవస్థలపై చర్చ జరుగుతున్న తరుణంలో ఈ నిరసన కార్యక్రమం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.