Thursday, October 8, 2026
More
    HomeIndiaPunjab Tragedy road accident : బిగ్ బ్రేకింగ్, పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఎనిమిది...

    Punjab Tragedy road accident : బిగ్ బ్రేకింగ్, పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఎనిమిది మంది దుర్మరణం

    📰 Generate e-Paper Clip

    Punjab Tragedy road accident : ప్రజా దీవెన, పంజా బ్: మరణించిన కన్నవారికి, కడసారి వీడ్కోలు పలి కి వారి పవిత్ర అస్థికలను నదిలో కలిపేందుకు ఆకుటుంబం భావో ద్వేగంతో ప్రయాణమైంది. కానీ, విధి ఆ కుటుంబం (Fa mil y) పై పగబట్టింది. మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చి ఆ అస్థికలను మోసుకెళ్తున్న వారిని కూడా అనంత లోకాల కు తీసుకెళ్లిపోయింది. పంజాబ్‌ (Punjab)లోని ఫిరోజ్‌పూర్-ఫాజిల్కా రహదారిపై శనివారం ఉదయం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం యావత్ ప్రాంతాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

    ఊహించని ఈ మృత్యుఘోషకు సంబంధించిన సమాచారం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జలాలా బాద్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన సుమారు 25 మంది సభ్యులు, ఇటీవల మరణించిన తమ బంధువు అ స్థికలను బియాస్‌లోని ‘రాధా సోమీ డేరా’లో నిమజ్జనం చే యడానికి శనివారం ఉదయం ఒక మహీంద్రా పికప్ వాహ నంలో బయలుదేరారు.

    Family members carrying a relative’s ashes for immersion die in a tragic road accident on the Ferozepur-Fazilka highway in Punjab.

    భక్తిశ్రద్ధలతో, బరువెక్కిన గుండెల తో సాగుతున్న వారి ప్ర యాణం.. జంగవాలా గ్రామ సమీపానికి వచ్చే సరికి ఒక్కసా రిగా నరకంగా మారింది. వేగంగా వచ్చిన ఒక ట్రక్కు, వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీ వ్రత ఎంతంటే: ఢీకొన్న శబ్దానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజ లు ఉలిక్కిపడ్డారు. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు వ్యక్తు లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందు తూ కన్ను మూశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 8కి చేరింది.

    Also Read:Sahara desert tragedy : బిగ్ బ్రేకింగ్, సహారాఎడారిలో నిశ్శబ్ద మృత్యువు, దాహార్తికి డిహైడ్రేషన్ తో 50 మంది ప్రయాణికుల బలి

    సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర వై ద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్య లు చేపట్టారు. రక్త సిక్తమైన క్షతగాత్రులను వెంటనే ఫి రోజ్‌పూర్‌ లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మందిలో పలువురి పరిస్థితి అ త్యంత విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు విగతజీవులుగా పడిఉన్న బంధువుల మృతదేహాలు, అటు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న వా రిని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

    అప్ప టివరకు అస్థికల నిమజ్జనం కోసం ప్రయాణమైన వా హనం.. కాసేపట్లోనే శ్మశాన వాటి కను తలపించడంతో ఆ సుపత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలముకున్నాయి.. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమా దా నికి గల కారణాలపై ద ర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘోర ప్రమాదంపై మీ ప్రాంతంలో ట్రాఫిక్ నిబంధనల అమ లు, రహదారి భద్రత గురించి మీరేమనుకుంటున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.