Thursday, October 8, 2026
More
    HomeOpinionWoman safety Wing DGP : ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీపీ అభిలాష కీలకవ్యాఖ్య, పిల్లలు...

    Woman safety Wing DGP : ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీపీ అభిలాష కీలకవ్యాఖ్య, పిల్లలు సురక్షితంగా ఉంటేనే సమాజం సురక్షితంగా ఉంటుంది

    📰 Generate e-Paper Clip

    Woman safety Wing DGP : ప్రజా దీవెన, కనగల్: పిల్ల లు సుర క్షితంగా ఉంటేనే సమాజం సురక్షితంగా ఉంటుంద ని, ప్రతి తల్లి తం డ్రి పిల్లల భద్రత, విద్య, విలువల పెంపకాని కి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ రాష్ట్ర డీజీపీ అభిలాష బిస్తూ అన్నారు. శనివారం ఆమె కనగల్లు మండలం చెర్లగౌరారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా పోలీసు శాఖ ఆ ధ్వర్యంలో నిర్వహించిన బాలపంచాయతీ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.

    చిన్నప్పటి నుండే పిల్లలకువిద్యతో పాటు, కష్టపడే తత్వం, నైతిక వి లువలు నేర్పించాలని సూచించారు. భవిష్యత్తులో పిల్లలు కుకింగ్, కబడ్డీ, వాలీబాల్, క్రీడలు, కళలు తదితర అన్ని రంగాల్లో రాణించి దేశాభివృద్ధికి తోడ్పడతారని అ న్నా రు. దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.
    బాల పంచాయతీలో విద్యార్థులు తమ గ్రామంలో ఉన్న స మస్యలను భయపడకుండా ధైర్యంగా ప్రస్తావించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు.

    సమాజంలో మార్పు రావాలంటే పిల్లలు బాగా చదవాలని, తల్లిదండ్రులు వారికి అన్ని విధాలుగా ప్రోత్సా హం అందిం చాలని సూచించారు. ప్రస్తుతం కాలుష్యం పెద్ద సమస్య గా మారిందని, గ్రా మాన్ని పరిశు భ్రంగా ఉంచేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విద్యా ర్థులు గ్రా మంలో చెత్త సమస్య, పాఠశాలకు బస్సు సౌకర్యం, కొత్త పాఠశాల భ వనం, ఆట స్థలం వంటి అవసరా లను ఆమె దృష్టికి తీసుకువచ్చా రు. విద్యార్థులు చూపిన చొరవ ను అభినందించిన ఆమె, ఈ సమస్య లను పరిష్కరించా లని జిల్లా కలెక్ట ర్‌ను కోరారు. సి.ఎస్.ఆర్. నిధుల ద్వారా పాఠశాల భవనానికి పె యింటింగ్ మరియు ఇతర అభివృ ద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీ సుకోవాలని సూచించారు. అలాగే, పిల్లలు తమ తల్లిదండ్రులకు హెల్మె ట్ లేకుండా ద్వి చక్ర వాహనాలు న డపవద్దని చెప్పాలని, ట్రాఫిక్ నిబంధన లు తప్పనిసరిగా పాటించాలని అవగాహన కల్పించారు.


    జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ పోలీసు శాఖ చేప ట్టిన బాలపంచాయతీ కార్యక్రమం విద్యార్థుల్లో ఉన్న సృజ నాత్మకత, నాయకత్వ లక్షణాలను వెలికితీసే మంచి వేదిక గా నిలుస్తోందన్నారు. విద్యార్థులు ఎంతో ధైర్యంగా తమ అ భిప్రాయాలను వ్యక్తం చేయడం అభి నందనీయమని చెప్పా రు. చదువుతో పాటు , కుకింగ్, వాలీబాల్, క్రికె ట్ తదితర రంగాల్లో ప్రతిభ కనబ రచాలని సూచించారు. ప్రస్తుతం 12 సంవత్సరాల వయస్సులో ఉ న్న ఈ చిన్నారులే 2047లో స్వా తంత్ర్య శతాబ్ది వేడుకలను చూసే భావితరమని, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు.

    జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ బాలపంచా యతీ ద్వారా విద్యార్థులు గ్రామ సమస్యలను, తమ అవస రాలను నిర్భయంగా వెల్లడించారని చెప్పారు. సమస్యలను ధై ర్యంగా ఎదుర్కొంటూ ల క్ష్యాల సాధన కోసం కృషి చేయా లని సూచించారు. ప్రతి రెండు నెల లకు ఒకసారి బాల పం చాయతీ నిర్వహించి, విద్యార్థులు తెలిపిన సమస్యల పరి ష్కారంపై సమీక్ష చేప డతామని హామీ ఇచ్చారు. అంత కు ముందు విద్యార్థులు నిర్వహించిన బాల పంచాయతీలో గ్రా మంలో చెత్త సమస్యను నివారించాల ని, బాల కార్మికత్వా న్ని అరికట్టాలని, పాఠశాలకు ఆట స్థలం, బస్సు సౌకర్యం క ల్పించాలని, ప్రతి చిన్నారికి విద్య అందేలా చర్యలు తీసు కో వాలని కోరారు. విద్యార్థులు చూ పిన చైతన్యం, ధైర్యం కా ర్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమావేశానికి ఎఎస్పి రమేష్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీం దర్ ర్రావు, డి.ఎస్.పి శివరాం రెడ్డి, సి డబ్ల్యూ ఓ చైర్మన్ చింత కృష్ణ య్య, ఎంపీడీవో వేద, సర్పంచ్ చి లకరాజు సునీత వెంకటే శ్వర్లు, ఉ ప సర్పంచ్ కల్కూరి నాగరాజు తదితరులు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.