samefamily Threemembers drowned in pond at Sangareddy : ప్రజా దీవెన, సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచే సుకుంది. బట్టలు ఉతకడానికి వె ళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నీటిలో మునిగి ప్రాణా లు కోల్పోయారు. మనూరు గ్రా మ శివారులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృ తి చెందడంతో కుటుంబ సభ్యు లు, బంధువులు కన్నీరు మున్నీ రవుతున్నారు.
బట్టలు ఉతకడానికి వెళ్లి..మృత్యుఒడిలోకి
మనూరు గ్రామ శివారులో బట్ట లు ఉతకడానికి వెళ్లిన నరసిం హారెడ్డి (45), సంగమేశ్వర్ రెడ్డి (42), కృష్ణవేణి (38) ప్రమా ద వశాత్తు నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకు న్న వారు గాలింపు చర్యలు చేప ట్టారు. ఈ క్రమంలో నరసింహా రె డ్డి, సంగమేశ్వర్ రెడ్డి మృతదే హాలను వెలికితీశారు. నీటిలో మునిగిన కృష్ణవేణిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిం చ గా, చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందారు.
ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి..తీరని విషాదం
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు తమతో ఉన్నవారు ఒక్కసారిగా విగతజీవులుగా మార డంతో కుటుంబ సభ్యులు, బంధువుల రో దనలు మిన్నంటా యి. ఈ ఘట న స్థానికులను తీవ్రంగా కలచివేసింది.


