Monday, October 12, 2026
More
    HomeOpinionTelangana government El Niño Advance Planning : ఎల్ నినో విపత్కర పరిస్థితుల నుంచి...

    Telangana government El Niño Advance Planning : ఎల్ నినో విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు ముం దస్తు ప్రణాళికలు

    📰 Generate e-Paper Clip

    — రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

    Telangana government El Niño Advance Planning : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్ నినో వంటి విపత్కర పరిస్థితుల లో రా ష్ట్ర ప్రజలను కాపాడేందుకు ముందస్తు ప్రణాళికలతో ప్రభు త్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉ పముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క అన్నారు.ఎల్ నినో ప్రభా వం, ఉత్పన్నమయ్యే ప రిస్థితుల పై వాస్తవ పరిస్థితులను రాష్ట్ర రై తాంగానికి వెల్లడించేందుకు ఉద్దే శించి సోమవారం రాష్ట్ర వ్యాప్తం గా అన్ని రైతు వేదికలలో లక్షలా ది మంది రైతులకు తెలి యజే యాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభు త్వం వీడియో కాన్ఫరెన్స్ ఏ ర్పా టు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఢిల్లీ నుండి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రా ష్ట్ర రైతాంగంతో మాట్లాడు తూ ప్ర పంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం ఈ సంవత్స రం ఏర్పడ్డ ఎల్ నినో డిసెంబర్లో పూర్తి గరిష్ట స్థాయికి చేరనుం దని, 2027 వ రకు ఇలాంటి పరిస్థితులు నెల కొంటాయన్న అంచనా ఉన్నట్లు తెలిపారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఇదివరకే దక్షిణాఫ్రికా దేశాలలో తక్కువ వర్షపాతం నమోదయి అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు, రై తులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని చెప్పారు.వ్యవసాయ అ నుబంధ రంగాల్లో, తాగునీ టికీ ఇ బ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉ న్నాయన్నారు. వీ టన్నిటిని దృ ష్టిలో ఉంచుకొని విపత్తులో ప్రజ లను, రైతులను కాపాడుకు నేం దుకు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నాలుగు నెలల నుండి వ్యవసా య శాస్త్రవేత్తలు, అధికారులు, జిల్లా యంత్రాం గాల ద్వారా అప్ర మత్తం చేస్తున్నదని,ఎల్ నినో అనేది ఒక విపత్తు అని ,ఈ ప్రమా దకర విపత్తులో ప్రజలను, రైతు లను అప్రమత్తం చేస్తూ వారిని కాపాడుకునేందుకు అందరూ స హకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా అన్ని రా జకీయ పార్టీలు రాజకీయాలకతీతంగా రైతులను కాపాడు కునేలా ప్రవర్తించాలని కోరారు.

    ఎల్ నినో పరిస్థితులలో తాగునీ రు అత్యంత ముఖ్యమైనదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రం లోని ప్రజలు, రైతులు జాగ్ర త్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ప్రస్తు తం సాగు చేసిన పంటలు, నీటి వన రులు కాపాడుకోవా లని, పం టల సాగులో నష్టాలను తగ్గించి రైతుల ప్రయోజనా లను కాపాడా లని, శాస్త్రవేత్తల సూచనల ప్రకారం వారి ఆలోచ న ప్రకారం ముం దుకెళ్లాలని, నీరు అందుబాటులో లేని ప్రాం తాల్లో సాగు చేయ డం వల్ల నష్టం ఏర్పడుతుందని, జలాశ యాల్లో ఉన్న నీటిని తా గునీటి అవసరాలకు వినియోగిం చాలని, వ్యవసాయ విశ్వవిద్యా లయం, వ్యవసాయ శాస్త్రవే త్తల సూచనలు ప్రకారం తక్కువ కా లంలో పండే పంటలు వేసుకోవా లని, నీరు లేని చోట అసలు వ్య వసాయం సాగు చేయవద్దని, కొ త్తగా నాటిన ఉద్యాన పంటలు కాపాడుకోవా లని, విత్తనాల ల భ్యత, ఉద్యాన పంటల సాగు, తక్కువ కాలంలో చేతికొచ్చే పం టలపై శాస్త్రవేత్తలను, వ్యవసా య అధికారులను సంప్రదించాల ని, ఎల్ నినో పై వదంతులను న మ్మవద్దని, రానున్న జూన్, జూలై వరకు కూడా వర్షం పడే అవకా శం లేదని అన్నారు.

    రిజర్వాయర్లు, ప్రా జెక్టులు, చెరు వులలో అందుబాటులో ఉన్న నీ టిని వ్యవసాయానికి కాకుండా తాగునీటికి విని యోగించా లని, లేకుంటే మనుషులు, పశువులకు తాగునీరు దొరికే పరిస్థి తి లేద ని, అవసరమైతే రెండు సంవత్స రాల వరకు నీరు ని లువ ఉంచు కొని జాగ్రత్తగా కాపాడుకునేలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉం దన్నారు. ఎల్ నినో పరిస్థితులను రైతు సోదరు లు విపత్తుగా భావించి సహకరించాలని, సమా జంలోని ప్రతి ఒక్కరూ శాంతి యుతంగా ప్రభుత్వానికి సహకరిస్తే సమాజా న్ని కాపాడ గలుగు తామని అన్నారు.

    రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మా ట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో విపత్తు పొంచి ఉందని, ఈ విషయమై రైతులను ముందుగా నే అప్రమత్తం చేశామని, దీనివల్ల రాష్ట్రంలో సుమారు 15 లక్షల ఎ కరాల వరి విస్తీర్ణం తగ్గిందని, రా బోయే రోజుల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందని, పసిఫిక్ మహాసముద్రంలో వడ గా లుల వల్ల వర్షాలు త గ్గి, ఉష్ణోగ్రతలు పెరిగాయని, రై తులు పరిస్థితులు అర్థం చేసు కొని మెలగాలని ,వచ్చే సీజన్ వరకు కూడా వర్షాలు రాకపోవ చ్చని అన్నారు. ఇలాంటి విపత్క ర పరిస్థితులు ఉన్నప్పటికీ రా ష్ట్రంలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేశామని, ఉ న్న వనరులతో పంటలు పండిం చుకునేందుకు ప్రణాళిక రూపొం దించామని, జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, రైతులు ఎల్ నినో ను ప్రపంచ విపత్తుగా భావించి ముందు జాగ్రత్త చర్యలు తీసు కో వాల న్నారు. రిజర్వాయర్లు, ప్రాజె క్టులలో ఉన్న నీటిని ఏ విధంగా వాడుకోవాలో జిల్లా కలెక్టర్లు ప్ర ణాళిక రూపొందించాలని, ఎట్టి పరిస్థితులలో సాగునీటికి నీరు వాడడానికి అవకాశం లేదని, వి ద్యుత్ పరిస్థితులు కూడా సరిగా లేవని, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ హైడల్ విద్యుత్ ఉత్పత్తికి అవ కాశం లేదని, థర్మల్ పవర్ కి కూ డా సమస్యలు ఉన్నాయని, వీట న్నిటిని దృష్టిలో ఉంచుకొని రైతు లు నూనేగింజలు, పప్పు ధా న్యాలు మాత్ర మే పండించాలని, సాగులో ఉన్న పంటలను కాపా డుకోవా లని, అతి తక్కువ కాలం లో చేతికొచ్చే పంటలే రబీలో వే యాలని, విద్యుత్ శాఖ రైతుల కు ఎన్ని గంటలు విద్యుత్ సర ఫరా చేస్తారో తెలియజేయాలని, గరిష్టంగా థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ,అన్ని థర్మల్ స్టేషన్స్ నడిచేలా చర్యలు తీసు కోవాలని, సోలార్ ద్వారా అన్ని పథకాలు ఉపయోగించు కోవా లని, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా పై వాస్తవ పరిస్థితులను రైతులకు తెలియజేయాలని ఆదే శించారు.

    రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఎల్ నినో పరిస్థి తులను ఎదుర్కొనేందుకు ఆ యా రంగాల వారీగా తీసు కుంటున్న చర్యలను రైతులకు వివరించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, విద్యుత్ శాఖ చీఫ్ సెక్రెటరీ నవీ న్ మిట్టల్, ఈఎన్ సి కృపాకర్ రెడ్డి, వాతావరణ శాఖ డైరెక్టర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ జాన య్య, ఉద్యాన విశ్వవిద్యాల యం విసీ ప్రొఫెసర్ రాజిరెడ్డి, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్, తది తరులు వారి శాఖ ల ద్వారా ఎల్ నినో పరిస్థితులలో చేపట్టనున్న కార్యాచరణ పై వివరించారు. కా గా ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ న ల్గొం డ జిల్లా ,కనగల్ మండలం, పగి డిమర్రి రైతు వేదిక నుండి హా జర య్యారు.జిల్లా వ్యవసాయ, అను బంధ శాఖల అధికారులు పాల్గొ న్నారు.

    ప్రతినీటి బొట్టును పొదుపుగా వినియోగించుకోవాలి

    ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రై తులు తక్కువ పెట్టుబడితో అధి క లాభాలు వచ్చే పంట ల ను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. నీ టి లభ్య తను బట్టి పంటలను ఎంపిక చే సుకోవాలని, రాను న్న 300 రోజు లు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆ యన అన్నారు. సోమవారం పగిడిమర్రి గ్రామంలో రై తు వేదిక సెంటర్ లో తెలం గా ణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్‌నినో ప్రభావం కారణంగా నీటి విని యోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించా ల్సిన అవసరం ఉందన్నారు. నా గార్జున సాగర్‌లో సాగునీటి ల భ్యత పరిమితంగా ఉండటంతో చెరువులు, కాలువలు, బో రుబావుల్లో అందుబాటులో ఉన్న నీటి ని జాగ్రత్తగా వినియో గించు కోవాలని,ప్రతి నీటి బొట్టును కాపాడు కుంటూ, ఎంత అవసరమో అం త మాత్రమే వినియోగించుకోవా లన్నారు. భూమి స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా పెసర్లు, మిను ములు, కందులు, పొద్దుతి రుగుడు, నువ్వులు వంటి ఆరు త డి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.

    రైతులు పరస్పరం చర్చించుకుని ప్రత్యామ్నాయ పంటలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తే, వాటిని ప్రభుత్వానికి నివేదిస్తామ ని అన్నారు. పండ్లు, కూరగాయ ల సాగు వంటి ప్రత్యామ్నాయా లపై రైతులు దృష్టి సారించాల న్నారు. జూన్‌, జూలై నెలల వ రకు నీటిని పొదుపుగా వినియో గించుకుంటూ అప్రమత్తంగా ఉం డాలని, అందరూ సమష్టిగా ప ని చేసి నీటి ఎద్దడిని అధిగమిం చా లని కలెక్టర్ పిలుపునిచ్చారు. వ్య వ సాయ పనులు లేని సమయం లో ఉపాధి హామీ పనులను వి ని యోగించుకుని కూలీలు జీవనో పాధి పొందవచ్చని తెలిపా రు. రై తులకు అవసరమైన స్ప్రింక్లర్లు తదితర వ్యవసాయ పరికరాల వివరాలను తెలియజేస్తే, ప్రభు త్వ సహకారంతో వాటిని సమ కూర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. గ్రామం లో ఏర్పాటు చే స్తున్న 5 రైతు క్లస్టర్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, జిల్లా హర్టికల్చర్ అధికారి శేఖర్, ట్రా న్స్కో ఎస్ఈ ,తహసిల్దార్ పద్మ ఎంపీడీవో వేద రక్షిత సర్పంచ్ నాగవెల్లి నాగమణి సైదులు, ఏఈఓ కీర్తన, జగల్ రెడ్డి, ఇతర అధికా రులు, రైతులు పాల్గొన్నారు .

    Telangana government El Niño Advance Planning

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.