Thursday, October 15, 2026
More
    HomeOpinionPrtu MLC Pingili Sripal Reddy : ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి సం చలన ప్రకటన,...

    Prtu MLC Pingili Sripal Reddy : ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి సం చలన ప్రకటన, ఉపాధ్యాయుల సమస్యలపై మరో ఉద్యమానికి సిద్ధం

    📰 Generate e-Paper Clip

    –పీఆర్సీ, పెండింగ్ బిల్లులపై ప్రభుత్వ తాత్సారoపై ఫైర్

    –వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్ ప్రకటన

     Prtu MLC Pingili Sripal Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభు త్వం ఇంకా తాత్సారం చేస్తే మరో ఉద్యమానికి సిద్ధమవుతా మని పీఆర్టీయూ ఎ మ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి హెచ్చరించారు. పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో మ రింత ఉధృతంగా పోరాటాలు ని ర్వ హిస్తామని స్పష్టం చేశారు. నల్లగొండలోని జీఎం గార్డెన్‌లో గు రువారం పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన సంఘం ఆరో రాష్ట్ర కౌన్సిల్ సమావే శానికి రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి సుమారు 6 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఉపాధ్యాయుల రాకతో నల్లగొండ పట్టణం పీఆర్టీయూ జెండాలతో సందడిగా మారిం ది.

     

    పీఆర్సీ అమలు చేయాలి, పెండింగ్ బిల్లులు చెల్లించాలి

    సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల పరిష్కారం, అధికారంలో కి రాకముందు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు, ఈహెచ్‌ఎస్‌ లో లోపాల సవరణ వంటి అంశా లపై శాసనమండలిలో పలుమార్లు గళ మెత్తినట్లు తెలిపారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూ ళ్ల ఉపాధ్యాయులు ఎదు ర్కొంటున్న సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

    ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా ఆశించిన స్పం దన రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న సు మారు 35 వేల మంది ఉపాధ్యా యులతో ఇందిరాపార్క్ వద్ద భా రీ ధర్నా నిర్వహించిన విషయా న్ని గుర్తుచేశారు. ఇ ప్పటికైనా ప్ర భుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించక పోతే తదుపరి ఉ ద్యమ కార్యాచరణను ప్రకటిస్తా మని హెచ్చ రించారు.

    పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరిభిక్షంగౌడ్

    రానున్న వరంగల్– ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎ న్నికల్లో పీఆర్టీయూ అధికారిక అభ్యర్థిగా రాష్ట్ర సంఘ ప్ర ధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్‌ను సమావేశంలో ప్రకటించా రు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 15 ఏళ్లపాటు సంఘ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని నాయ కులు పేర్కొన్నారు.

    ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, విద్యా వంతుల సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు.ఈ సంద ర్భంగా సుంకరి భిక్షంగౌడ్ మాట్లాడుతూ తన అభ్యర్థిత్వానికి మద్దతు తె లిపిన ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డితో పాటు రాష్ట్ర సంఘ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, ఉపా ధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యావంతుల సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్ర భు త్వం చేసిన తప్పులనే ప్రస్తుత ప్రభుత్వం కూడా పునరావృతం చేస్తోందని విమర్శిస్తూ, ప్రజా స మస్యలపై తమ పోరాటం కొన సాగుతుందని స్పష్టం చేశారు.

     హక్కుల సాధనే పీఆర్టీయూ లక్ష్యం

    పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి మాట్లాడు తూ ప్రపంచవ్యాప్తంగా 72 వేల మంది సభ్యత్వం కలిగిన ఉపా ధ్యాయ సంఘంగా పీఆర్టీయూ నిలిచిందని తెలిపారు. సం ఘం ఆవిర్భా వం నుంచి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కా రానికి నిరంతరం కృషి చేస్తోందని, భవిష్యత్తులో నూ అదే స్ఫూర్తితో ముందుకు సాగుతుందని చెప్పారు.ఈ స మావేశం లో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు పేరి వెంకటరెడ్డి, గుండు లక్ష్మణ్, జగన్మోహన్ గుప్తా, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కాళం నా రాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, అద్దంకి సునీ ల్, వీరమల్ల శ్రీనివాస్ గౌడ్, గుండగోని రవిశంకర్ గౌడ్, రో లకలు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.33 జిల్లాల అధ్య క్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు రాష్ట్ర, జిల్లా,మండల స్థా యి నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజర య్యా రు.

    Prtu MLC Pingili Sripal Reddy

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.