Friday, October 16, 2026
More
    HomeOpinionEl Niño Special Officer Dasari Harichandana : ప్రత్యేకాధికారి దాసరి హరిచంద న కీలక...

    El Niño Special Officer Dasari Harichandana : ప్రత్యేకాధికారి దాసరి హరిచంద న కీలక వ్యాఖ్య,ఎల్‌నినో ము ప్పును ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలు

    📰 Generate e-Paper Clip

    –ఉమ్మడి జిల్లాలో తాగునీటికి తొలిప్రాధాన్యం

    –రబీలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
    — నీరు, విద్యుత్ పొదుపుపై ప్రత్యేక దృష్టి

    El Niño Special Officer Dasari Harichandana : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్‌నినో ప్రభావంతో రానున్న నెలల్లో తా గు నీరు, వ్యవసాయం, భూగర్భ జలాలు, విద్యుత్, పశుగ్రాసం వంటిరంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధం కా వాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్ష ణ శాఖల కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎల్‌నినో ప్రత్యేక అధి కారి దాసరి హరిచందన ఆదేశిం చారు. ప్రజలకు తాగునీటి ఇబ్బం దులు తలెత్తకుండా రానున్న నా లుగైదు నెలల అవసరాలను దృ ష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామం, ప్ర తి ఇంటికి నీరందించేలా సూ క్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందిం చాలని స్పష్టం చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఉదయా ది త్య భవన్‌లో న ల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జి ల్లాల కలెక్టర్లు, వివి ధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వ హించారు. ఎల్‌నినో ప్ర భావం, ప్రస్తుత వర్షపాతం, పంట ల పరిస్థితి, సాగు, తాగునీటి ల భ్యత, భూగర్భ జలాలు, విద్యు త్ సరఫరా తదితర అంశాలపై చర్చించారు. డిసెంబర్ చివరి నా టికి ఎల్‌నినో ప్రభావం తీవ్రస్థాయి కి చేరే అవకాశం ఉందని, ఇప్పటి కే పలు ప్రాంతాల్లో వర్షాభావ పరి స్థితులు నెలకొన్నా యని పేర్కొ న్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రజలు, రైతులు ఇబ్బం దులు ఎదుర్కోకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని సూచిం చారు.

      ప్రతి గ్రామానికి నీటి భద్రత

    తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రస్తుతం రిజ ర్వా యర్లలో ఉన్న నీటి నిల్వలను అంచ నా వేసి చివరి గ్రామం, చి వరి ఇంటి వరకు నీరందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయా లని కలె క్టర్లకు సూచించారు. గ్రామాలవా రీగా పనిచేస్తున్న బో ర్లు, నీటి ట్యాంకులు, నిల్వ సదుపాయాలు, ప్రత్యామ్నాయ నీటి వనరుల వివరాలను సేకరించాలని ఆదేశించారు. భూ గర్భ జలాలు తగ్గి నప్పటికీ ప్రజలకు తాగునీరు అందేలా ముం దస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నీటిని పొదుపుగా విని యోగించుకునేలా గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

    వరికి ప్రత్యామ్నాయంగా తక్కువనీటి పంటలు

    రబీ సీజన్‌లో అధిక నీరు అవస రమయ్యే వరి సాగుకు బదు లుగా పెసర్లు, ఉలవలు, కందులు, ఇతర ప్రత్యామ్నాయ పం టల సాగుపై రైతులకు అవగాహన క ల్పించాలని హరిచందన సూచిం చారు. తక్కువ నీటితో పంటలు పండించే విధానా ల ను ప్రోత్స హించాలని, బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి సూక్ష్మ సాగు పద్ధతులను విస్తృతంగా అమలు చేసేలా ప్రణాళి కలు రూపొందించాలని చెప్పారు. రైతులు నీటితో పాటు వి ద్యుత్‌ను కూడా పొదుపుగా వినియోగించేలా చర్యలు చేప ట్టాలని ఆదేశించారు.

    పశువులకు తాగునీరు, పశు గ్రాసం సిద్ధంచేయాలి

    ఎల్‌నినో ప్రభావంతో పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత ఏ ర్పడకుండా ప్రతి గ్రామంలో అం దుబాటులో ఉన్న వనరు లను ముందుగానే గుర్తించాలని అధి కారులకు సూచించారు. వేసవి తీవ్రత పెరిగేలోపు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు. విద్యుత్ అధికంగా వినియోగించే ప్రాంతాలను గు ర్తించి, విద్యుత్ ఆదా చేసే చర్యలకు ప్రణాళికలు రూపొందిం చాలని హరిచందన ఆదేశించారు. సోలార్ విద్యుత్, సోలార్ బ్యాటరీలు, సోలార్ మో టార్లు, సూర్యగృహ వంటి పథకా ల వినియోగంపై రైతులు, ప్రజల కు అవగాహన కల్పించాలని సూ చించారు. స్థానిక ప్రజాప్రతిని ధు లు, సర్పంచుల సహకా రంతో ఈ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీ సుకెళ్లాలని తెలిపా రు.

      వాననీటి సంరక్షణకు పెద్దపీట

    భూగర్భ జలాలను పెంపొందిం చేందుకు వి.బి.-జి. రామ్‌జీ పథ కం కింద నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలని సూచిం చారు. ప్రతి గ్రామంలో మ్యాజిక్ సోక్‌పిట్లు, కమ్యూనిటీ సోక్‌పి ట్లు, నీటి నిల్వ నిర్మాణాలు ఏ ర్పాటు చేయాలని పేర్కొ న్నారు. మున్సిపాలిటీల్లో వృథాగా వెళ్లే నీటిని తిరిగి వినియో గించుకునే మార్గాలను అన్వేషించాలని చె ప్పారు. ప్రతి గ్రామా నికి సొంత నీటి భద్రతా వనరులు ఉండేలా చర్యలు తీసు కో వాలని స్పష్టం చేశారు.ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో కూలీలకు తాగునీరు, ఓఆ ర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికి త్స సదుపాయాలు, నీడ కల్పిం చాలని ఆదేశించారు. ఎండ తీవ్ర త కారణంగా ప్రజలు అనారోగ్యా నికి గురికాకుండా ముందస్తు జా గ్రత్తలు తీసుకోవాలని సూచించా రు.

    గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రణాళికలు

    మండల ప్రత్యేక అధికారులు ప్ర తి వారం సర్పంచులు, పంచా యతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి ఎల్‌నినో పరి స్థితుల ను సమీక్షించాలని హరిచందన ఆదేశించారు. గ్రామస్థా యి అవస రాల ఆధారంగా మండల, జిల్లా స్థాయి కార్యాచర ణ ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. డి సెంబర్, జన వరిలో పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యే అవ కాశాన్ని దృష్టిలో ఉంచుకుని అ న్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు.

    నల్గొండలో 34 శాతం తక్కువ వర్షపాతం

    నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో సా ధారణం కంటే 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపా రు. ఏడు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైం ద ని, ఎల్‌నినో ప్రభావం భూగర్భ జలాలు, తాగునీ రు, వ్యవసాయం పై పడుతోందని వివరించారు. రై తులు వరి సాగుకు బదులుగా ఉ ద్యాన పంటలు, పెసర్లు, కందులు సాగు చేసేలా అవగాహన క ల్పిస్తున్నామని చెప్పారు. వి.బి.జి. రామ్‌ జీ పథకం కింద వాననీటి సంరక్షణ నిర్మాణాలు చేపడు తున్నా మని, రబీలో పెసర్లు, ఉల వలు వంటి పంటలను ప్రోత్స హించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. త క్కువ నీటితో సాగుకు అవసర మైన స్ప్రింక్లర్లు, డ్రిప్ పరిక రాలు మంజూరు చేయాలని ప్రభుత్వా నికి నివేదిం చినట్లు తెలిపారు. రై తు ఉత్పత్తిదారుల సంస్థలకు నిధులు కేటాయిస్తే ప్రత్యామ్నా య పంటల సాగును మరింత ప్రోత్సహించవచ్చని పేర్కొన్నారు.

    సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తమ జిల్లాల్లోని పరిస్థితులు, తాగునీరు, వ్యవ సాయం, భూగర్భ జలాలు, వి ద్యుత్, పశుగ్రాసం, సాగునీటి అంశాలపై వివరించారు. ఈ స మావేశంలో స్థానిక సంస్థల ఇన్‌ చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కర ణ్ రెడ్డి, సూర్యాపేట అదనపు కలెక్టర్ హరి సింగ్, దేవరకొం డ సబ్‌కలెక్టర్ కరోలినా చింగ్థియాన్ మావి, వ్యవసాయ, ఉద్యా న, భూగర్భ జలాలు, విద్యుత్, మిషన్ భగీరథ, ప్రజారోగ్య, నీ టి పారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు.

    El Niño Special Officer Dasari Harichandana

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.