Monday, October 19, 2026
More
    HomeOpinionSp Sharat Chandra Pawar in Dasara celebrations : నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో...

    Sp Sharat Chandra Pawar in Dasara celebrations : నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజలు

    📰 Generate e-Paper Clip

    –జిల్లా ప్రజలకు ఎస్పీ శరత్ చంద్రపవార్ విజయదశమి శుభా కాంక్షలు
    –ప్రజల రక్షణే లక్ష్యంగా అంకిత భావంతో విధులు నిర్వ హించాలి

     Sp Sharat Chandra Pawar in Dasara celebrations : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్ : విజయదశమి పర్వదినాన్ని పు రస్కరించుకుని నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జి ల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలను ఘ నంగా నిర్వహించారు. పోలీస్ కార్యాల యంలోని ఆర్ముడ్ రిజ ర్వ్ విభాగంలో ఆయుధాలకు, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ (ఎం.టి.) వి భాగంలో పోలీస్ వాహనాలకు సంప్రదాయ బద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వ హించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్  ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు.

    ప్రజలజీవితాల్లో సుఖసంతోషాలు వెల్లి విరియాలి

    ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ మాట్లాడుతూ.. చె డుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగ నిలుస్తుందని పేర్కొన్నారు. దుర్గా మాత ఆశీస్సులతో జిల్లా ప్రజలం దరికీ సుఖసంతోషాలు, ఆయు రారోగ్యాలు, శాం తి, సౌభాగ్యా లు కలగాలని ఆకాంక్షించారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవ సాయ రంగాల్లో ప్రజలు అభివృ ద్ధి సాధిస్తూ విజయపథంలో ముందుకు సాగాలని కోరుకున్నారు. ప్రజ లందరూ పరస్పర ప్రేమాభిమానాలు, సోదరభావంతో పం డు గను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని పిలుపు నిచ్చా రు.

    ప్రజల రక్షణే పోలీసుల ప్రధానలక్ష్యం

    ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో నిర్వ హించిన ఆయుధ పూజలో విధి నిర్వహణలో కీలకమైన ఆయు ధాలకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతో పా టు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు మరింత అంకితభా వంతో పని చే యాలని ఈ సం దర్భంగా ఆకాంక్షించారు.అనంతరం ఎం.టి. విభాగంలో పోలీస్ వాహనాలకు పూజలు నిర్వహించారు. నేరాల నియంత్ర ణ, అత్యవసర పరిస్థితుల్లో స త్వర స్పందన, ప్రజలకు సమర్థ వంతమైన సేవలు అందించడం లో పోలీస్ వాహనాలు కీలక పా త్ర పోషిస్తాయని పేర్కొన్నారు. సి బ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవ లు అందించాలని సూచించారు.

    శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరకృషి

    పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా విజయదశమి సుఖసంతోషాలు, ఆరోగ్యం, విజయాలను అం దించాలని ఎస్పీ ఆకాంక్షించారు. ప్రజల సహకారంతో నల్ల గొండ జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టంగా కొనసా గిస్తూ, ప్రజలకు మె రుగైన పోలీస్ సేవలు అందించేందుకు జి ల్లా పోలీస్ శాఖ నిరంత రం కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎ స్పీ రమేష్, ఎస్బీ సీఐ నాగరాజు, డీసీఆర్‌బీ సీఐ శ్రీను నాయక్, న ల్లగొండ వన్‌టౌన్ సీఐ రాజశే ఖర్ రెడ్డి, ఆర్‌ఐలు సంతోష్, శ్రీను, నరసింహ, సురప్ప నాయు డు, హరిబాబు, కళ్యాణ్ రాజ్ తదితర పోలీస్ అధికారులు, సి బ్బంది పాల్గొన్నారు.

    Sp Sharat Chandra Pawar in Dasara celebrations

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.