Friday, October 23, 2026
More
    HomeతెలంగాణCm Revanth Reddy key announcement : సీఎం రేవంత్ కీలక ప్రకటన, ట్యాంక్‌బండ్‌పై పండుగ...

    Cm Revanth Reddy key announcement : సీఎం రేవంత్ కీలక ప్రకటన, ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలు

    📰 Generate e-Paper Clip

     

    –ముదిరాజులను బీసీ-ఏలో చే ర్పుపై మంత్రివర్గ ఉపసం ఘం అధ్యయనం

    Cm Revanth Reddy key announcement : ప్రజా దీవెన, హైదరాబాద్: ము దిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ- డీ నుంచి బీసీ-ఏ గ్రూపులోకి మార్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీ లక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనపై మం త్రివర్గ ఉపసంఘం సమగ్రంగా అధ్యయనం చేసి, న్యాయ పర మైన చిక్కులు తలెత్తకుండా తగిన నిర్ణయం తీసుకుం టుంద ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అలాగే బహుజ నుల హక్కుల కోసం పోరాడిన మహనీయులు పండుగ సా యన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలను ట్యాంక్‌బండ్‌ పరిసరా ల్లో ఏర్పా టు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించా రు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రభుత్వం అధికారికం గా నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయం తి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సాయన్నచిత్ర ప టా నికి పుష్పాంజలి ఘటించి ఆయనపై రూపొందించిన పాటల ను ఆవిష్కరించారు.

    ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో ము దిరాజ్‌లను మరో బీసీ గ్రూపులోకి మార్చే ప్రతిపాదనలకు సరైన గణాంకా లు లేకపోవడంతో న్యాయస్థానాల్లో ఇబ్బందులు ఎదురయ్యా యని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించిన కులగ ణన ద్వారా బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సం బంధించిన వివరాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపా రు.ఈ గణాంకాల ఆధారంగా ముదిరాజ్‌లను బీసీ- ఏలో చేర్చే అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం న్యాయనిపుణులు, అధి కా రులతో చర్చించి అధ్యయనం చేస్తుందని చెప్పారు. అ నంత రం మంత్రివర్గంలో చర్చించి, ముదిరాజ్‌లకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని స్ప ష్టం చేశారు.

      గంగపుత్రుల అభ్యంతరాలపైనా చర్చలు

    ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చితే గంగపుత్రులకు అన్యాయం జరుగుతుందనే అనుమానాలు ఉ న్నాయని సీఎం ప్రస్తావించా రు. ఈ నేపథ్యంలో సంబంధిత సా మాజిక వర్గాలతో చర్చలు జరిపి, వారి సందేహాలను నివృత్తి చే యాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్ కు సూచించారు. అన్ని వర్గా ల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని సా మాజిక న్యాయం సాధించడమే ప్రభుత్వ లక్ష్య మని పేర్కొన్నారు.

        దేశానికి ఆదర్శంగా కులగణన

    స్వతంత్ర భారతదేశంలో కులగణన నిర్వహించడం ద్వారా తె లంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని రేవం త్‌రెడ్డి అన్నారు. 2024 ఫిబ్రవరి 4న కమి షన్‌ను ఏర్పాటు చేసి, 2025 ఫి బ్రవరి 4 నాటికి కులగణన ప్రక్రియను పూర్తి చేశామని వివ రించారు..ఈ గణాంకాలు బలహీన వర్గాలకు తమ హక్కులను అడిగే ధైర్యాన్ని ఇచ్చాయని పేర్కొన్నా రు. కులగణనలో ఎవరి వివ రాలైనా నమోదు కాక పోయినా, లెక్కల్లో తప్పులున్నా వాటిని స రిచేసు కునేందుకు ప్రభుత్వం సి ద్ధంగా ఉందన్నారు.విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో అర్హులకు సము చిత న్యాయం కల్పించడమే తమ ఉద్దేశమని స్ప ష్టం చేశారు.

    ఎస్సీవర్గీకరణ తరహాలో సమస్యల పరిష్కారం

    దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ ఉపకులాల వర్గీ కరణ సమస్యను ప్రజాప్రభుత్వం అధి కా రంలోకి వచ్చిన త ర్వాత పరిష్కరించిందని సీఎం గుర్తుచేశారు. ఈ క్రమంలో ఎ న్నో పోరాటాలు, త్యా గాలు జరిగాయని తెలిపారు. క్లిష్టమైన సామాజిక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముం దు కు సాగుతున్నామని, ఆలస్యమైనా ఎవరికీ అన్యాయం జరగ కుండా చూడటం తన బాధ్యతని పేర్కొన్నారు.

     సాయన్న త్యాగాలు చిరస్మరణీయం

    పేదలు, బహుజనుల హక్కుల కోసం పండుగ సాయన్న చేసిన పోరాటాన్ని ముఖ్యమంత్రి కొనియా డారు. జమీందార్లు, జాగీ ర్దార్లు, భూస్వాముల ఆధి పత్యానికి వ్యతిరేకంగా నిరుపేదల భూములను రక్షించేందుకు ఆయన ధైర్యంగా పోరాడారని చె ప్పారు. పల్లెల్లో జానపదాల రూపంలో ఇప్పటికీ ప్రజలు సా యన్నను స్మరించుకుంటున్నారని తెలిపారు.పాలమూరు గడ్డ కు చెందిన పండుగ సాయన్న వంటి పోరాట యోధుడి చరిత్ర భావితరాలకు స్ఫూర్తి గా నిలవాలని ఆకాంక్షించారు. బహుజ నుల కోసం జీవి తాలను త్యాగం చేసిన మహనీయులకు చరి త్రలో సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సర్వాయి పాపన్న గౌడ్, జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాల మాదిరిగానే ట్యాంక్‌ బం డ్‌ పరిసరాల్లో పండుగ సాయన్న, దొ డ్డికొమురయ్య విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

    సంక్షేమ పథకాలు మెరుగైన అమలు 

    రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ప్రవే శపెట్టిన సంక్షేమ పథకాలను ర ద్దు చేయకుండా, మరింత మెరుగు పరిచి అమలు చేస్తున్నా మని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా పలు పథకాల వివరా లను వెల్లడించారు. రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే 55 లక్షల కుటుం బాలకు ఉచిత గృహ విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. పథకం కింద వైద్య చికిత్స పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్ష లకు పెంచి న ట్లు చెప్పారు. గతంలో రూ.10 వేలు గా ఉన్న మొత్తాన్ని రూ.12 వేలకు పెంచామని తెలి పారు. 25 లక్ష లకు పైగా రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. నిరుపేద ల కోసం ఎనిమిది లక్షల ఇళ్లను మం జూరు చేసినట్లు చెప్పారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్ప టికే రూ.14 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని వివరించారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి సహా ఏ సంక్షేమ పథకాన్నీ నిలి పివేయలేదని, ప్రజలకు మరిం త ప్రయోజనం కలిగేలా పథకా లను అమలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

    పోరాటయోధులకు సముచిత గుర్తింపు

    సర్వాయి పాపన్న గౌడ్, దొడ్డి కొమురయ్య, కొండా లక్ష్మణ్ బా పూజీ, జ్యోతిరావు పూలే, చాకలి ఐలమ్మ వంటి మహనీయు లు బహుజనుల హక్కుల కోసం పోరాడారని సీఎం గుర్తుచేశా రు. సమా జం కోసం జీవితాలను అంకితం చేసిన వారి చరిత్ర ను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, వాకిటి శ్రీహరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహా దారు వి. హనుమంత రావు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొ న్నారు.

    Cm Revanth Reddy key announcement

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.