–దాడులు, కేసులు, ఆర్ఆర్ యాక్ట్లతో మిల్లర్లలో ఆందో ళన
— ఎల్నినో దెబ్బకు పడిపోయిన దిగుబడులు
— కొనుగోలు కేంద్రాల నిర్వహణ లోనూ ఇబ్బందులే
— గోదాములు ఖాళీ లేక నిల్వల కు ఆటంకం
–నష్టాల సుడిగుండంలో అన్న దాతలు
Nalgonda Paddy purchase delay problems : ప్రజా దీవెన, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొను గోళ్ల వ్యవహారం రైతులకు శాపం గా మారుతోంది. ప్రభుత్వం కొను గోలు కేంద్రాలను సకాలంలో ప్రా రంభించకపోవడం, ప్రారంభిం చి న చోట్ల కూడా కొనుగోళ్లు మొ ద లుపెట్టడంలో జాప్యం చేయడం తో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. విధిలేని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయి స్తున్న రైతులను వారు నిలువు నా దోచుకుంటున్నారనే ఆం దో ళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ధాన్యం కొనుగోళ్ల వ్యవ స్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.
మిల్లులు మూత.. కొనుగోళ్లకు బ్రేక్
ధాన్యం కొనుగోళ్లలో కీలక పాత్ర పోషించే ప్రముఖ రామల క్ష్మ ణన్, కనకమహాలక్ష్మి, సుమాంజలి, గౌ తమి తదితర రైస్ మిల్లులు మూ తపడటం సమస్యను మరింత జటిలం చేసిం ది. ఉదాహరణకు న ల్లగొండ మండలంలోనే సుమారు 80 వేల టన్నుల ధాన్యం దిగుబ డి వస్తుండగా, అందుకు అనుగు ణం గా కొనుగోళ్లు జరగకపోవడం రైతులను ఆందోళనకు గురిచే స్తోంది.
షార్ట్ఫాల్ వరకే కొనుగోళ్లు.. రైతులకు తప్పని కష్టాలు
నల్లగొండ జిల్లా కేంద్రం స్థానికంగా బాలాజీ, సాయి వెంకటేశ్వర, వెం కటసాయి, మహావీర్ రైస్ మిల్లు లు ఉన్నప్పటికీ, అవి ధా న్యం కొ నుగోళ్లకు ఆసక్తి చూపడం లేదన్న ఆరోపణలు విని పిస్తున్నాయి. ప్రభుత్వానికి బాకీగా ఉన్న షార్ట్ ఫాల్ పరిమితి మేరకే ధాన్యం తీ సుకుంటూ, ఆ తర్వాత కొను గో ళ్లకు గేట్లు మూసేస్తున్నారనే విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. దీం తో చేతికొచ్చిన పంటను అమ్ము కునేందుకు రైతులు నానా తం టాలు పడుతున్నారు. ఒకవైపు కొనుగోలు కేంద్రాల జాప్యం, మ రోవైపు మిల్లుల నిరాసక్తత, ఇం కోవైపు దళారుల దందా వెరసి అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ప్రభుత్వానికి పెనుసవాలుగా ధాన్యం కొనుగోళ్లు
ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న ఈ పరిస్థితులు ప్రభుత్వానికి పెద్ద స వాలుగా మారే అవకాశముందని పరిశీలకులు అభి ప్రాయపడుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా, దళారుల దోపిడీకి అ డ్డుకట్ట వేసేలా అధికారులు తక్షణ చర్య లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రా లను పూర్తిస్థాయిలో అందుబా టులోకి తీసుకువచ్చి, ధాన్యాన్ని స కాలంలో కొనుగోలు చేయక పో తే రైతుల కష్టాలు మరింత తీ వ్ర మయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ధాన్యం కొనుగోళ్లలో అంతు లేని సమస్యలు
ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రై తులకు కంటిమీద కునుకు లే కుండా చేస్తోంది. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో దిగుబడులు గ ణనీయంగా తగ్గిపోవడం, మరో వైపు కొనుగోలు కేంద్రాల్లో ఎదుర వుతున్న సమస్యలు అన్నదా తలను ఆందోళనకు గురిచేస్తు న్నాయి. దీనికి తోడు ధాన్యం కొ నుగోళ్లలో జాప్యం, గోదాముల్లో నిల్వల సమస్యలు, మిల్లర్లపై వ రుస దాడులు, కేసులు, ఆర్ఆర్ యాక్ట్ చర్యల నేపథ్యంలో మొ త్తం వ్యవస్థ ఒత్తిడిలో పడినట్లు కనిపిస్తోంది.
మిల్లర్లపై చర్యలు.. కొనుగోళ్లపై ప్రభావం?
గత ఏడాది నుంచి రైస్ మిల్లుల పై దాడులు, కేసులు, బకా యిల వసూలుకు ఆర్ఆర్ యాక్ట్ చర్య లు కొనసాగు తు న్నాయన్న ఆం దోళన మిల్లర్లలో నెలకొంది. మ రోవైపు తడిసిన ధాన్యం, నాణ్య త ప్రమాణాలకు అనుగుణంగా లేని ధాన్యం, ఎఫ్ఏక్యూ నిబం ధనల నిర్వహణ వంటి అంశాలు కొను గో ళ్లను మరింత సంక్లిష్టం చే స్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, ఇ తర పరిస్థితుల కారణంగా కొన్ని సందర్భాల్లో నాణ్యత ప్ర మాణా ల విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని సంబం ధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
అధికార యంత్రాంగం తీరుపై విమర్శలు
వాతావరణ పరిస్థితులు, ధాన్యం నాణ్యత, సాంకేతిక సమస్య లు ఒకవైపు ఉంటే.. కొనుగోళ్ల నిర్వ హణలో అధికారుల జా ప్యం మ రోవైపు రైతులకు భారంగా మా రుతోందన్న విమర్శ లు వినిపిస్తు న్నాయి. ముందస్తు ప్రణాళికతో కొనుగోలు కేం ద్రా లను సిద్ధం చే యడం, ధాన్యం నిల్వలకు అ వసరమైన ఏ ర్పాట్లు చేయడం, మిల్లర్ల సమస్యలకు పరిష్కారాలు చూప డంలో మరింత చొరవ అవసరమని రైతులు అభిప్రాయ పడుతున్నారు.
గోదాముల్లో నిల్వలు..కొత్త ధాన్యానికి స్థలం ఎక్కడ?
గతంలో గోదాముల్లో పేరుకు పో యిన సుమారు లక్ష టన్నుల ధా న్యాన్ని వేలం వేయకపోవడంతో నిల్వ సామర్థ్యం పూర్తిగా విని యోగంలోకి వచ్చిందని తెలు స్తోంది. దీంతో ప్రస్తుత సీజ న్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ని ల్వ చేయడానికి అవ స రమైన స్థ లం అందుబాటులో లేకపోవడం మరో ప్రధాన సమ స్యగా మారిం ది. కొనుగోళ్లను వేగవంతం చే యాలంటే ముం దుగా గోదాము ల్లో పేరుకుపోయిన నిల్వలపై నిర్ణయం తీసు కోవడంతో పాటు ప్రత్యామ్నాయ నిల్వ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.
ముందుచూపు లేని ప్రణాళికతో రైతులకు నష్టం?
గోదాముల కొరతను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లను ఆల స్యం చేస్తున్నారా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నా యి. అ యితే కొనుగోళ్ల జాప్యానికి సం బంధించి అధికారుల వివరణ అందుబాటులో లేకపోవడంతో దీనిపై స్పష్టత రావా ల్సి ఉంది. ఏదేమైనా, సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముట్ట డం తో రైతులు పం డించిన ధాన్యాన్ని విక్రయించేందుకు ఇబ్బందు లు పడుతున్నా రు.ఇప్పటికైనా ప్రభుత్వం, అధి కార యంత్రాం గం సమన్వయం తో స్పందించి కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో పనిచే యిం చేలా చర్యలు తీసుకోవాలి. గో దాముల సమస్యను పరిష్కరిం చి, నాణ్యత ప్రమాణాలపై స్పష్ట తని స్తూ, రైతులకు సకాలంలో గిట్టుబాటు ధర అందేలా చూడా లి. లేదంటే ఇప్పటికే తగ్గిన దిగు బడులతో నష్టపోయిన అన్న దా తలకు ధాన్యం విక్రయ సమ స్యలు మరింత భారంగా మారే ప్ర మాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
Nalgonda Paddy purchase delay problems



