Saturday, October 24, 2026
More
    HomeOpinionNalgonda collector Chandrashekhar : నల్లగొండ బొట్టుగూడ పాఠశాల లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

    Nalgonda collector Chandrashekhar : నల్లగొండ బొట్టుగూడ పాఠశాల లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

    📰 Generate e-Paper Clip

    Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ కోమ టిరెడ్డి ప్రతీక్ ప్రాథమి క, ఉన్నత పాఠశాలలో పదవ త రగతి చదివే విద్యార్థులు పరీక్ష లో ప్రథమ ర్యాంకులు సాధిస్తే రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత ఖర్చుల తో ఢిల్లీ పర్యటనకు తీసుకె ళ్లనున్నారని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. విమాన ప్రయాణ ఖర్చులతో పాటు, ఇతర ఖర్చు లు, షాపింగ్ ఖర్చు లను కూడా ఆర్ అండ్ బి శాఖ మంత్రి భరి స్తారని, ఢిల్లీలోని ప్రముఖ పర్యా టక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పి స్తారని చెప్పారు.శనివారం జిల్లా కలెక్టర్ బొట్టు గూడలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్ర భుత్వ ప్రాథమిక, ఉన్నత పా ఠ శాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యా లు, విద్యా ప్రమాణాలు,మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

    7 తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, విద్య పు రోగతి, సమస్యలను అడిగి తె లుసుకున్నారు. ఉపాధ్యా యులు పాఠాలు ఎలా బోధిస్తున్నారని? చదువులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా ? అని ప్ర శ్నించారు. ఉపా ధ్యాయులు బాగా బోధిస్తున్నారని, తమకు ఎలాంటి ఇబ్బం దులు లేవని విద్యా ర్థులు కలెక్టర్‌కు తెలిపారు.

    అనంతరం పదవ తరగతిని సం దర్శించిన కలెక్టర్ విద్యార్థుల తో మాట్లాడుతూ పదవ తరగతి కష్ట పడి చదివి మంచి మా ర్కులు సాధించాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముం దుకుసాగాలని సూచించారు. రిఫ్లెక్షన్, నాన్‌ రిఫ్లెక్షన్‌కు సంబం ధించిన అంశాలపై ప్రశ్నించగా, విద్యార్థులు బో ర్డుపై సమాధా నాలను వివరించిన తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

    8,9,10 తరగతుల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులను గు ర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ కుమార్‌ ను ఆదేశిం చారు. తక్కువ మార్కు లు సా ధించిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ప్రతి వి ద్యార్థికి నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించి మెరుగైన మార్కులు సా ధించేలా బోధన అందించాలని చెప్పారు. విద్యా ర్థుల పరీక్షల జవాబు పత్రాలను పరిశీలించి, వారి అభ్యసన స్థాయిని అంచ నా వేశారు.

    మూత్రశాలలు పరిశీలించిన క లెక్టర్, నీటి కుళాయిల్లో లీకేజీ లు లేకుండా చూడాలని, అవసరమైన చోట కొత్త కుళాయి ల ను ఏ ర్పాటు చేయాలని ఆదేశించా రు.నీటి వృథాను అరి క ట్టేందుకు పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన క ల్పించాలని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో నీటి వి నియోగంపై మరింత అప్రమత్తంగా ఉండాల్సి న అవసరం ఉంద ని ,ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియో గించుకోవాలని, ఎక్కడా నీరు వృథా కాకుండా విద్యార్థులు బా ధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. పాఠశాలలో ప్రతిరో జూ ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులతో నీటి సంరక్షణ ప్ర తిజ్ఞ చేయించాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించారు.

    విద్యార్థులు చదువుతో పాటు, సామాజిక బాధ్యత అలవర్చు కోవాలని, నీటి సంరక్షణపై తమ ఇంటితోపాటు, పరిసర ప్రాం తాల్లోనూ ప్రచారం చేయాలని కలె క్టర్ పిలుపునిచ్చారు. ప్రభు త్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, విద్యార్థు ల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిం చడం, వెనుక బడిన విద్యార్థుల ను ముందుకు తీసుకురావడం ద్వారా మెరుగైన విద్యా ఫలితా లు సాధించాలని ఆయన ఉ పాధ్యాయులకు సూ చించారు. అడిషనల్ డైరెక్టర్ రా మాచారి, ఎంఈఓ అ రుంధతి, ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్, సు ధారా ణి, వెంకటేశ్వర్లు తదితరు లు ఉన్నారు.

        ఈనెల 28న  కమిషన్ పర్యటన

    నల్లగొండ టౌన్: ఈనెల 28న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నల్గొండ జిల్లాకు రా నున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపా రు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ప ర్సన్ 28వ తేదీ ఉ దయము 8 గంటల 15 నిమిషాలకు హైదరా బాదులో బయ లుదేరి ఉదయం 10 గంటల 15 నిమిషాలకు నల్గొండలోనిఆర్ అండ్ బిగెస్ట్ హౌ స్ కు చేరుకుంటారని తెలిపారు. ఉదయం 10 గంటల 15 నిమి షాల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోనే ఉండి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరిస్తార ని పేర్కొన్నారు. అంతేకాక స్థాని కం గా ప్రభుత్వ పాఠశాలలు, వ సతి గృహాలు, ఆస్పత్రులు సంద ర్శిస్తారని తెలిపారు.

    అనంతరం సాయంత్రం 6:30 గంటలకు బ యలుదేరి తిరిగి హైదరాబాద్ వెళ్తారని తెలిపారు. ఎవరైనా వారి సమస్యలకు సం బంధించిన ఫిర్యాదులను ఈ నె ల 28 వ నేరుగా గౌరవ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కు సమర్పించవ చ్చని వెల్లడించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.