— ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరాలో అక్రమాల ఆరోపణలు
–రూ.300 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రచారం
–ఎన్నికల వేళ ములుగులోనూ కలకలం
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణంలో ఉన్న లక్ష్మీ వెంక టర మణ మిల్లు, లక్ష్మీ సాయి ఇండ స్ట్రీస్, రాధాకృష్ణ మిల్లు లపై సీఐ డీ అధికారులు దాడులు నిర్వ హించినట్లు సమాచా రం. ఈ మి ల్లులకు సంబంధించి వొల్లాల మ ల్లికార్జున్, యాం సాని సంపత్, లెంకలపల్లి మధులను అదుపు లోకి తీసుకుని కరీంనగర్‌లోని సీ ఐడీ కార్యాలయానికి తరలించినట్లు తెలు స్తోంది. హుజూరాబా ద్ లో మరో మిల్లు యజమానిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఎఫ్‌సీఐకి లెవీ కింద సరఫరా చే యాల్సిన గ్రేడ్-ఏ రకం బి య్యం విషయంలో అవకతవకలు జరి గాయన్న ఆరోపణలపై ఈ చర్య లు చేపట్టినట్లు తెలుస్తోంది. అ యితే అరెస్టుల సం ఖ్య, కేసుల పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.సన్న వడ్లకు బదులుగా దొడ్డు బియ్యం సరఫరా చేశార న్న ఆరోపణలుఈ వ్యవహారంలో ప్రధానంగా వినిపి స్తున్నా యి. ఈ అక్రమాల వల్ల పౌర సరఫరాల శాఖకు సుమారు రూ.300 కోట్ల మేర నష్టం వాటిల్లి నట్లు గతంలో ప్రచురితమైన కథ నాలు పేర్కొన్నాయి. ఈ ఆరోప ణలపై దర్యాప్తు సంస్థలు లోతు గా విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఇప్పటివ రకు సంబం ధిత శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించ గా, తాజాగా సీఐ డీ రంగంలోకి దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది. అయితే ఆరోపణలు నిరూపి తమ య్యే వరకు సంబంధిత వ్య క్తులను దోషులుగా పరిగణించ లేం.
ములుగులో ఎన్నికల వేళ కలకలం
ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అ సోసియేషన్ ఎన్నికలు జరగ ను న్న వేళ ఆ సంఘం అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ను సీఐడీ అధికారు లు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎన్ని కలకు కొన్ని గం టల ముందు ఈ పరిణామం చోటుచేసు కో వ డంతో మిల్లర్లలో చ ర్చ మొదలైంది. అరెస్టులకు సం బంధించి న కారణాలు, దర్యాప్తు వివరాలపై స్పష్టత ఇవ్వాలని ప లువు రు మిల్లర్లు కోరుతున్నట్లు తెలుస్తోంది.
మిల్లింగ్ రంగంలో ఉత్కంఠ
రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లులపై సీఐడీ తనిఖీలు, మిల్లర్లను అ దుపులోకి తీసుకుంటున్నారన్న వార్తలతో మిగతా మిల్లర్లలో ఆం దోళన నెలకొంది. ఈ వ్యవహారం లో ఇంకా ఎవరెవరి పాత్ర వెలు గులోకి వస్తుంది? ప్రభుత్వానికి జరిగినట్లు ఆరోపిస్తున్న నష్టంపై దర్యాప్తులో ఎలాంటి వివరాలు బయటపడతాయి? అన్న అంశా లపై ఉత్కంఠ కొనసాగుతోంది.

