Tuesday, October 27, 2026
More
    HomeAndhrapradeshCm Revanth Reddy review on Tummidihatti Project : బిగ్ బ్రేకింగ్, తుమ్మిడిహెట్టిపై కీల...

    Cm Revanth Reddy review on Tummidihatti Project : బిగ్ బ్రేకింగ్, తుమ్మిడిహెట్టిపై కీల క ముందడుగు, 152 మీటర్ల ఎ త్తు ప్రతిపాద నపై మహారాష్ట్ర సా నుకూల సంకేతాలు

    📰 Generate e-Paper Clip

    –రేవంత్ రెడ్డి, ఫడ్నవీస్ భేటీ సక్సెస్‌
    –అధికారుల కమిటీతో సమగ్ర అధ్యయనానికి నిర్ణయం

    Cm Revanth Reddy review on Tummidihatti Project : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ సాగునీటి రంగానికి కీలక మైన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మరోసారి ఆశలు చిగురిం చాయి. ప్రాణహిత నదిపై నిర్మించ తలపెట్టిన బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలన్న తెలంగాణ ప్ర భుత్వ ప్రతి పాదనపై మహారాష్ట్ర ప్ర భుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే, తుది నిర్ణయా నికి ముందు సాంకేతిక, పర్యావరణ, ముంపు ప్రభావం, నీటి ల భ్యత వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించా యి. ముంబైలోని సహ్యా ద్రి ప్రభుత్వ అతిథి గృహంలో తెలంగా ణ ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య కీలక సమా వేశం జరిగింది. తెలంగా ణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పా టు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటిపారు దల శాఖ ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.

    152 మీటర్ల ఎత్తుతోనే ఎక్కువ ప్రయోజనం

    సమావేశంలో మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి తుమ్మిడిహెట్టి ప్రా జెక్టు ప్రాధాన్యతను వివరించారు. 20 16లో బ్యారేజీ ఎత్తును 148 మీ టర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరినప్పటికీ, ఆ ఎ త్తుతో తెలంగాణ తాగునీరు, సాగునీటి అవసరాలు పూర్తిస్థా యిలో తీరడం కష్టమని పేర్కొన్నారు.ప్రస్తుత విద్యుత్ అవస రాలు, పంపింగ్ ఖర్చులు, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, ప్రాజెక్టు నిర్వహణ వ్యయాలను పరిగణనలోకి తీ సుకుంటే గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలకు ప్రా ధా న్యం ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడం సాంకేతికంగా, ఆర్థికంగా ప్రయోజ నకరమైన ప్రత్యామ్నాయమని వివరించారు.మహారాష్ట్రలో బ్యారేజీ కారణంగా ముంపునకు గురయ్యే వ్యవసాయ భూ ములకు ఆ రాష్ట్ర భూసేకరణ నిబంధనలు, పరిహార విధానం ప్రకారం న ష్టపరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సి ద్ధంగా ఉందని స్పష్టంచేశారు.

    ఐదు దశాబ్దాల నిరీక్షణకు తెరపడేనా

    తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఆలోచన కు దాదాపు ఐదు దశాబ్దాల చరి త్ర ఉందని మంత్రి వివరించారు. 1975 అక్టోబర్ 6న అ ప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, మహారాష్ట్ర నాయ కత్వం మధ్య కుదిరిన ఒప్పందం నుంచి వివిధ దశల్లో సాగిన ప్రయత్నాలను ప్రస్తావించారు.సహజ వనరులు, సాంస్కృతిక వారసత్వం సమృద్ధి గా ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనుక బడిపోయిందని, ముఖ్యంగా గి రిజ నులు, ఆదివాసీలకు సాగు, తాగునీటి సదుపాయాలు అం దిం చాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రతినిధి బృందం వివ రించింది.

        రెండు రాష్ట్రాల అభివృద్ధికి వారధి

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ట్లాడుతూ తెలంగాణ, మహా రాష్ట్ర మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక అనుబంధాన్ని గుర్తు చేశారు. కొమురం భీమ్ సాగించిన ‘జల్, జంగిల్, జమీన్’ పో రాటాన్ని ప్రస్తావిస్తూ ఆదిలాబాద్ ప్రాంత గిరిజనుల జీవితాల్లో అభివృ ద్ధి వెలుగులు నింపాల్సిన అవసరాన్ని వివరించారు. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు కేవలం నీటిపారుదల ప్రాజెక్టు మాత్రమే కాదని, రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి దోహ దపడే కీలక ప్రా జెక్టు అని పేర్కొన్నారు. ఆదిలా బాద్‌లో ప్రతి పాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సదుపాయాలు అందుబా టులోకి వస్తే రవాణా, ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశా లు మెరుగుపడతాయని తెలిపారు. వీటి ద్వారా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకూ ప్ర యోజనం కలుగుతుందని వివ రిం చారు.వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం కోసం పరస్పర సహకారంతో ముందుకు సాగాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు.

    ఫడ్నవీస్ సానుకూల స్పందన, కానీ అధ్యయనమే కీలకం

    తెలంగాణ ప్రతిపాదనపై మహా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫ డ్నవీస్ సానుకూలంగా స్పందిం చారు. తెలంగాణతో సన్నిహి త సంబంధాలు ఉన్నాయని, రెండు రాష్ట్రాలు స్నేహభావంతో సమ స్యలను పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు. బ్యా రేజీ ఎత్తు ను పెంచే ప్రతిపాదనను పునఃప రిశీలించేందుకు సి ద్ధంగా ఉన్నా మని, అయితే మహారాష్ట్ర ప్రజల కు, వ్యవసా య భూములకు ప్ర తికూల ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు. సాంకేతిక, పర్యా వరణ, పరిపాలనాపరమైన అం శా లను క్షుణ్ణంగా పరిశీలించిన త ర్వాతే తుది నిర్ణయం తీసుకో వాల్సి ఉంటుందని తెలిపారు.

       అధికారుల కమిటీ ఏర్పాటు ప్రతిపాదన

    తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై తదుప రి కార్యాచరణ కోసం ఇరు రా ష్ట్రాల నీటిపారుదల శాఖ ము ఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అ ధికారుల కమిటీని ఏర్పాటు చే యాలని ఫడ్నవీస్ ప్రతిపా దించారు.ఈ కమిటీ ప్రధానంగా కింది అంశాలపై అధ్యయనం చేయనుంది.బ్యారేజీ ఎత్తు పెంపుతో కలిగే ప్రయోజనాలు, సాంకేతిక సాధ్యాసాధ్యాలు,ప్రాణహిత నదిలో నీటి లభ్యత, నీటి పంపిణీకి సం బంధించిన అంశాలు, మహారా ష్ట్రలో ముం పునకు గురయ్యే భూములు, ప్రభావిత ప్రాంతాల విస్తీర్ణం, భూ సేకరణ, పరిహారం చెల్లింపు విధానాలు, పర్యావరణ ప్రభావం, ప్రత్యామ్నాయ ప్రతిపా దనలు, తదుపరి సమావేశాలు, కాలప రిమితులు, ప్రాజెక్టు అమ లుకు అవసరమైన కార్యాచరణ ప్ర ణాళిక, ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం (CWC) పరిధిలో అవసరమైన సాంకేతిక అధ్య యనాలు కూడా కొన సాగనున్నాయి.

        రైతులు, గిరిజనుల్లో కొత్తఆశలు

    తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెం పుపై మహారాష్ట్ర సానుకూ లంగా స్పందించడం తెలంగాణకు ము ఖ్యమైన పరిణామంగా భావిస్తు న్నారు. అయితే 152 మీటర్ల ప్ర తిపాదనకు ఇంకా తుది ఆమో దం లభించలేదు. అధికారుల అధ్యయనం, ముం పు ప్రభావంపై స్పష్టత, ఇరు రాష్ట్రాల మధ్య తదుపరి చర్చలే ప్రాజెక్టు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.దశాబ్దాలుగా సా గునీరు, తాగునీ టి సదుపాయాల కోసం ఎదురు చూస్తున్న ఆ దిలాబాద్ ప్రాంత ప్ర జల ఆకాంక్షలు నెరవేరాలంటే ఈ చర్చలు కార్యరూపం దాల్చడం కీ లకం. ఇరు రాష్ట్రాల సమన్వ యం తో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ముందుకు సాగితే తెలంగాణలో ని వెనుకబడిన ప్రాంతాల అభివృ ద్ధికి కొత్త దిశ ఏర్పడే అవకాశం ఉంది.

    Cm Revanth Reddy review on Tummidihatti Project

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.