Tuesday, October 27, 2026
More
    HomeOpinionNalgonda collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల క పిలుపు, నాణ్యమైన ధాన్యం...

    Nalgonda collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల క పిలుపు, నాణ్యమైన ధాన్యం తీసుకురండి, మద్దతుధర పొం దండి

    📰 Generate e-Paper Clip

    –ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యా మ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి

    Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం పండించిన రైతులు ప్రభుత్వం ప్రక టించిన కనీస మద్దతు ధరను పొందా లంటే నాణ్యతా ప్రమాణా లను తప్పనిసరిగా పాటించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశే ఖర్ సూచించారు. ఎల్‌నినో ప్రభా వంతో నీటి లభ్యతపై ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశము న్నందున రైతులు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని పిలుపుని చ్చారు. మార్కె ట్లో డిమాండ్ ఉ న్న పంటలను సాగు చేస్తే గిట్టు బాటు ధరతో పాటు అధిక లాభా లు పొందే అవకాశం ఉంటుందని పేర్కొ న్నారు.సోమవారం నల్గొం డ జిల్లా కేంద్రం సమీపంలోని ఆ ర్జాలబావిలో ప్రాథమిక వ్యవ సా య సహకార సంఘం ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన 2026 ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని న ల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీని వాసరెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారం భించారు.

    గ్రేడ్‌-ఏ ధాన్యానికి రూ.2,461 మద్దతు ధర

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్‌-ఏ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,4 61, సాధారణ రకం ధాన్యానికి రూ.2,441 మద్దతు ధర ప్రకటిం చిందని తెలిపారు. సన్న ధా న్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ అం దిస్తోందని వివరించారు.రైతులు ధాన్యాన్ని కొను గోలు కేంద్రాలకు తీసుకొచ్చే ముందు తాలు, తరు గు, చెత్త, మ ట్టిపెళ్లలు, దుమ్ము లేకుండా శుభ్రం చేసుకోవాలని సూచించా రు. ధాన్యంలో తేమ శాతం 17లోపు ఉండేలా చూసు కోవా లని స్పష్టం చేశారు. అప్పు డే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందేందుకు వీలుంటుందని తెలిపారు.

      జిల్లాలో 399 కొనుగోలు కేంద్రాలు

    ఈ ఖరీఫ్ సీజన్‌లో నల్గొండ జిల్లా కు సన్న, దొడ్డు రకాల ధాన్యం క లిపి సుమారు 6.75 లక్షల మెట్రి క్ టన్నులు వచ్చే అవకాశం ఉం దని కలెక్టర్ అంచనా వెల్లడించా రు. ధాన్యం సేకరణ కోసం జిల్లా వ్యాప్తంగా 399 కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. రైతులకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా అవసరమైన ఏ ర్పాట్లు చేసినట్లు పేర్కొ న్నా రు.సన్న ధాన్యం పండించిన రైతుల కు మద్దతు ధరతో పాటు బోనస్ అందేలా ప్రతి కొనుగోలు కేంద్రం లో వ్యవసాయ విస్త రణ అధికా రులను నియమించి, రైతులు తీవిసుకొచ్చే సన్న ధాన్యం రకాల ను గుర్తించి విశ్లేషించాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశిం చారు.

         ప్రత్యామ్నాయ పంటలే మేలు

    మార్కెట్లో సన్న ధాన్యానికి డి మాండ్ ఎక్కువగా ఉండటంతో మిల్లర్లు రైతుల పొలాల వద్దకే వె ళ్లి కొనుగోలు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. మరోవైపు దొడ్డు ధా న్యానికి ఇతర ప్రాంతా లు, రాష్ట్రా ల నుంచి డిమాండ్ తక్కువగా ఉండటంతో ధరల విషయంలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని వివరించా రు. ఎల్‌నినో పరిస్థితు లను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటిని పొదుపుగా వినియో గించుకోవాలని సూచించారు. వరి సాగు పై మాత్రమే ఆధారపడ కుండా కూరగాయలు, ఉద్యాన పంట లు, ఆరుతడి పంటల వం టి ప్రత్యామ్నాయ పంటలను సా గు చేయాలని కోరారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో రైతులు సమిష్టి వ్యవ సాయం చేపట్టి, మార్కెట్‌లో డి మాండ్ ఉన్న పంటలను ఎంచు కుంటే మెరుగైన ఆదాయం పొం దవచ్చని తెలిపారు.

    రైతులకు ప్రత్యామ్నాయ పంట లు, సమిష్టి వ్యవసాయం, నీటి పొదుపుపై అవగాహన కల్పిం చేందుకు ప్రతి మంగళవారం, శు క్రవారం రైతు వేదికల్లో ‘రైతు నే స్తం’ కార్యక్రమాలు నిర్వహిస్తు న్నట్లు వెల్లడించారు. రైతులు ఈ కార్యక్రమాలకు హాజరై వ్యవసా య నిపుణుల సూచనలు పొం దాలని కోరారు. సమిష్టి వ్యవసా యం చేసే రైతులకు, ప్రత్యామ్నా య పంటలు సాగు చేసే వారికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

    ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం

    నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ఖరీఫ్ సీజన్ మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ ను కొనుగోలు చేసేం దుకు చర్య లు తీసుకుంటుందని తెలిపారు. సన్న ధాన్యంలో ఏడు రకాలను ప్రభుత్వం సూచించిందని, వాటి ని పండించిన రైతులకు క్వింటా ల్‌కు రూ.500 బోనస్ అందిస్తోందని చెప్పా రు.ఎల్‌నినో ప్రభావం తో నీటి లభ్యత తగ్గే అవకాశాల ను దృష్టిలో ఉంచుకొని రైతులు వరిసాగుకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ఎంచుకోవాలని ఆ మె సూచించారు.

    ఈ కార్యక్రమంలో రెవెన్యూ అద నపు కలెక్టర్ జె. శ్రీనివాస్, పీఏసీ ఎస్ చైర్మన్ నాగరత్నం రాజు, ఆ దర్శ రైతు రామిరెడ్డి, నల్గొండ ఆ ర్డీవో వై. అశోక్ రెడ్డి, జిల్లా వ్యవ సాయ అధికారి వినోద్ కుమార్, జిల్లా సహకార అధికారి మమత, పౌరసరఫ రాల శాఖ జిల్లా మేనేజ ర్ రాంపతి నాయక్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, మార్కెట్ కమి టీ చైర్మన్ హైమావతి, మాజీ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రె డ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.