Tuesday, October 27, 2026
More
    HomeOpinionRation Dealers fights on Their problems : రేషన్ డీలర్ల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

    Ration Dealers fights on Their problems : రేషన్ డీలర్ల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

    📰 Generate e-Paper Clip

    —గౌరవ వేతనం రూ.5 వేలు, క్విం టాలుకు రూ.300 కమీషన్ ఇవ్వాలి
    –నల్లగొండ జిల్లా కేంద్రంలో డీలర్ల భారీ ర్యాలీ

    Ration Dealers fights on Their problems : ప్రజా దీవె న,నల్లగొండ టౌన్: రేషన్ డీలర్ల దీర్ఘకాలిక సమస్యలను ప్రభు త్వం ఇకనైనా పరిష్క రించాలని ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్ల గొండ జిల్లా నాయకులు డిమాం డ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చే యడంతో పాటు గౌరవ వేతనం, కమీషన్ పెంపు, ఉచిత రవాణా, బియ్యం తూకంలో పారదర్శకత వంటి సమస్యలను పరిష్కరిం చాలని కోరుతూ డీలర్లు నల్లగొం డ పట్టణంలో ఆందోళన చేపట్టా రు.గడియారం సెంటర్ నుంచి క లెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిం చిన డీలర్లు తమ డిమాండ్లను ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అ నంతరం కలెక్టరేట్ కార్యాల య ఏ ఓ మోతీలాల్‌కు వినతిపత్రం అం దజేశారు.

    హామీ మేరకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం

    కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్ర కటించిన విధంగా ప్రతి రేషన్ డీ లర్‌కు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లించాలని, క్వింటాలు బియ్యంపై రూ.300 కమీషన్ ఇ వ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాల నిర్వ హణ ఖర్చులు పెరుగుతున్న నేప థ్యంలో డీలర్లకు తగిన ఆర్థిక భ రోసా కల్పించాలని కోరారు.

    రేషన్ షాపులకే ఉచితంగా సరు కుల రవాణా

    ఫుడ్ సెక్యూరిటీ చట్టం ప్రకారం రే షన్ సరుకులను దుకాణాల వద్ద కే ఉచితంగా రవాణా చేసి అం దించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లో అమలవుతున్న విధా నాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని కోరారు. గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు సర ఫరా చేసే బియ్యాన్ని ఖచ్చితమై న తూకంతో అందించి, డీలర్లపై అదనపు భారాన్ని మోపకుండా చూడాలని స్పష్టం చేశారు.

    డీలర్లకు అనేక ఇబ్బందులు

    గత 20 నెలలుగా దొడ్డు బియ్యం నిల్వలు రేషన్ దుకాణాల్లోనే ఉం డిపోవడంతో డీలర్లు అనేక ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. నిల్వలు, తరుగుతో ఆర్థిక నష్టాలు పెరుగు తున్నాయని పేర్కొంటూ క్వింటా లుకు 10 శాతం తరుగు సడలిం పు కల్పించాలని డిమాండ్ చేశా రు.బియ్యం నిల్వలు, తూకంలో తేడాలు, తరుగు తదితర అంశా ల కారణంగా డీలర్లపై పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని తగ్గిం చేందుకు ప్రభుత్వం తక్షణ చర్య లు తీసుకోవాలని కోరారు. రేషన్ వ్యవస్థ సజావుగా కొనసాగాలం టే డీలర్ల న్యాయమైన సమస్యల కు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

    డీలర్ల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలి

    రేషన్ పంపిణీ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న డీలర్ల సమస్య లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, ఎన్నికల హామీల అ మలుతో పాటు పెండింగ్ సమ స్యల పరిష్కారానికి చర్యలు తీ సుకోవాలని అసోసియేషన్ నా యకులు కోరారు.ఈ కార్య క్ర మంలో ఫెయిర్ ప్రైస్ షాప్ డీల ర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పొరెపల్లి నాగరాజు, జిల్లా కోశాధికారి కోటగిరి సూర్య నారాయణ, మిర్యాలగూడ డివి జన్ అధ్యక్షుడు పగిళ్ల వెంకటేశ్వ ర్లు, దేవరకొండ డివిజన్ అధ్యక్షు డు కొర్ల శంకర్ నాయక్, నల్లగొం డ డివిజన్ అధ్యక్షుడు మీ సత్తి రెడ్డి, బొల్లా వేణుగోపాలరావు, స ముద్రాల యాదయ్య తదితరు లు పాల్గొన్నారు.

    Ration Dealers fights on Their problems

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.