–రూ.50 లక్షల విలువైన నగదు, కార్లు, ఇతర సామగ్రి స్వాధీనం
ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాల రంగంలోకి..
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్, ఇతర ట్రాన్స్ ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లు, ఆయి ల్, ఇతర విలువైన భాగాల ను దొంగిలిస్తున్న ఘటనలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రత్యేక దృష్టి సారించారు. మిర్యాలగూడ డీఎస్పీ జి. రవి ఆధ్వ ర్యంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి, మి ర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ జె. సోమనర్సయ్య, మిర్యా లగూడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.ఎన్.డి. ప్ర సాద్, వేముల పల్లి ఎస్ఐ వి. సురేశ్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
వేములపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోని నాగార్జునసాగర్ ఎడ మ కాలువకు చెందిన ఎల్-15 లిఫ్ట్ ఇరి గేషన్ స్కీమ్‌లో 500 కేవీఏ ట్రా న్స్ఫార్మర్ నుంచి 300 కిలోల కా పర్, 250 లీటర్ల ఆ యిల్ చోరీకి గురైన ఘటనపై ఆగస్టు 22, 20 26న కేసు నమో దైంది. క్రైమ్ నం బర్ 198/2026 కింద దర్యాప్తు చేపట్టిన పో లీసులు, ఇతర ప్రాం తాల్లో జరిగిన చోరీలతోనూ ఈ ముఠాకు సంబంధాలున్నట్లు గుర్తించారు.
వాహన తనిఖీలతో బయట పడిన నేరాల చిట్టా
అక్టోబర్ 28న మధ్యాహ్నం వేములపల్లి గ్రామ శివారులోని సూర్యాపేట ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు ని ర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న ముగ్గురు వ్య క్తుల్లో చంద్ పా షా అనే పాత నేర స్థుడిని గుర్తించారు. ట్రాన్స్ఫార్మర్ చోరీ కేసు లో అతడిపై గతంలో నూ కేసు ఉన్నట్లు పోలీసులు తె లిపా రు.
కారులో కట్టర్లు, పానాలు, గ్లౌజు లు వంటి సామగ్రి లభించ డం తో అనుమానం మరింత బలపడింది. వారిని విచారించగా ట్రా న్స్ఫా ర్మర్ల నుంచి కాపర్, ఆయిల్, ఇత ర సామగ్రిని దొంగిలిం చి హైదరాబాద్‌లోని హయత్‌నగర్ ప్రాంతంలో పాత సామగ్రి వ్యాపారికి విక్ర యించినట్లు వెల్లడించినట్లు పోలీసులు పేర్కొ న్నారు. దొంగిలించిన సామగ్రి విక్రయానికి సంబంధించిన నగ దు, కాపర్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో నాలుగో నింది తు డిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
రాత్రివేళల్లో ట్రాన్స్ఫార్మర్లే లక్ష్యం
నిందితులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించా లనే ఉద్దేశంతో ముఠాగా ఏర్పడినట్లు పోలీసుల విచారణలో తే లింది. గ్రామాలకు దూరంగా ఉ న్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, రా త్రివేళల్లో కార్లలో అక్కడికి చేరు కునేవారు. కట్టర్లు, పానాల సా యంతో ట్రాన్స్ఫార్మర్లను తెరిచి కాపర్ వైర్లు, ఆయిల్, అ ల్యూమినియం వైర్లను అపహరించే వారు.దొంగిలించిన సామ గ్రిని పాత వ స్తువుల వ్యాపారులకు విక్ర యించి వచ్చిన డబ్బు ను పంచుకునే వారని పోలీసులు తెలిపారు. పోలీసులకు అ నుమానం రాకుండా ఉండేందుకు నకిలీ నంబర్ ప్లేట్లు ఉప యోగించడం, మహి ళలను కూడా వాహనాల్లో వెంట తీసుకె ళ్లడం వంటి పద్ధతులను అనుస రించినట్లు విచారణలో వెల్ల డైంది.
నల్గొండ జిల్లాలోనే 18 చోరీలు
ఈ ముఠా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 29 నేరాలకు పాల్పడి న ట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో 25, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు.నల్గొండజిల్లాలో వేములపల్లి, వాడపల్లి, మాడ్గుల పల్లి, అడవిదేవులపల్లి, మి ర్యాలగూడ టూ టౌన్, తిరుమలగిరి సాగర్, హాలియా, త్రిపు రారం, కనగల్, చింతపల్లి, నేరెడుగొ మ్ము, దేవరకొండ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 నేరాలకు పా ల్పడినట్లు తెలిపారు. తెలంగాణ లోని ఇతర ప్రాంతాల్లో మరో ఏ డు, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు ప్రాంతం, మాచవరం, దాచేపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో నాలుగు నేరాలకు సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు.
నలుగురు అరెస్ట్.. మరో ఐదుగురి కోసం గాలింపు
ఈ కేసులో షేక్ చంద్ పాషా(26), రామావత్ సూర్య (19), గ లబ సాయి కిరణ్ (19), ఇస్లావత్ దే శిరామ్ (24)లను అరెస్ట్ చేసిన ట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో దేశిరామ్ దొంగి లించిన సామగ్రిని కొనుగోలు చేసిన వ్యక్తిగా పేర్కొన్నారు. ము ఠాకు చెందిన మరో ఐదుగురు—సంతోష్, నాన్కు, మోడల్ సా యి, ప్రియా, సు నీత పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తు న్నట్లు తెలిపారు.
పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు
కేసును ఛేదించడంలో కీలక పా త్ర పోషించిన సీసీఎస్ ఇన్ స్పెక్టర్ జితేందర్ రెడ్డి, మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ సో మనర్సయ్య, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.ఎన్.డి. ప్రసాద్, ఎస్ఐలు, సీ సీఎస్ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. వారికి రివార్డులు ప్ర క టించినట్లు తెలిపా రు.ట్రాన్స్ఫార్మర్ల చోరీలతో ఇబ్బందులు ఎ దుర్కొంటున్న రైతులకు ఈ అరెస్టులు ఊరటనిచ్చాయని పో లీసులు పేర్కొన్నారు. వ్యవసా య విద్యుత్ సరఫరాకు అంత రాయం కలిగించే దొంగతనాలపై కఠినచర్యలు కొనసాగిస్తా మని స్పష్టం చేశారు.


