Wednesday, October 28, 2026
More
    HomeతెలంగాణMassive IAS transfors in Telangana : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు,...

    Massive IAS transfors in Telangana : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, కీలక శాఖలకు కొత్తబాధ్యతలు

    📰 Generate e-Paper Clip

    –జయేష్ రంజన్, వికాస్ రాజ్ స హా పలువురు సీనియర్ అధికా రులకు స్థానచలనం
    — పలుశాఖల్లో అదనపు బాధ్య తల కేటాయింపు

    Massive IAS transfors in Telangana  : ప్రజా దీవెన, హై దరాబాద్: తెలంగాణ రాష్ట్ర పరి పాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉం చుకుని రా ష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, వివిధ శాఖల్లో కొత్త పోస్టింగ్‌లు, పూ ర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) కేటాయిస్తూ ఉ త్తర్వులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి, ఇంధనం, పంచాయ తీ రాజ్, గ్రామీ ణాభివృద్ధి, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం తది తర కీలక శాఖల్లో ఈ మార్పులు జరిగాయి.

    కీలక అధికారుల బదిలీలు.. కొత్త బాధ్యతలు

    జయేష్ రంజన్‌కు పర్యావరణ శాఖ బాధ్యతలు ఇవ్వగా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐ ఏఎస్ అధికారి జయేష్ రంజన్‌ను మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌ మెంట్ (హెచ్‌ఎండీఏ పరిధి) శాఖ నుంచి పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖకు బదిలీ చేశారు. అదనంగా ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా పూర్తి అదనపు బా ధ్యతలు అప్పగించారు. క్రీడలు, హెరిటేజ్ తెలంగాణ విభాగాల ఎఫ్‌ఏసీ బాధ్యతల నుంచి ఆయ నను తప్పించారు.

         వికాస్ రాజ్‌కు ఇంధన శాఖ

    రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్ర త్యేక ప్రధాన కార్యదర్శిగా ఉ న్న వికాస్ రాజ్‌ను ఇంధన శాఖ ప్ర త్యేక ప్రధాన కార్యదర్శిగా నియ మించారు. ఆయన స్థానంలో ర వాణా, రోడ్లు భవనాల శాఖ కా ర్యదర్శిగా ఇళంబరితి కె. నియ మితులయ్యారు. అదనంగా ర వాణా కమిషనర్ బాధ్యతలు కూ డా ఆయనకు అప్పగించారు.

    నవీన్ మిట్టల్‌కు పంచాయతీ రాజ్ బాధ్యతలు

    నవీన్ మిట్టల్‌ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ని యమించారు. గతంలో ఈ బా ధ్యతలు నిర్వహించిన ఎం. దాన కిషోర్ స్థానంలో ఆయన బాధ్య తలు చేపట్టనున్నారు.

        శైలజ రామయ్యర్‌కు రెవెన్యూశాఖ

    శైలజ రామయ్యర్‌ను రెవెన్యూ శాఖలోని ఎండోమెంట్స్ విభా గానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వాణి ప్ర సాద్‌కు అదనపు బాధ్య తలువైఏటీ అండ్ సీ శాఖ ప్రత్యేక ప్ర ధాన కార్యదర్శిగా ఉన్న ఎ. వాణి ప్రసాద్‌కు క్రీడలు, హెరిటేజ్ తెలంగాణ విభాగాల పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించా రు.

    రాహుల్ బోజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ ఎఫ్‌ఏసీ

    రెవెన్యూ (డీఎం) శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బోజ్జాకు గిరి జన సంక్షేమ శాఖ ప్రధాన కార్య దర్శి బాధ్యతలను అదనంగా అ ప్పగించారు. బీసీ సంక్షేమ శాఖ ఎఫ్‌ఏసీ బాధ్యతల్లోనూ ఆ యన కొనసాగనున్నారు.

    సర్ఫరాజ్ అహ్మద్‌కు హెచ్‌ఎం డీఏ బాధ్యతలు

    హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ క మిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అ హ్మద్‌ను మెట్రోపాలిటన్ ఏరి యా, పట్టణాభివృద్ధి శాఖ కార్య దర్శిగా నియమించారు. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మ ల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేష న్ల ప్రత్యేక అధికారి బాధ్య త లను కూడా ఎఫ్‌ఏసీ కింద అప్పగించారు.

    శృతి ఓఝాకు మహిళా, శిశు సంక్షేమ శాఖ

    శృతి ఓఝాను మహిళా, శిశు అభివృద్ధి, షెడ్యూల్డ్ కులాల శా ఖ ప్రత్యేక కార్యదర్శిగా నియ మించారు.తెలంగాణ రైతు విద్యుత్ పంపి ణీ కంపెనీ లిమిటెడ్ (TGSPDC L) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న మహమ్మద్ ముషారఫ్ అలీ ఫరూఖీని ఆరోగ్య, కుటుంబ సం క్షేమ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశా రు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అం డ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ బా ధ్యతలను కూడా ఆయనకు పూ ర్తి అదనపు బాధ్యతలుగా అప్ప గించారు. అదే సమయంలో TG SPDCL చైర్మన్, మేనేజింగ్ డైరె క్టర్ బాధ్యతలను ఎఫ్‌ఏసీ కింద కొనసాగించనున్నారు.మహిళా, శిశు అభివృద్ధి, షెడ్యూల్డ్ కు లాల శాఖ డైరెక్టర్‌గా డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణను నియమించారు.

    TGREDCO బాధ్యతలు జితేష్ వి. పాటిల్‌కు

    TGSPDCL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్‌కు తె లంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (TGR E DCO) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను అద నం గా అప్పగించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన మహ మ్మద్ ముషారఫ్ అలీ ఫరూఖీని ఆ బాధ్యతల నుంచి తప్పించా రు.

    పరిపాలనలో సమన్వయమే లక్ష్యం

    వివిధ శాఖల్లో బాధ్యతల మా ర్పులు, అదనపు బాధ్యతల కే టాయింపులతో ప్రభుత్వ పరిపా లనా వ్యవస్థలో కీలక మార్పు లు చోటుచేసుకున్నాయి. ఆయా శా ఖల కార్యకలాపాలను సమన్వ యంతో ముందుకు తీసుకెళ్లడం, పరిపాలనా అవస రాలకు అను గుణంగా అధికారుల సేవలను వినియోగించు కోవడం ఈ ఉత్త ర్వుల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

    Massive IAS transfors in Telangana

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.