Nalgonda Horrific road accident : ప్రజా దీవెన, నల్ల గొండ క్రైమ్: రోడ్డు నిర్మాణ పనులు ఓకార్మికుడి ప్రాణాలను బలిగొన్నాయి. పని చేస్తున్న సమయంలో కాంక్రీట్ మిల్లర్ వె న క్కి వచ్చి ఢీకొనడంతో తీ వ్ర గాయాలపాలైన యువ కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద ఘటన నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుం ది. నల్లగొండ రూరల్ ఎస్సై శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకా రం బీహార్ రాష్ట్రానికి చెందిన బోలా కుమార్ మహాతో (21) కొంతకాలంగా రోడ్డు నిర్మాణ కా ర్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ము షంపల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా, వెనక్కి వచ్చిన కాంక్రీట్ మిల్లర్ అత నిపై నుంచి వెళ్లింది. దీంతో తీవ్రగాయాల పాలైన బోలా కుమా ర్ మహాతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

యువ కార్మికుడి మృతితో తోటి కార్మికుల్లో విషాదం నెలకొంది. మృతుడి సోదరుడు రామచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు న ల్లగొండ రూరల్ పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు చేప ట్టారు. రోడ్డు నిర్మాణ పనుల్లో చోటుచేసుకున్న ఈ ప్రమాదం కా ర్మికుల భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
