–రూ.20 కోట్లతో 3.5 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన
–ఏడాదిలో నల్లగొండ రూపురేఖ లు మారుస్తాం
Nalgonda Mayor Burri Chaitanya Srinivas Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులకు వేగం పెంచుతున్నా మని నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పార్టీల కతీతంగా నగరంలోని అన్ని డివిజన్లలో సమానంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. రాబో యే ఏడాదిలో నల్లగొండ నగర రూపు రేఖలు మారేలా ప్రణాళి కాబద్ధంగా ముందుకు సా గుతున్నామని తెలిపారు.మంత్రి కో మటిరెడ్డి వెంక టరెడ్డి స హకారంతో సాగర్ రోడ్డులో వైఎస్సార్ వి గ్రహం నుంచి చర్లగౌరారం రోడ్డు వరకు సుమారు 3.5 కి లో మీటర్ల మేర చేపట్టనున్న ఆరులైన్ల రహ దారి విస్తరణ పనుల కు శుక్రవారం మేయర్ శంకు స్థాపన చేశారు. స్థానిక కార్పొరే ట ర్, పార్టీ నాయకు లు, ప్రజాప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. సాగర్ రోడ్డులో తర చూ రోడ్డు ప్రమాదాలు జరుగుతు న్నా యనే విషయం తమ దృష్టికి రావడంతో ఇటీవల స్వయంగా రహదారిని పరిశీలించా మని చె ప్పారు. ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్య లకు శాశ్వ త పరిష్కారం చూపేలా డివైడర్, సెంట్రల్ లై టింగ్ తో ఆరులైన్ల రహదారిని నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన సానుకూలంగా స్పందించి ఆర్ అండ్ బీ శాఖ ద్వారా రూ .20 కోట్ల నిధులు మంజూరు చేశార ని తెలిపారు.
నగరంలో ఇప్పటికే కోట్లాది రూ పాయలతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పానగల్‌లోని చా యా సోమేశ్వరాలయ అభివృద్ధికి ఇటీ వల మంత్రి రూ.20 కో ట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. పానగల్ నుంచి డీ ఈఓ కార్యాల యం వరకు రహదారి విస్తరణ పనులు కూడా చేప ట్టనున్నట్లు వెల్లడించారు. అంతేకా కుండా నల్లగొండలో పర్యా టక, ఆధ్యాత్మిక రంగా లకు మరింత ప్రాధా న్యతనిస్తూ బ్రహ్మం గారి గుట్ట, లతీఫ్ సాబ్ గుట్టలకు ఘాట్ రోడ్ల నిర్మాణానికి చ ర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.మంత్రి సహకారంతో నల్ల గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆధు నిక సౌకర్యాలతో కూడి న స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని మేయర్ పేర్కొన్నా రు. అభివృద్ధి పనుల్లో ఏ ఒక్కడి విజన్‌ను నిర్లక్ష్యం చేయబోమని స్పష్టం చేశారు. నగరాభివృద్ధికి నిధులు మంజూ రు చేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి పాలకవర్గం, పట్ట ణ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు
నల్లగొండ మాజీ జెడ్పీటీసీ, పట్టణ పార్టీ మాజీ అ ధ్యక్షుడు గు మ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సహకారంతో నల్లగొండ పట్టణంలో సుమారు రూ.2 వేల కోట్ల తో వివిధ అభివృద్ధి పనులు కొన సాగుతున్నాయని తెలి పారు. సాగర్ రోడ్డులో 3.5 కిలోమీటర్ల ఆరులైన్ల రహదారి ని ర్మాణానికి ఆర్ అండ్ బీ శాఖ ద్వారా రూ.20 కోట్లు మంజూర య్యాయని వివరించారు.
రాబోయే ఏడాదిలో నల్లగొండ నగరంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని, పట్టణ రూపురేఖల్లో గణ నీయమైన మార్పులు వస్తా యని ధీమా వ్యక్తం చే శారు. కోట్లాది రూపాయలతో అభి వృద్ధి ప నులు జరుగుతున్నప్పటికీ ప్రతి పక్షాలు వాస్తవాలను వి స్మరించి సోషల్ మీడియాను వేదికగా చే సుకుని అసత్య ప్ర చారాలకు పా ల్పడుతున్నాయని విమ ర్శించారు. ప్రజావిశ్వా సం కోల్పోయిన ప్రతిపక్షాల ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్ర ఫ్ అలీ అమేర్, మాజీ ము న్సిపల్ వైస్ చైర్మన్ అ బ్బగోని ర మేష్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ పా లకూరి సుమలత సంతోష్, ప ట్ట ణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ డ్ల శ్రీని వాస్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మ న్ జూకూరి రమేష్, కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు గుండబోయిన వెంకన్న యాదవ్, మామిడి కార్తీక్, రేగట్ట లింగస్వా మి గౌడ్, ఇటికాల శ్రీనివాస్, ఏదు ళ్ళ శ్రీధర్ రెడ్డి, వజ్జ రమేష్ యా దవ్, ప్రదీప్ నాయ క్, చిన్నాల జా నయ్య, దీప్లా నాయక్, పిల్లి కృ ష్ణం రాజు, సట్టు శంకర్, జూలకం టి శ్రీనివాస్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
Nalgonda Mayor Burri Chaitanya Srinivas Reddy



