–రూ.24.76 కోట్ల సైబర్ మోసం కేసులో కీలక తనిఖీలు
–స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు
ED Raids in Hyderabad : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట రేట్ (ఈడీ) అధికారులు ఏకకా లంలో మూడు ప్రాంతాల్లో సోదా లు నిర్వహించడం కలకలం రేపిం ది. రూ.24.76 కోట్ల సైబర్ మో సం కేసుకు సంబంధించి ఈ తని ఖీలు చేపట్టినట్లు సమాచారం.
ఈ కేసులో ఆరోపణలు ఎదు ర్కొంటున్న అలంరాజు సత్యనా రాయణ మూర్తికి చెందిన నివా సాలు, కార్యాలయాల్లో ఈడీ అ ధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడితే భారీ లా భాలు వస్తాయంటూ ఆశ చూపి పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఫోన్ కాల్స్, సోషల్ మీడియా సందేశాల ద్వారా బాధితులను సంప్రదించి పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆరోపణలు వెల్లడి స్తున్నాయి. ఈ వ్యవహారంలో నగదు లావాదేవీలు, ఆర్థిక లావా దేవీల వివరాలు, కీలక పత్రాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్న ట్లు తెలుస్తోంది.మూడు ప్రాంతా ల్లో సాగుతున్న ఈ సోదాలతో సైబర్ మోసం కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వ చ్చే అవకాశం ఉంది. ఈడీ తని ఖీలు పూర్తయి న తర్వాత దర్యా ప్తులో వెల్లడ య్యే వివరాలపై ఆ సక్తి నెలకొంది.

