–జ్యోతిర్లింగాలు, అయోధ్య, కాశీ సహా పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం
–నవంబర్ 10 నుంచి డిసెంబర్ 27 వరకు ప్రత్యేక యాత్రలు –రూ.15,800 నుంచే ప్యాకేజీలు ప్రారంభం
IRCTC Bharat Gaurav Tourist Trains : ప్రజా దీవెన, హై దరాబాద్: పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులకు భా రతీయ రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఆధ్యాత్మిక యాత్ర లను మరింత సు లభతరం చేసేందుకు ఐఆర్‌సీటీసీ (IRCTC) ఆధ్వర్యంలో ప్రత్యే కంగా రూపొందించిన నాలుగు ‘భారత్ గౌ రవ్ టూరిస్ట్ రైళ్లను’ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందు బాటు లోకి తీసుకొస్తోంది. నవం బర్ 10 నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు హైదరాబాద్ కేంద్రం గా ఈ ప్రత్యేక యాత్రలు ప్రారం భం కానున్నాయి.ఈ మేరకు ఐ ఆర్‌సీటీసీ టూరిజం అసిస్టెంట్ మే నేజర్ పి.వి. వెంకటేష్ వివరా లను వెల్లడించారు. దేశంలోని ప్ర ముఖ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠా లు, చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రా. లను ఒకే ప్యాకేజీలో సందర్శించేలా ఈ యాత్రలను రూపొం దించినట్లు తెలిపారు.
నాలుగు ప్రత్యేక యాత్రల వివరాలు
1. సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర (SCZBG68)
నవంబర్ 10 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ యాత్రలో ఉజ్జ యిని మహాకాళేశ్వర్, ఓంకారే శ్వర్, ద్వారకలో నాగేశ్వర్, సో మనాథ్, పూణేలో భీమశంకర్, నాసిక్‌లో త్రయంబకేశ్వర్, చత్ర పతి సంభాజీనగర్‌లో గ్రీష్ణేశ్వర్ జ్యో తిర్లింగాలను దర్శించుకోవ చ్చు.
టికెట్ ధరలు:–సాధారణ తరగతి:రూ.18,000, 3 ఏసీ: రూ.2 7,400, 2 ఏసీ: రూ.35,500
సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు కామారెడ్డి, నిజా మాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ మీదుగా ప్రయా ణిస్తుంది.
2. దివ్య దక్షిణ యాత్ర జ్యో తిర్లింగంతో (SCZBG69)
నవంబర్ 23 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే ఈ యాత్రలో తి రువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, చిదంబరం, తిరుచ్చి, తంజావూరు వంటి ప్రసిద్ధ క్షేత్రాలను సందర్శించ వ చ్చు.
టికెట్ ధరలు:సాధారణ తరగతి:రూ.15,8003 ఏసీ: రూ.23,200,2 ఏసీ: రూ.29,600
ఈ రైలు సికింద్రాబాద్ నుంచి చ ర్లపల్లి, జనగాం, కాజీపేట, వరం గల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా సాగుతుంది.
3.అయోధ్య–కాశీ–బైద్యనాథ్ ధామ్ దర్శన్ యాత్ర (SCZB G70)
డిసెంబర్ 5 నుంచి 14వ తేదీ వ రకు జరిగే ఈ యాత్రలో పూ రి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వా రణాసి, అయోధ్య, ప్రయాగ రాజ్ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పించారు.
టికెట్ ధరలు:సాధారణ తరగతి:రూ.17,000,3 ఏసీ: రూ.26,400,2 ఏసీ: రూ.34,400
సికింద్రాబాద్ నుంచి ప్రారంభమ య్యే ఈ రైలు చర్లపల్లి, కాజీ పేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామ ర్లకోట, తుని, దువ్వా డ, పెందు ర్తి, విజయనగరం మీదుగా ప్రయాణిస్తుంది.
4. సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర (SCZBG71)
డిసెంబర్ 17 నుంచి 27వ తేదీ వరకు మరోసారి సప్త జ్యో తిర్లింగ దర్శన్ యాత్రకు అవకాశం కల్పి స్తున్నారు. ఉజ్జయిని, ద్వారక, సోమనాథ్, పూణే, నాసిక్, చత్ర పతి సంభాజీనగ ర్‌లో ని ప్రముఖ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు.
టికెట్ ధరలు:సాధారణ తరగతి:రూ.18,000,3 ఏసీ: రూ.2 7,400,2 ఏసీ: రూ.35,500 కాగా ఈ రైలు సికింద్రాబాద్ నుంచి కా మారెడ్డి, నిజామాబాద్, ధర్మా బాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూ ర్ణ మీదుగా వెళ్తుంది.
యాత్రికులకు పూర్తి సౌకర్యాలు
ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు చే సింది. రైలు ప్రయాణంతో పాటు బస్సు రవాణా, హోటల్ వ సతి, ఉదయం అల్పాహారం, మధ్యా హ్నం, రాత్రి భోజనాలు, వాటర్ బాటిళ్లు, టూర్ ఎస్కార్ట్ సేవలు, సందర్శనా స్థలాల ప ర్యటన, ప్రయాణ బీమా ప్యాకేజీలో భాగంగా అందించను న్నా రు. రైల్వే స్టేష న్ నుంచి దేవాలయాల కు రవాణా కూడా ఉ చితంగా కల్పించనున్నారు. ప్రతి కోచ్‌కు ఒక సెక్యూరిటీ గార్డు తో పాటు రైలులో సీసీ కెమెరాల ద్వారా భద్రతా పర్యవేక్షణ ఉంటుందని వెంకటేష్ తెలిపారు.
విమాన ప్రయాణంతోనూ ప్రత్యేక టూర్ ప్యాకేజీలు
సీతాకాలాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి దేశీయ, అం తర్జాతీయ విమాన పర్యాటక ప్యాకేజీలను కూడా ఐఆర్‌సీ టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశీయ విమాన ప్యాకేజీలు:
–కాశ్మీర్: 5 రాత్రులు / 6 రోజు లు, డిసెంబర్ 31, రూ.41,120
–అండమాన్: 5 రాత్రులు / 6 రో జులు, డిసెంబర్ 2,రూ.67, 750
–ఛత్తీస్‌గఢ్: 4 రాత్రులు / 5 రో జులు, డిసెంబర్ 2,రూ.34,800
–ఒడిశా: 4 రాత్రులు / 5 రోజు లు, డిసెంబర్ 3 – రూ.34,050
–తమిళనాడు: 6 రాత్రులు / 7 రోజులు,ఫిబ్రవరి 7, రూ.41,450
అంతర్జాతీయ విమాన ప్యాకేజీ
శ్రీలంక రామాయణ యాత్రతో పా టు శంకరి దేవి శక్తిపీఠం సందర్శ నకు ప్రత్యేక ప్యాకేజీ రూపొందిం చారు. 5 రాత్రులు, 6 రోజుల ఈ యాత్ర డిసెంబర్ 14న ప్రారంభం కానుంది. టికెట్ ధర రూ.84,10 0గా నిర్ణయించారు.
.ఎల్‌టీసీ సదుపాయం కూడా
భారత్ గౌరవ్ రైలు యాత్రలతో పాటు దేశీయ విమాన ప్యాకేజీ ల కు కూడా ఎల్‌టీసీ (LTC) వర్తి స్తుందని ఐఆర్‌సీటీసీ వెల్లడిం చింది.
బుకింగ్, పూర్తి వివరాలకు సంప్రదించండి
ప్రత్యేక యాత్రల్లో పాల్గొనాలను కునే వారు టికెట్లు, బుకింగ్ వివ రాల కోసం కింది నంబర్లను సంప్ర దించవచ్చని తెలిపారు. 9701360701,9281030744,9281030734,9281030727,9281030759 లతో పాటు వెబ్‌సైట్: www.irctctourism. com (http://www.irctctourism.com) లో సంప్రదించవ చ్చని వెల్లడించారు.
IRCTC Bharat Gaurav Tourist Trains


