Vikarabad Tragedy Road Accident : ప్రజా దీవెన, వికా రాబాద్: పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం అలు ము కుంది. మరో రెండు రోజుల్లో వివాహ బంధంతో కొత్త జీవితం లోకి అడుగుపెట్టా ల్సిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వికారాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.
బొంరాస్పేట్ మండలం నాందార్ పూర్ గ్రామ శివారులో తుంకి మెట్ల నుంచి కోస్గి వెళ్లే రహదారిపై కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి అక్కడి కక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థి తి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంలో మృతిచెందిన వారి లో ఒకరికి మరో రెండు రోజు ల్లో వివాహం జరగాల్సి ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీ రు మున్నీరవుతున్నారు. పెళ్లి ఏర్పాట్ల తో సందడిగా ఉండా ల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది.సమాచారం అం దుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టా రు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుప త్రి కి తరలించారు. ఘ టనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణా లపై దర్యాప్తు చేపట్టారు. ప్రమా దాని కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

