Wednesday, November 18, 2026
More
    HomeOpinionNPL cricket Season 7 Nalgonda :నల్లగొండలో క్రికెట్ సందడి.. NPL-7కు రంగంసిద్ధం ఈ నెల...

    NPL cricket Season 7 Nalgonda :నల్లగొండలో క్రికెట్ సందడి.. NPL-7కు రంగంసిద్ధం ఈ నెల 28 నుంచి ఏడో సీజన్ ప్రారంభం, విజేతకు రూ.2,33,333, రన్నరప్‌కు రూ.1,22,222 నగదు బహుమతులు

    📰 Generate e-Paper Clip

    NPL cricket Season 7 Nalgonda : ప్రజా దీవెన, నల్లగొం డ టౌన్: నల్లగొండ జిల్లా క్రికెట్ అభి మానులకు మరోసారి ఆట లపండు గ రాబోతోంది. యువ క్రికెటర్లలో ప్రతిభను వెలికితీసి, వారికి మెరుగైన అవ కాశాలు కల్పించాలనే లక్ష్యంతో కోమ టి రెడ్డి ప్ర తీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నల్లగొండ ప్రీ మియర్ లీగ్ (NPL-7) ఏడో సీజన్‌కు ఏర్పాట్లు ముమ్మరమ య్యాయి. ఈ నెల 28 నుంచి నల్లగొండ పట్టణంలోని ఎ న్జీ కళాశాల మైదానంలో టోర్నమెంట్ ప్రారంభం కానుంది.

    ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాల యంలో NPL-7 క్రికెట్ టోర్నమెంట్ పోస్ట ర్‌ను ఆవిష్కరించా రు. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మే యర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చై ర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

        విజేతకు భారీ నగదు బహుమతి

    జిల్లా స్థాయిలో నిర్వహించనున్న ఈ క్రికెట్ టోర్న మెంట్‌లో వి జేత జట్టుకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 2,33,333 నగదు బహుమతి అందించనున్నారు. రన్నరప్ జట్టుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.1,22,2 22 నగదు బహుమతి ఇవ్వ నున్నట్లు నిర్వాహకులు వెల్లడిం చారు.

       యువ ప్రతిభకు ప్రోత్సాహం

    ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాం తాల్లోని ప్రతిభావంతులైన క్రికెటర్లకు తమ నైపుణ్యాలను ప్రద ర్శించేందుకు NPL వంటి టోర్నమెంట్లు మంచి వేదికగా నిలు స్తాయని పేర్కొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, జ ట్టుగా పనిచేసేతత్వాన్ని పెం పొందించేందుకు ఈ పోటీలు దో హదపడతాయని తెలిపారు.

    టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారులకు ప్రతిరోజూ భోజన సౌక ర్యం కల్పించనున్నట్లు చెప్పారు. టోర్నమెం ట్‌లో విజేతలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా కోమటిరెడ్డి ప్ర తీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బహుమతులు అందజేయ ను న్నట్లు వెల్లడించారు.క్రికెట్ అభిమానులు, యువ క్రీడాకారులు పెద్ద సంఖ్య లో పాల్గొని NPL-7 టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

    ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్ర తినిధులు కేసాని వేణుగోపాల్ రెడ్డి, మధుసూద న్ రెడ్డి, ఆంగో తు ప్రదీప్ నాయక్, ముత్తినేని శ్యాంసుం దర్, భువనగిరి ప్రభా కర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, వంగూ రి లక్ష్మయ్య, జూకూరి రమేష్, మామిడి కార్తీక్, ఇటికాల శ్రీని వాస్, అర్జున్ రెడ్డి, పాలకూరి శ్రీధర్ గౌడ్, సుదరగాని రమేష్, కోమటిరెడ్డి శేఖర్ రెడ్డి, పోగుల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.