Thursday, November 19, 2026
More
    HomeOpinionPCC Chief furious with Munugode MLA Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్...

    PCC Chief furious with Munugode MLA Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై పీసీసీ చీఫ్ గుర్రు,ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఏఐసీసీకి మహేశ్ కుమార్ గౌడ్ ఫిర్యాదు, వీడియో క్లిప్పింగులతో హైకమాండ్‌కు నివేదిక.. షోకాజ్ నోటీసులా? సస్పెన్షనా?

    📰 Generate e-Paper Clip

    PCC Chief furious with Munugode MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ ఎ మ్మెల్యే కో మటిరెడ్డి రా జగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో రాజకీయ ప్ర కంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దే శించి ఆయన చేసిన విమర్శలు ఇ ప్పుడు పార్టీ అధి ష్టానం దృ ష్టికి చేరినట్లు తెలుస్తోంది. ఈ వ్య వహారంపై టీపీసీసీ అధ్య క్షు డు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర అ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

    రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పీసీసీ చీ ఫ్.. ఈ అంశంపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి అ ధికారికంగా ఫిర్యాదు చేసినట్లు రాజకీ య వర్గాల్లో ప్రచారం జ రుగుతోంది. అంతేకాకుండా, ఎ మ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సం బంధించిన వీడియో క్లిప్పింగులను సైతం పార్టీ హైకమాండ్‌కు పంపించినట్లు సమాచారం.

    పదేపదే వ్యాఖ్యలు.. పార్టీకి ఇబ్బందికరంగా

    గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నా యి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంపై గతంలో నూ ఆయన పలుమార్లు విమర్శలు చేశారు. మంత్రి పదవిని ఆశిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధా న్యత సంతరించుకున్నా యి.గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి నప్పటికీ పార్టీ పె ద్దలు సంయమనం పాటిస్తూ ఎలాంటి క్రమ శిక్షణా చర్యలు తీసుకోలేదు. అయితే, ఈసారి ముఖ్యమంత్రిని నేరుగా లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు పార్టీ అం తర్గ తంగా చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది.

      హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ

    తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎ లాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ క్ర మశిక్షణ ఉల్లంఘన కింద రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు లు జారీ చేస్తారా? లేక మరింత కఠిన మైన చర్యలు తీసుకుం టారా? అనే చర్చ రాజకీయ వ ర్గాల్లో సాగుతోంది.మరోవైపు, అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఒకవేళ చర్య లు తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారు? అన్న అం శాలు ఇప్పు డు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తిని రేకె త్తిస్తున్నాయి.రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో మొదలైన ఈ వి వాదం.. పార్టీ క్రమశిక్షణ అంశంగా మారుతుందా? లేక మరోసా రి సర్దుబాటుతో ముగుస్తుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.