Tragedy Road Accident in Suryapet district : ప్రజా దీవెన, సూర్యాపేట: జిల్లా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీ వ్ర విషాదాన్ని నింపింది. బీ బీగూడెం నుంచి మార్కెట్కు వెళ్లే మార్గంలో టిప్పర్ లారీ స్కూ టీని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రా ణాలు కోల్పోయారు.ఈ ప్రమా దంలో స్కూటీపై ప్రయాణిస్తున్న చివ్వెంల మండల కేంద్రంలోని మినీ గురు కుల పాఠశాల ప్రిన్సి పాల్ రజిత రెడ్డి, అదే పాఠ శాలకు చెందిన మరో ఉపాధ్యాయురాలు గుగులోతు రక్మా దుర్మరణం పాలయ్యారు.
విధులకు, ఇతర పనుల నిమిత్తం వెళ్తున్న ఇద్దరు మహిళా ఉ పాధ్యాయులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో విద్యా వ ర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి మృతితో కు టుంబ సభ్యులు, సహచర ఉపాధ్యాయులు శోకసంద్రంలో మునిగిపోయారు.ఒకే ప్రమాదంలో ఇద్దరు మహిళా ఉపాధ్యా యుల మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాదానికి సంబం ధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

