HomePoliticsNalgonda Double Life Imprisonment Murder Verdict : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఎస్సీ, ఎస్టీ...

Nalgonda Double Life Imprisonment Murder Verdict : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు,హత్య కేసులో నిందితుడికి రెండు జీవి త ఖైదులు, మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష.. రూ.15 వేల జరిమానా

📰 Generate e-Paper Clip

Nalgonda Double Life Imprisonment Murder Verdict : ప్రజా దీవెన, నల్లగొండ: హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. రెండు జీవిత ఖైదులతో పాటు మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం (నవంబర్ 23, 2026) కీలక తీర్పు వెలువరించింది. పోలీసుల పటిష్టమైన దర్యాప్తు, ప్రాసిక్యూషన్ సమర్థవంతమైన వాదనలతో నిందితుడిపై నేరం నిరూపితమైంది.
నల్లగొండ జిల్లా హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుముల గ్రామానికి చెందిన యనక ప్రభాకర్ (34)ను అదే గ్రామానికి చెందిన టేకి సురేష్ (32) డబ్బుల లావాదేవీలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో హత్య చేశాడు. 2020 సెప్టెంబర్ 24న హాలియా ఎన్‌ఎస్‌పీ ఎడమ కాలువ రివులెట్ బ్రిడ్జి సమీపంలో ప్రభాకర్ తలపై సుత్తితో బలంగా కొట్టి ప్రాణాలు తీశాడు.ఈ ఘటనపై హాలియా పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 202/2020గా ఐపీసీ 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధ క చట్టం 3(2)(v), దివ్యాంగుల హక్కుల చట్టం-20 16 లోని సెక్షన్ 92(a) కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మూడు సెక్షన్ల కింద కఠిన శిక్షలు

పోలీసులు సేకరించిన పటిష్టమైన సాక్ష్యాధారాలు, ప్రా సిక్యూషన్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న నల్ల గొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం రెండో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి నిందితుడికి శిక్ష ఖరారు చేశారు.
ఐపీసీ 302 సెక్షన్ జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 3(2)(v) మరో జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా, దివ్యాంగు ల హక్కుల చట్టం 92(a)ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించడంతో పాటు
మూడు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని న్యా యస్థానం ఆదేశించింది. జరిమానా చెల్లించని పక్షంలో ప్రతి సెక్షన్ కింద అదనంగా నాలుగు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది.

పోలీసు, ప్రాసిక్యూషన్ బృందానికి ఎస్పీ అభినందనలు

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా ద ర్యాప్తు నిర్వహించి, నేర నిరూపణకు అవసరమైన ఆ ధారాలను న్యాయస్థానంలో సమర్పించిన పోలీసు అధి కారులు, ప్రాసిక్యూషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.


ఈ కేసు దర్యాప్తులో అప్పటి ఎస్‌ఐ జె. శివకుమార్, సీఐ పి. వీర రాఘవులు, మిర్యాలగూడ ఎస్‌డీపీఓ వై. వెంకటేశ్వర్ రావు, ప్రస్తుత మిర్యాలగూడ ఇన్‌చార్జ్ డీఎస్పీ రవి, హాలియా సీఐ రాఘవరావు, డీసీఆర్‌బీ సీఐ శ్రీనునాయక్, ఎస్‌ఐ సాయి ప్రశాంత్ కీలక పాత్ర పోషించారు.అలాగే అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్-1 ఎస్. శోభారాణి, కోర్టు డ్యూటీ ఆఫీసర్ హెడ్ కానిస్టేబుల్ ఆర్. పద్మయ్య, లైజన్ అధికారులు పి. నరేందర్, ఎన్. మల్లికార్జున్ చేసిన కృషిని ఎస్పీ ప్రశం సించారు.నేరం చేసిన వారికి చట్టప్రకారం శిక్ష పడేలా పోలీసు శాఖ కట్టుదిట్టమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల సేకరణతో ముందుకు సాగుతోందని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.

 

పోలీస్ స్టేషన్లలో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

నల్లగొండ : పోలీస్ శాఖలో విధుల నిర్వహణ మరింత పారదర్శకంగా, క్రమశిక్షణతో సాగాలని, ప్రజలకు మెరు గైన పోలీస్ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ స్పష్టం చేశారు. ఈ లక్ష్యంతో ఆయన శాలిగౌరారం సర్కిల్ కార్యాలయం, కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.తనిఖీల్లో భాగంగా శాలి గౌరారం సర్కిల్ కార్యాలయంలో రికార్డులు, కేసుల పు రోగతి, పెండింగ్ కేసుల వివరాలు, నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. దర్యాప్తుల్లో అనవసర జాప్యాన్ని నివారించి, నిర్ణీత సమయంలో కేసులను పూర్తి చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా పనిచేయాలని ఆదేశించారు.

అనంతరం కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ.. స్టేషన్ పరిసరాలు, నిర్వహణ తీరు, సిబ్బంది విధులు, క్రైమ్ రిజిస్టర్లు, కేసుల స్థితిగతులను క్షుణ్ణం గా సమీక్షించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్ర త్యేక కార్యాచరణ చేపట్టాలని, నేరాల నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రజలతో మర్యాదగా.. ఫిర్యాదులపై బాధ్యతగా

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడి సమస్య ను గౌరవంగా ఆలకించాలని, ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ సూచించారు. పోలీసుల ప్రవర్తన ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను పెంపొందించేలా ఉండాలని స్పష్టం చేశారు.

నేరాల నియంత్రణకు నిరంతర నిఘా

గ్రామాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, గంజాయి, ఇతర మ త్తు పదార్థాల వినియోగంపై కఠిన నిఘా పెట్టాలని ఆ దే శించారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేసి శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధా న్యత ఇవ్వాలని సూచించారు.పోలీస్ అధికారులు, సి బ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు.ఈ తనిఖీల్లో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐలు రాజశేఖర్, హ రిబాబు, కేతపల్లి ఎస్‌ఐ రవికుమార్, కట్టంగూర్ ఎస్‌ఐ క్రాంతికుమార్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular