SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన మిర్యాలగూడ: ప్రమా దాల నివారణ,రోడ్డు ప్రమాదాలు త గ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రమాదాల నివార ణ చర్యలకై పనిచేస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.
నల్లగొండ జిల్లాలో నార్కట్పల్లి అ ద్దంకి నామ్ రోడ్డు (ఎస్.హెచ్ 2 ) రా ష్ట్ర రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలు (బ్లాక్ స్పాట్)లను ఆర్&బి శాఖ, ఎక్సైజ్,ఆర్టీవో,హైవే ఇంజనీర్ అధికారులు వీరితో పా టు గ్రామ రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యు ల సమన్వయంతో కలిసి మిర్యాల గూడ టూ టౌన్ పరిధిలోని నందిపా డు ఎక్స్ రోడ్డు, వన్ టౌన్ పరిధిలో ని ఈదులగూడ ఎక్స్ రోడ్డు, మిర్యా లగూడ రూరల్ పరిధిలోని గూడూ రు ఎక్స్ రోడ్డు, దామచర్ల వద్ద బ్లాక్ స్పాట్ ను జిల్లా ఎస్పీ సందర్శించి ప్రమాదాలు జరగడానికి గల కార ణాలు, ప్రమాదాల నివారణ చర్య లు, తదితర అంశాలపై అధికారు లతో చర్చించి దిశా నిర్దేశం చేశారు.
నందిపాడు,ఈదులగూడ ఎక్స్ రో డ్డుల వద్ద స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్, రం బుల్ స్టిక్స్ వేగ నియంత్రణ సూచి కలు రాంగ్ రూట్ లో వాహనాలు రాకుండా నివారణ చర్యలు తీసు కోవాలని తెలిపారు. గూడూరు ఎ క్స్ రోడ్డు వద్ద అదిక ప్రమాదాలు జ రుగుతున్నందున ప్రస్తుతం ఉన్న మీడియన్ ఓపెనింగ్ మూసివేసి మి ర్యాలగూడ,వాడపల్లి వెళ్లే రోడ్డు మార్గాన్ని ఓపెన్ చేయాలనీ అలాగే పాదాచారులకు అటు ఇటు వెళ్లే క్ర మంలో ప్రమాదాలు జరుగకుండా మెటల్ బీమ్ క్రాస్ బ్యారియర్ ని అమర్చాలని తెలిపారు.
దామరచర్ల వద్ద సిమెంట్ ఫ్యాక్టరీ లు అధికం గా ఉండడం వల్ల ప్రజ లు,కార్మికులు వాహనదారులు రో డ్డు దాటే క్రమంలో తరచూ ప్రమా దాలు జరుగుతున్నందున మధ్యలో మెటల్ బీమ్ క్రా స్ బ్యారియర్ ఏ ర్పాటు చేయాలని, లైటింగ్,రాంగ్ రూట్ లో వాహనాలు రాకుండా రం బుల్ స్టిక్స్ వేగ నియంత్రణ సూచి కలు అధికారులకు సూ చనలు ఇచ్చారు.అలాగే అన్ని జం క్షన్ ల వద్ద హై మాక్స్ లైట్స్, సెంట్ర ల్ లైటింగ్,బ్లింకర్స్,జీబ్రా క్రాసింగ్ లై న్స్ , రంబుల్ స్టిక్స్,మొదలగు వేగ నియంత్రణ సూచికలు వెంటనే పెట్టే విధంగా అధికారులకు ఆదేశించా రు. ఆయా గ్రామాల సంబందించి రోడ్డు సేఫ్టీ కమిటీ వారితో మాట్లాడి ప్రమాదాల కారణాలు తెలుసు కో నైనది.
ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లా లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్ లు గతం లో 58 ఉండగా ప్రస్తుతం 41 కి త గ్గించడం జరిగిందని, రోడ్డు ప్ర మా దాలు నివారించడానికి ప్రత్యేక చ ర్యలు చేపడుతున్నామని తెలి పా రు. రాత్రి సమయంలో రహదారిపై వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవ కాశం ఉన్నందున నిరంతరం పెట్రో లింగ్ నిర్వహిస్తూ రోడ్డుపై ఎలాంటి వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నమని అన్నారు.
.(మిషన్ RRR) రోడ్డు భద్రత కార్య క్రమంలో భాగంగా హైవే వెంట ఉన్న గ్రామ ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించి రోడ్డు భద్రత పట్ల చైతన్య పరుస్తు న్నామని అన్నారు. రోడ్డు ప్రమాదా ల పైన ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రమా దాల నివారణ చర్యలు తీసుకుంటా మని, వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటి స్తూ ఉండాలని కోరారు.
అలాగే జిల్లా పరిధిలో శీతాకాలం తీవ్రత, ఉదయం మరియు రాత్రి వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉం డడం వల్ల రహదారులపై ముందు న్న వాహనాలు స్పష్టంగా కనిపించ కపోవడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ప్రమాదాలు నివా రించేందుకు అన్ని వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జి ల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పలు చూచనలు సూచించారు.
*ద్విచక్ర వాహనదారులు – తప్ప నిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త లు*
1.స్పష్టమైన గాజు ఉన్న హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.
2.హై-బీమ్ వాడకండి; లో-బీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలి.
3.వేగం తగ్గించి ముందున్న వాహనానికి సురక్షిత దూరం పాటించాలి.
4.రిఫ్లెక్టివ్ జాకెట్లు, స్టిక్కర్లు వాడుకోవాలి.
5.సడన్ బ్రేకులు వాడకండి — రోడ్డు తడి ఉంటే స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది.
6.టర్నింగ్ అయ్యే ముందు ఇండికేటర్ ఇవ్వాలి.
7.రాత్రి/తెల్లవారుజామున ప్రయాణాలు చేయటాన్ని నివారించాలి — ఈ సమయంలో పొగమంచు తీవ్రత ఎక్కువ.
8.గ్లౌవ్స్ తప్పనిసరిగా ధరించాలి; చేతులు చల్లబడితే వాహన నియంత్రణ తగ్గుతుంది.
*ఫోర్ వీలర్ డ్రైవర్లు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు*
1.ఫాగ్ ల్యాంప్స్ లేదా లో-బీమ్ లైట్లు మాత్రమే వాడాలి.
2.వేగం తగ్గించి నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలి.
3.ముందున్న వాహనానికి సాధారణ దూరం కంటే 3–4 రెట్లు ఎక్కువ దూరం ఉంచాలి.
4.డిఫాగర్ వాడాలి / విండోలను కొద్దిగా ఓపెన్ చేసి ఫాగింగ్ నివారించాలి.
5.విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు హాజర్డ్ లైట్లు వాడాలి.
6.పొగమంచు లేదా కర్వ్ ప్రాంతాల్లో ఓవర్‌టేక్ చేయవద్దు.
7.రోడ్ లైన్ మార్కింగ్‌లు, రిఫ్లెక్టర్లను గమనిస్తూ నడపాలి.
8.వైపర్స్, లైట్లు, బ్రేకులు సరిగా ఉన్నాయో ముందుగానే తనిఖీ చేసుకోవాలి.
9.సడన్ బ్రేకులు, వేగ మార్పులను నివారించాలి.
సాధారణ సూచనలు
ముందుగానే ప్రయాణం ప్రారంభించండి; తొందరపడొద్దు.
హెడ్లైట్లు, టెయిల్ లైట్లు శుభ్రంగా ఉంచాలి.
రోడ్డు సూచనలు, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించండి.
విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటే సురక్షిత ప్రదేశంలో ఆగి వేచి ఉండండి.
ప్రజల భద్రతే మా ముఖ్య లక్ష్యం.శీతాకాలంలో రోడ్లపై ప్రయాణించే ప్రతీ ఒక్కరూ పై సూచనలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా ప్రయాణించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట మి ర్యాలగూడ డిఎస్పి రాజశేఖర రా జు,సి.ఐలు పి.యన్.డి ప్రసాద్, నాగభూషణ్, యస్.ఐలు రాంబా బు,శ్రీనివాస్,లక్ష్మయ్య,శ్రీకాంత్ రె డ్డి, డి.టి.ఆర్ పి రిటైర్ సీఐ అంజ య్య, తదితర రోడ్డు సేఫ్టీ ఇంజనీర్లు ఉన్నారు.

