Tuesday, September 29, 2026
More
    HomeAndhrapradeshSatya Sai Baba Centenary Celebrations : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, అధికారికంగా...

    Satya Sai Baba Centenary Celebrations : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, అధికారికంగా మానవ రూపంలోని దే వుడు సాయిబాబా శతజయంతి ఉత్సవాలు 

    📰 Generate e-Paper Clip

    Satya Sai Baba Centenary Celebrations :

    ప్రజా దీవెన, పుట్టపర్తి: మానవ రూ పంలోని దేవుడు సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని, సాయిబాబా శతజయంతి ఉ త్స వాలను అధికారికంగా నిర్వహించ డానికి సంబంధించి ప్రభుత్వం ఇప్ప టికే ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు.భగవాన్ సత్య సాయిబా బా ఆలోచనలు, ఆశయాలను ప్రజ ల్లో విస్తృతం చేయడానికి తెలంగా ణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రే వంత్ రెడ్డి తెలిపారు.

    పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సత్య సాయిబాబా శతజ యంతి ఉత్సవాల్లో భారత ఉప రా ష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చం ద్ర బాబు నాయుడు, మంత్రి లోకేష్ తో క లిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి మాట్లాడుతూ సాయిబాబా సేవలను గుర్తుచేసుకున్నారు.

    ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన మాట ల్లోనే…సాయిబాబా మనుషుల్లో దే వుడిని చూశారు. ప్రేమతో మనుషు లను గెలిచారు. సేవలతో దేవుడిగా కొలువబడుతున్నారు. మానవుల ను ప్రేమించాలి. ప్రేమ గొప్పది. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని ని రూపించారు.సత్య సాయిబాబా మ న మధ్యన లేకపోయినా వారిచ్చిన స్ఫూర్తి, భావన నిర్వాహకుల అంద రిలో కనిపిస్తోంది. కొన్ని సందర్భా ల్లో ప్రభుత్వాలు కూడా చేయలేని సే వలను బాబా, వారి ట్రస్టు ద్వారా చే సి చూపించారు.

    ముఖ్యంగా ప్రతి వారూ చదువుకో వాలని ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ టు పీజీ వరకు పేదలకు ఉచి తంగా విద్యను అందించి వారి జీవి తాల్లో వెలుగులు నింపారు.విద్య, వైద్య, తాగునీటి సౌకర్యం కల్పించ డంలో ఎంతో కృషి చేశారు. జీవితం లో చివరి దశలో మరణం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న దశలో ఎం తో మందిని బతికించి దేవుడిగా కొ లువబడుతున్నారు.

    పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కునారిల్లుతు న్న కాలంలో, ప్రభుత్వాలు సైతం తాగునీటి సౌకర్యాలు కల్పించలేని కాలంలో సొంత జిల్లా పాలమూరు దాహర్తిని తీర్చారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సౌకర్యం కల్పిం చారు. తమిళనాడు రాష్ట్రంలో సై తం బాబా సేవలను విస్తృత పరిచి ఈనాడు అందరి మనసుల్లో దేవు డిగా శాశ్వత స్థానం సాధించారు.

    మానవ సేవ మాధవ సేవ బోధించ డమే కాకుండా సంపూర్ణంగా నమ్మి విశ్వసించారు.

    ఈనాడు 140 దేశా ల్లో బాబాకి భ క్తులు ఉండటమే కాకుండా వారం తా వివిధ మార్గాల్లో సేవలు అంది స్తున్నారు. సాయి శతజయంతి ఉ త్సవాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రా ల మంత్రులు, దాదాపు 40 నుంచి 50 దేశాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారంటే వా రి ప్రత్యేకతను గుర్తు చేసుకోవలసి న అవసరం ఉంది.సత్య సాయిబా బా ఆలోచనలను, వారు అనుసరిం చిన విధానాలను ప్రజలకు చేరవే యడానికి తెలంగాణ ప్రభుత్వం అ న్ని విధాలుగా సహకరిస్తుందని ము ఖ్యమంత్రి చెప్పారు.

    పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో కా ర్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి సాయి కుల్వంత్ హాలులోని సత్య సాయిబాబా మహాసమాధిని ద ర్శించుకున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.