Sunday, September 27, 2026
More
    HomeAndhrapradeshVijayawada Control Room Bribery Scandal : బిగ్ బ్రేకింగ్, విజయవాడలో భా రీ లంచం...

    Vijayawada Control Room Bribery Scandal : బిగ్ బ్రేకింగ్, విజయవాడలో భా రీ లంచం బాగోతం,విజయవాడ కంట్రోల్ రూమ్‌లో హైటెక్ ప్రాజెక్ట్

    📰 Generate e-Paper Clip

    Vijayawada Control Room Bribery Scandal : ప్రజా దీవెన, విజయవాడ: విజ యవాడలోని రైల్వే కంట్రోల్ రూ మ్ పరిధిలో రూ.179.50 కోట్ల విలువైన ఆటోమెటిక్ బ్లాక్ సిగ్న లింగ్ ప్రాజెక్ట్ చుట్టూ సాగిన భారీ లంచం వ్యవహారం ఒక్కసారిగా బట్టబయలైంది. అత్యాధునిక సాంకేతికతతో రైళ్ల రాకపోకలను మరింత సురక్షితంగా, వేగంగా నిర్వహించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లోనే అవినీతి జాడలు బ యటపడటం కలకలం రేపింది.

    ఈ ప్రాజెక్ట్‌లో తన వాటాగా రూ. 7 కోట్ల కమీషన్ ఇవ్వాలంటూ రై ల్వే సీనియర్ ఇంజనీర్ బాపిరా జు డిమాండ్ చేసినట్లు ఆరోపణ లు ఉన్నాయి. అందులో భాగం గా తొలి విడతగా రూ.15 లక్షలు తీసుకునేందుకు పక్కా ప్లాన్ రూ పొందినట్లు తెలుస్తోంది. ఈ వ్య వహారంలో ప్రైవేట్ వ్యక్తి శ్రీచంద్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం.

    అయితే నగదు చేతులు మారే సమయానికి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికే అప్ర మత్తంగా ఉన్న సీబీఐ అధికారు లు రంగంలోకి దిగారు. రూ.15 లక్షల నగదు మార్పిడి జరుగుతు న్న సమయంలో మెరుపుదాడి చే సి, రైల్వే సీనియర్ ఇంజనీర్ బా పిరాజుతో పాటు శ్రీచంద్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసు కున్నారు.హైటెక్ సిగ్నలింగ్ వ్య వ స్థతో రైల్వే ప్రయాణాన్ని మరింత ఆధునికంగా మార్చాలనుకున్న సమయంలో అదే ప్రాజెక్ట్‌లో సా గుతున్నట్లు ఆరోపణలు ఎదు ర్కొంటున్న ‘కమీషన్ నెట్‌వర్క్ ’కు సీబీఐ ఆపరేషన్ చెక్ పెట్టిం ది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొ నసాగుతోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.