Sunday, September 27, 2026
More
    HomeIndiaBrs RS praveen kumar hot comments : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వానికి బిఆర్ ఎస్...

    Brs RS praveen kumar hot comments : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వానికి బిఆర్ ఎస్ అల్టిమేటం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లను రద్దుచేస్తే ఊరుకోo

    📰 Generate e-Paper Clip

     

    Brs RS praveen kumar hot comments : ప్రజా దీవెన, నల్లగొండ: పేదల సం క్షేమ పథకాలను నీరుగారుస్తూ, పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆసరా గా నిలిచే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయాలని చూస్తు న్న కాంగ్రెస్ ప్ర భుత్వ కుట్రలను తీవ్రంగా ప్రతి ఘటిస్తామని బీఆర్‌ఎస్ పార్టీ శ్రే ణులు హెచ్చరించాయి. నల్లగొండ పట్టణంలో అర్హుల కు కాకుండా డబ్బులు వసూలు చేసి అనర్హులకు కేటాయిం చిన డబుల్ బెడ్‌రూ మ్ ఇళ్లపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధ ర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌కు మె మోరాండం ఇవ్వడానికి బయలుదేరిన ముఖ్య నాయకు లను పోలీసు లు అడ్డుకోవడంతో కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొ న్నాయి. కలెక్టర్ రాకుం డా జాయింట్ కలెక్టర్ (JC) వినతిపత్రం తీసుకోవడానికి రా వడంతో నేత లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతిప త్రం ఇవ్వడానికి ని రాకరించారు. ప్రభుత్వ ఒత్తిళ్లతో ప్రజా సమస్యలపై విన తిపత్రం కూడా ఇవ్వనీయకుండా అడ్డు కుంటున్న పోలీసుల తీరుపై నిరసనగా నాయకులు, కార్యక ర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు.

    అనంతరం గ్రీవెన్స్ సెల్‌లో కలెక్ట ర్‌ను కలిసి నేరుగా వినతిప త్రం అందజేశారు.అనంతరం కలెక్టర్ ఛాంబర్‌లో డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్‌లు జిల్లా కలెక్టర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. నల్ల గొండ పరిధిలోని డబుల్ బెడ్‌రూ మ్ ఇళ్ల కేటాయింపులో భారీ ఎత్తున చేతులు మారిన డబ్బుల వ్యవహారంపై ప్ర త్యే క దర్యాప్తు జరపాలని డి మాండ్ చేశారు. అనర్హులకు జ రి గిన కేటాయింపులను వెంటనే ర ద్దు చేసి, నిజమైన అర్హులై న పేద కుటుంబాలకు ఇళ్లను కేటాయించాలన్నారు.


    మీడియా సమావేశంలో నేతల తీవ్ర హెచ్చరికలు

    కలెక్టర్‌తో భేటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమా వేశం లో నేతలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ని రుపేదలకు వరమైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకా లను రద్దు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ పథకాలపై కో ర్టులో కేసు ఉన్నప్పటికీ కావాలనే ప్రభుత్వం బలహీనమైన వాదన లు వినిపిస్తూ పథకాలకు వ్యతిరే కంగా తీర్పు వచ్చే లా లోపాయి కారీ కుట్ర చేస్తోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సై తం ప్రజలను మభ్యపెడుతూ ప థకాల కు నిధులు నిలిపివేసే ప్ర యత్నం చేస్తున్నారు. ప్రజల సం క్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వ కపట నాటకాలను బీఆర్‌ఎస్ క్షేత్రస్థా యిలో ఎండగడుతుందని స్పష్టం చేశారు.

    ఈ కార్యక్రమంలో ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రామచం ద్రు నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టే మ ల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీ నివాస్, నగర, మండల పార్టీ అ ధ్యక్షులు బోనగిరి దేవేందర్, దేప వెంకట్ రెడ్డి, ఐతగోని యాద య్య, రావుల శ్రీనివాస్ రెడ్డిలతో పాటు కార్పొరేటర్లు పెరిక యాద య్య, పేర్ల అశోక్, రత్నగిరి శ్రీని వాస్, కుందూరు ప్రవీణ్ రెడ్డి, బా ణావత్ దీప్లా, దొడ్డి రమేష్, గోప గోని స్వాతి రాజశేఖర్, దండంప ల్లి సత్తయ్య, కందుల లక్ష్మయ్య, సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి, రంజిత్, వజ్జే శ్రీనివాస్, జహంగీర్ తదితర ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

    ప్రజాస్వామ్య పోరాటాలపై నిర్బంధం గర్హనీయం

    నల్లగొండ: నల్లగొండలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయిం పులో చోటుచేసుకున్న అక్రమాలను ప్రశ్నిస్తూ శాంతియుతం గా ఆందోళన చేస్తున్న సీపీఎం నేతలను అక్ర మంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ లో నిర్బంధంలో ఉన్న సీపీఎం నా యకులు సలీం, సత్తయ్య తదితరులను బీఆర్ఎస్ నేతలు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నో ముల భగత్ స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటా యింపులో తీవ్ర అవకతవకలు జరిగాయని, అర్హులను కాదని డ బ్బులు తీసుకుని అనర్హులకు కేటాయించారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన పేద లకు మాత్రమే ఇళ్లు కేటాయించాలి.ప్రజల తరఫున నిలబడి న్యా యం చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పో రాడుతున్న నాయకులను అక్రమంగా అ దుపులోకి తీసుకో వడం ప్రజాస్వా మ్యాన్ని కాలరాయడమేనని వ్యాఖ్యానిం చారు. “కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పటికే అపారమైన ఆస్తు లున్నాయి, చివరకు పే దవాళ్ల గూడును కూడా లాక్కో వా లా?” అని ప్రశ్నిస్తూ, పాలకు లు పేదల హక్కులను హరిం చ డం ఆపాలని హెచ్చరించారు.

    ఈ కార్యక్రమంలో ట్రైకార్ మాజీ చైర్మన్ రామచంద్రనాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, మున్సి పల్ మాజీ చైర్మన్ మందడి సైదిరె డ్డి, నగర పా ర్టీ అధ్యక్షులు బోన గిరి దేవేందర్, రావుల శ్రీనివాస్ రెడ్డి, బా ణావత్ దీప్లా, దండంపె ల్లి సత్తయ్య, రంజిత్, అల్లి శివ శంక ర్ తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.