Sunday, September 27, 2026
More
    HomeOpinionBrs Ex minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, మాజీమంత్రి హరీష్ రావు ఆగ్రహం,...

    Brs Ex minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, మాజీమంత్రి హరీష్ రావు ఆగ్రహం, 22A భూముల వివాదంతో గందరగోళంలో ప్రజానీకం

    📰 Generate e-Paper Clip

     

    Brs Ex minister Harish Ra :  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో భూముల నిషేధిత జాబితా 22A అంశం మ రోసారి రాజకీయ దుమారం రేపుతోంది. రిజిస్ట్రేషన్లలో ఎదు రవుతున్న ఇబ్బందులు, నిషేధిత జాబితాలో చేరుతున్న ఆ స్తులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వి రుచుకుపడ్డారు.తెలంగాణ భ వన్‌లో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో హరీశ్ రావు మాట్లాడుతూ 22A నిషేధిత జాబితా పేరుతో సామాన్య ప్ర జలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే ద శాబ్దా ల క్రితం కొనుగోలు చేసిన ఇళ్లు, ఫ్లాట్లు కూడా నిషేధిత జాబితా లోకి రావడంతో ఆస్తుల యజ మా నులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.1999, 20 08 లోనే రద్దయిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) భూములను మ ళ్లీ నిషేధిత జాబితాలో ఎలా చేర్చుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

      ప్రభుత్వ ఆస్తులకూ 22A సెగ?

    హైదరాబాద్‌లోని పలు ప్రాంతా ల్లోని ఆస్తులతో పాటు రాజీ వ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు వంటి ప్రభుత్వ ఆస్తులు కూడా 22A జాబితాలో కనిపించ డం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని హరీశ్ రావు విమ ర్శించారు.30 ఏళ్ల క్రి తం కొనుగోలు చేసిన ఫ్లాట్లు, శ్రీనగర్ కా లనీలోని సర్వే నంబర్లు 8,9లోని ఇళ్లను సైతం నిషేధిత జా బితాలో చేర్చడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు.


    చలాన్లు కట్టించుకుని..రిజిస్ట్రేషన్ దగ్గర అడ్డంకులా

    రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ముందుకు వెళ్లే సమయంలో 22A పే రుతో ఆపుతున్నారని, ఇప్పటికే చలా న్లు చెల్లించినప్పటికీ సమస్యలు ఎదురవుతున్నాయని హరీశ్ రావు ఆరోపించా రు. చెల్లించిన మొ త్తాలను కూడా తిరిగి ఇవ్వడం లేదని మండిపడ్డారు.రెవెన్యూ శా ఖలో అవినీతి, కమీషన్ల ఆరోప ణలు ఉన్నాయని పేర్కొంటూ ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

      సీఎం ఇంటిపైనా 22A ప్రభావం?

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివా సం కూడా 22A జాబితా లో ఉన్నట్లు హరీశ్ రావు పేర్కొన్నారు. సొంత ఆస్తికి సమ స్య ఎదురైన తర్వాతే ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారిం చిందని ఆయన విమర్శించారు.కమిటీలు, రివ్యూల పేరుతో సమస్యను నాన్చడం కా కుండా తక్షణ పరిష్కారం చూపా ల ని డిమాండ్ చేశారు.2024 డి సెంబర్ 7 నుంచి 22A జాబి తాలో చేర్చిన భూములు, ఆస్తులపై ప్రభుత్వం వెంటనే శ్వే తపత్రం విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశా రు.

    22A వివాదంపై ప్రభుత్వం స్పష్ట త ఇవ్వాలని, నిజమైన భూ యజమానులకు రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తా నికి.. 22A నిషేధిత జాబితా వ్య వహారం ఇప్పుడు కేవలం రిజిస్ట్రేషన్ సమస్య గా కాకుండా తెలం గాణ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ ఆ రోపణలపై ప్రభుత్వం ఎలా స్పం ది స్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.