–ఇది ముమ్మాటికీ కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాల హత్యనే
–రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలే ఈ హ త్యకు బాధ్యత వహించాలి
— సాయి ఈశ్వర్ మృతి పై పార్ల మెంట్ లో చర్చ జరగాలి
–బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఈ పార్ల మెంటు సమావేశాల్లోనే ఆమోదిం చాలి
— బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్ర ధా న కార్యదర్శి నేలపట్ల సత్యనారా యణ
Sai Eshwarachari : ప్రజా దీవెన, నల్లగొండటౌన్: స్థానిక సంస్థలలో BC లకు 42% రిజర్వే ష న్లు కల్పిస్తామని మాట ఇచ్చితప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం , బీసీలకు అన్యా యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖ రికినిరసనగా సాయి ఈశ్వర్ స్వా మి చేసుకు న్న ఆత్మహ త్యకు కా రణమైన కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాల వైఖరికి నిరసనగా శనివారం నల్ల గొండ జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి గ్రామ మరియు మండల కేంద్రంలో వివిధ రూపాలలో నిరసన కార్యక్ర మాలు నిర్వహించారు. నల్లగొం డ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్స్ సెం టర్ లో బీసీ సంఘం వర్కింగ్ ప్రె సిడెంట్ కాసోజు విశ్వనాథం ఆ ధ్వ ర్యంలో శ్రీకాంత్ ఆచారి విగ్రహం దగ్గర బీసీ సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, వి శ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు , విద్యార్థి సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తo చేశారు.
స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్య క్షుడు రాచకొండ గిరి మరియు పట్ట ణ అధ్యక్షుడు సొల్లేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్డు నుండి గడియారం సెంటర్లోని కాసోజు శ్రీకాంతాచారి విగ్రహం వరకు పెద్ద ఎ త్తున ర్యాలీ నిర్వహించి క్లాక్ టవర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం ని ర్వహించడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పోలీస్ స్టేషన్లో నే ఆయన చిత్రపటానికి పూల మా లలు వేసి ఘనంగా నివాళులు అ ర్పించడం జరిగింది.
దేవరకొండ పట్టణంలో ము ఖ్య మంత్రి సమావేశ ము ఉన్నందున దానిని బీసీ సం ఘాల నాయకులు అడ్డుకుంటారని భయంతో ఈరోజు ఉదయం నాలు గు గంటలకే బీసీ సంఘాల నాయ కులు నేలపట్ల సత్యనారాయణ, నల్ల సోమ మ ల్లన్న, కేశ బోయిన శంకర్ ము ది రాజ్ మరియు వాడపల్లి సాయి బా బా ముదిరాజ్ లను టూ టౌన్ పో లీస్స్టేషన్లో నిర్భందించడం జరిగిం ది.
ఈ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండివైఖరిని వ్య తిరేకిస్తూ నల్లగొండ పట్టణ పో లీస్ స్టేషన్ నందు కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మరియు సాయి ఈశ్వర చారి మరణానికి బాధ్యు లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పేర్కొంటూ పోలీస్ స్టేషన్లోనే నిరస న మరియు ధర్నా కార్యక్రమం చే యడం జరిగింది. సాయి ఈశ్వర చారి చిత్రపటానికి పోలీస్ స్టేషన్ లోనే పూలమాలలు వేసి వాళుల ర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమాలలోకాసోజు విశ్వ నాథం, నల్ల సోమ మల్లన్న, జెల్లా ఆదినారాయణ, కొల్లోజు సత్యనా రాయణ, రాచకొండ గిరి, పసుపు లేటి సీతా రాములు,సొల్లేటి హరి ప్రసాద్,తాండూరుచలమయ్యచారి,గొట్టిముక్కల చంద్రశేఖర్, కూరెల్ల మదనాచారి,రాగి పని విష్ణుమూర్తి చంద్రశేఖర్, కన్నేకంటి సత్యనారా యణ, కూరెళ్ళ రమణాచారి, పె రికేటి వెంకటాచారి, చేపూరి కిషన్, సొల్లేటి కొండయ్య చారి తదితరులు పాల్గొన్నారు.

