Telangana Defection MLAs : ప్రజా దీవెన, హైదరాబా ద్: తెలంగాణలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతోన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడే సమయం ఆసన్నమవుతోంది. బిఆర్ఎ స్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన ఆ పది మంది ఎమ్మెల్యేల భవితవ్యంపై ఎంతో ఉత్కంఠతో ఎ దురుచూస్తున్న రాజకీయ నేతలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ వెలువరుస్తున్న విడతల వారి తీర్పులతో బిగపట్టు కున్న ఊపిరిని ఉసూరుమంటూ వదులుతూ మళ్ళీ ఊపిరి పీల్చుకుంటున్నారు.
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఒక్కోరుగా క్లి న్ చిట్ ఇస్తూ స్పీకర్ తీర్పులు వెలువరుస్తుం డడంతో ఇంత కాలంగా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వారికి కొంత ఉప శ మనం లభించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నా రు. తాజా గా గురువారం ఆ ఇద్దరు ఎమ్మెల్యే లు ఇప్పటికీ ఆ పార్టీనే అంటూ సం చలన ప్రకటన చేశారు. పార్టీ ఫిరా యింపుల వ్యవహారంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు తెలం గాణ అ సెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్‌చిట్ ఇచ్చా రు. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి లు పార్టీ మారారు అనేందుకు తగిన ఆధారాలు లేవని స్పీక ర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
వీరిద్దరినీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు ఆయన తీర్పు వెలు వరించి కీలక నిర్ణయం తీసుకున్నా రు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలోనూ స్పీకర్ ఈ తరహా లో నే తీర్పు వెలువరించిన విషయం విదితమే. అయితే పార్టీ ఫిరాయింపులపై చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బాన్సు వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలపై అనేక సార్లు వి చారణ జరిగిన విషయం కూడా తె లిసిందే. ఇరు పక్షాల వా దోపవాదనల అనంతరం వీరు పార్టీ మారారు అనేందుకు త గిన ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తు న్నామని స్పీ కర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్ట మై న ప్రకటన సైతం విడుదల చేశారు. ఇదిలా ఉండగా మొత్తంగా పది మంది ఎమ్మెల్యేల గతంలో పార్టీ ఫి రాయింపు ఆరోపణలు ఎదుర్కొo టున్న వారిలో ఐదుగురు ఎమ్మెల్యే ల అంశంలో స్పీకర్ ఇంతకుముందే ఇదే తరహా తీర్పు వెలువరించారు. పార్టీ మారినట్లు వారిపై ఆధారాలు లేకపోవడంతో ఈ నిర్ణ యం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
తాజాగా మరో ఇద్దరి విషయంలో కూడా నిర్ణయం వెలువడ డంతో మరో ముగ్గురు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్‌లకు సంబంధించిన కే సు ఇంకా తీర్పు కోసం ఎదురుచూస్తుంది. ఈ ముగ్గురు ఎ మ్మెల్యేల కేసులో స్పీకర్ త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోం ది. జగిత్యాల ఎమ్మెల్యే సంజ య్‌పై ఇప్పటికే విచారణ పూర్తై తీర్పును రిజర్వు చేసి ఉంచి నందున ఆయన విషయంలో కూడా తగిన ఆధారాలు లేవ ని స్పీకర్ తీర్పు చెప్పే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగు తోంది.
ఆయనకు సైతం క్లీన్ చీట్ ఇచ్చే అ వకాశం ఉందనే చర్చ జో రుగా సాగుతోంది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం గతంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు స్పష్ట మైన ప్రకటన చేయగా అదే సమయంలో మరో ఎమ్మెల్యే క డియం శ్రీహరి మాత్రం తాను బీఆర్ ఎస్ పార్టీలోనే కొనసా గుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరి పై కూడా స్పీ కర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ప్రస్తుతం ఉ త్కంఠ కొనసాగుతూనే ఉంది. మొత్తానికి తెలంగాణలో ఫి రాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం కాస్తా ఓ ప్రహసనంలా మారిందని చెప్పవచ్చు.
