Bhopal RoadAccident : ప్రజా దీవెన మధ్యప్రదేశ్: మధ్య ప్రదేశ్‌లో గురువారం ఘోర రోడ్డు ప్ర మాదo చోటు చేసుకుం ది. ఈ ఘోరరోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దు ర్మరణం చెందారు. మధ్యప్రదేశ్ (madhya pradesh) రాష్ట్ర రాజధాని భోపాల్‌లో వ్యాన్-ట్రాక్టర్ ఢీకొని జరిగిన ప్రమాదం లో ఐదుగురు మృతి చెందగా సుమారు పది మంది తీవ్రం గా గాయపడ్డారు.
పండుగ పూటన మకర సంక్రాంతి సందర్భంగా నర్మదాపు రంలోని గుడికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసు కుం దని స్థానిక పోలీసు లు తెలిపారు. పోలీసుల వెల్లడించిన వి వరాల మేరకు భోపాల్ (bhopal) జిల్లా బెరాసియా ప్రాంతం లో వ్యాన్, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద సమ యంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మృతు లు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా మృతులంతా సి రోజ్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు.
మరో పది మంది గాయపడగా అందులో ముగ్గురు చిన్నా రులు ఉన్న ట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థా నిక హమీది యా ఆసుపత్రికి తరలిం చి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలం వద్ద పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ మే రకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
