Telangana Governor Jishnu Dev Varma : ప్రజా దీవె న సూర్యాపేట: “వ్యవసాయం ఒక విజ్ఞానమని” ఇప్పటి వరకు ఉన్న జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం ప్రస్తు తం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞా న్ ,జై అనుసంధాన్ గా మారిందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. శుక్ర వా రం ఆయన సూర్యా పేట జిల్లా మఠం పల్లి మండలం, మట్ట పల్లి లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని సతీసమేతంగా దర్శిం చుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకు లు, వేద పండి తులు, అధికారులు గవర్నర్ కు పూర్ణకుంభం తో స్వాగతం పలికి వే దాశీర్వచనం ఇచ్చి ప్రసాదం అం ద జేశారు. దేవాలయ ఆవరణలో వివిధ శాఖలు ఏర్పాటు చే సిన స్టా ల్స్ని సందర్శించి లబ్ధిదారులు, విద్యార్థులతో ము ఖాముఖి మాట్లాడారు. ఆ తర్వాత వేదిక వద్ద హు జూర్న గర్ సమీపంలోని ముగ్దుమ్ నగర్ వద్ద 100 ఎకరాలలో 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వ్యవ సా య కళాశాలకు శంకుస్థాపన చేశారు. అంతేగాక కోదాడ సమీపంలో 50 కోట్ల రూపా యల వ్యయంతో నిర్మిస్తున్న జ వహర్ నవోదయ విద్యాలయానికి శంకుస్థాపన చేయడమే కాక, మ ట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దే వాలయంలో కోటి రూపాయల వ్య యంతో నిర్మించనున్న యాత్రికా సదన్, నూ తన కిచెన్ షెడ్ కు, మరో కోటి రూపాయల వ్యయంతో ని ర్మించే డార్మెటరీ బిల్డింగులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర గవ ర్నర్ మాట్లాడుతూ వసంత పంచమి రోజున పవిత్ర కృష్ణా నది తీరాన ఉన్న మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ద ర్శించుకోవడం సంతోషమని అ న్నారు. అలాగే రైతులకు ఉప యో గపడే వ్యవసాయ కళాశాలకు, వి ద్యార్థులకు ఉపయోగపడే నవోద య పాఠశాల నిర్మాణానికి శంకు స్థాపన చేయడం ఎంతో సంతోషం గా ఉందని తెలిపారు.
వ్యవసాయం ఒక విజ్ఞానమని, ఇం తకు పూర్వం దేశంలో జై జవాన్,జై కిసాన్, నినాదం ఉండేదని, ఆ త ర్వాత జై జవా న్, జై కిసాన్, జై వి జ్ఞాన్ నినాదం వచ్చిందని, ప్రస్తు తం ఇది జై జవాన్ ,జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ గా మా రిం దని తెలిపారు. గంగ, యము నా, సరస్వతి లాగే కృష్ణ, గో దావరి, కావేరి నదులు ఉండడం, మట్టప ల్లిలో స్వయంభు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉండడం ఇ క్కడి ప్రజల అదృష్టమని అన్నారు.
జిల్లాలో పెద్ద ఎత్తున వ్యవసాయం సాగు చేయడం, ప్రత్యే కించి పామాయిల్ పెంపకం చేపట్టడం అభినందనీ యమ న్నారు.ఈ సందర్భం గా రాష్ట్ర గవర్నర్ రై తులకు రెండు కో ట్ల 47 లక్షల రూ పాయల విలువ చేసే వ్యవసాయ యంత్ర పరిక రాల ప్రోసీడింగ్స్ ను అందజేశారు. అంతేకాక స్వయం సహాయక మ హిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద 504 కోట్లు, ఆదాయ వనరు లను పెంపొందించేందుకు మరో 8 9 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరా ల శాఖ మంత్రి నల్లమాద ఉత్తంకు మార్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పం డించని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అ త్యధికంగా వరి ధాన్యాన్ని పండిస్తున్నామని, దేశంలో ఎక్క డా లేనివిధంగా 85 శాతం మందికి ఉచితంగా సన్న బి య్యం ఇస్తున్నామని తెలిపారు. మట్టపల్లి అభివృద్ధికి త న వంతు శాయ శక్తుల ఇదివరకే కృషి చేశానని, భవిష్యత్తులో మ రింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాన న్నా రు.
హుజూర్నగర్ నుండి మట్టపల్లి వరకు 80 కోట్ల రూపాయల తో డబుల్ రోడ్డు మంజూరు చేశామ ని, గతంలో 50 కోట్ల రూపాయల తో బ్రిడ్జి నిర్మించామని చెప్పారు. కృష్ణ ,గోదావరి జిల్లాలో ఒక చుక్క నీటిని కూడా వదులుకోమని, కృ ష్ణ, గోదావరి జలాల హక్కులు కా పాడుకునేందుకు ఏ పోరా టైనకైనా సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. హుజూ ర్నగర్, కోదాడ ప్రజ ల జీవితాల్లో వెలుగు నింపడమే తన ల క్ష్యమన్నారు. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా 150 కోట్ల రూపాయలతో వ్యవసాయ కళాశాల, 50 కోట్ల రూపాయ లతో కోదాడ సమీ పంలో జవహర్ నవోదయ విద్యాల య నిర్మాణానికి శంకుస్థాపన చే యడం సంతోషమని అన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వర మాట్లా డుతూ రానున్న రోజుల్లో ఐటీ ,ఏఐ కన్నా వ్య వసాయ రం గమే ముందుంటుంద ని, సాఫ్ట్ వెర్, ఐటి సెక్టార్ ల నుండి వచ్చి వ్యవసాయ రంగంలో పనిచే సే రోజులు వస్తాయని అన్నారు. తె లంగాణ దేశానికే వరి అందించే ఏ కైక రాష్ట్రం గా మారిందని, వ్యవసా య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత లో భాగంగా వ్యవసాయ కళాశాల లు లేని ఉమ్మడి జిల్లా లలో వ్యవ సాయ కళాశాలల ఏర్పాటుకు చ ర్యలు తీసు కుంటున్నామని, ఇం దులో భాగంగానే నిజామాబాద్, రం గారెడ్డి జిల్లాలలో వ్యవసాయ కళాశాలలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
రెండు కోట్ల 50 లక్షల మెట్రిక్ ట న్నుల వరిధాన్యాన్ని పండిం చి తెలంగాణ రైతు లు దేశంలోనే ముందున్నారని, అ లాగే ఇతర పంటల విషయంలో సై తం రాష్ట్ర రైతులు ముందు నిలు స్తున్నారని, ప్రత్యేకించి ఆయిల్ పామ్ సాగులో తెలం గాణ ముందు ఉందని, రాబో యే రోజుల్లో తెలంగాణ రా ష్ట్రం పామాయిల్ పంటలో దేశంలో ప్రథమ స్థానంలో నిలు స్తుందని, ప్రస్తుతం 10 లక్షల ఎకరాలలో పామాయిల్ తోట లు పండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా సన్న బియ్యాన్ని సాగు చేయడంతో పాటు, పేద ప్రజలకు ఉచితం గా సన్న బియ్యం ఇస్తున్న ఘనత తమ దేనన్నారు.
జిల్లా ఇంచార్జ్ మంత్రి ,రాష్ట్ర సంక్షే మ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వ్యవసాయ విశ్వవిద్యా లయం వైస్ ఛా న్స్లర్ అల్తాఫ్ జానయ్య, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడారు.ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వందన సమ ర్పణ చేయగా, పార్లమెంట్ సభ్యులు కుందూర్ రఘువీర్ రె డ్డి, శాసన స భ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూ ర్ జయవేర్ రెడ్డి, కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి, వ్యవసాయ శా ఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, జిల్లా ఎస్పీ కే. నరసింహ, జి ల్లా అధికారులు, ప్రజాప్రతినిదులు తదితరులు ఈ కార్య క్ర మంలో పాల్గొన్నారు.




