TUWJ President Allam Narayana : ప్రజా దీవెన, కు త్బుల్లాపూర్ : తెలంగాణ తనాన్ని కాపాడుకుంటామని, పదే ళ్ల కిందట పోరాడి సాధించుకున్న తెలంగాణను మళ్లీ వె న క్కిపోనివ్వబోమని, మన అస్థిత్వాన్ని, సంస్కృతిని కాపా డు కోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని తెలంగాణ జ ర్నలిస్టుల యూనియన్ (TUWJ) అధ్యక్షుడు, ప్రెస్ అకాడ మీ మాజీ చైర్మన్, అల్లం నారాయణ పిలుపునిచ్చారు. టి యూడబ్ల్యూజే నియోజకవర్గ నూతన కమిటీ ఆవిర్భావ సం దర్భంగా శుక్రవారం కుత్బుల్లాపూర్లో నిర్వహించిన సభలో వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ మనదని, తెలంగాణ మనదని స్పష్టం చేస్తూ ఇక్కడ మళ్లీ ఆంధ్రా నాయకుల చక్రాలు తిప్ప డం సాగదని ఆయన హెచ్చరించారు.హైదరాబాద్ ను యూ టీ చేసే కుట్రలను తిప్పి కొడదామన్నారు. నాటి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (TJF) ఉద్యమ స్ఫూర్తిని మరోసారి ప్రద ర్శించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా అ ల్లం నారాయణ చేసిన కీలక వ్యాఖ్యలు ఆయన మాటల్లో నే..ఆంధ్రా పార్టీలకు తెలంగాణలో యేం పని చంద్రబాబు నా యుడు, పవన్ కల్యాణ్ వంటి నాయకులకు తెలంగాణలో ఏం పని తెలంగాణ కు తనదైన సినీ ప్రపంచం, సంస్కృ తి ఉన్నాయి, మాపై మీ ఆధిపత్యా న్ని రుద్దడమేమిటి? మే మే మైనా లేనోళ్లమా? లేకిడోళ్ళమా ”అని మండిపడ్డారు.
తెలంగాణ జర్నలిస్టులము తెలం గాణను ఎనుకకు పో ని యం. చంద్రబాబు తో మాకేంపని ? ఆంధ్రా సినిమా హీరో లతో తెలంగాణ కు ఏం పని?పదేండ్లు గడిసిపోయాయి. ఇం కా ఇక్కడ మీకెంపని? అని ప్రశ్నించారు. తెలంగాణ సమా జం చైతన్యవంతమైనదని, ఇక్కడి వ నరులపై, సంప్రదా యాలపై ఇతరుల ఆధిపత్యాన్ని సహించే ప్రసక్తే లేదని మ రోసారి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులంద రూ ఐక్యంగా ఉండి కుట్రలను తి ప్పికొట్టాలని కోరారు.
సీనియర్ జర్నలిస్టు, మాజీ ఎమ్మె ల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ స్వభావాన్ని కోల్పో తే మన ఉని కికే ప్రమాదమని ఆం దోళన వ్యక్తం చేశారు. గతంలో పా ర్టీలన్నీ విడిపోయి ఉన్నా, తెలంగా ణ కోసం అందరినీ ఏకం చేసిన ఘ నత తెలంగాణ జర్నలిస్టు ఉద్య మానికి ఉందని గుర్తు చేశారు. తెలంగాణ వనరులను దోచుకున్న వారిని హీ రోలుగా పొగడడం, ఎ న్టీఆర్ వంటి వారిని ఇక్కడ కీర్తిం చ డం భవిష్యత్తులో పెద్ద ప్రమా దానికి దారితీస్తుంది. దీనిని అ డ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలన్నారు.
టియూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సా గర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్య మించి సాధించుకున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం టి యూ డబ్ల్యూజే కృషి కొనసాగు తూనే ఉంటుందని, దేశంలో మరె క్కడా లేని విధం గా సంక్షేమ నిధిని ఏర్పాటు చేసు కొని, ఆ క్రెడిషన్లు, ఇండ్ల స్థలాలు ఇప్పించుకుని తెలంగాణ జర్నలి స్టుల హక్కుల కో సం పోరాడుతున్న ఏకైక సంఘం అల్లం నారాయణ అధ్యక్షుడుగా వున్న టియూడబ్ల్యూజేనేనని స్ప ష్టం చేశారు. టియూడబ్ల్యూజే రా ష్ట్ర ఉపాధ్యక్షులు రమేశ్ హజారి మాట్లాడుతూ తెలంగాణ స్వ రా ష్ట్రం కోసం దశా బ్దాలపాటు సాగిన ఉద్యమాల్లో తెలంగాణ జర్నలి స్టు లది కీలక భూమికన్నారు. తెలంగా ణ కోసమే తెలంగాణ జర్న లిస్టు అనే నినాదం తో, ఉద్యమ శక్తులను సమన్వయ పరి చి వారిని ఒక్కతాటి మీదికి తెచ్చి, రాష్ట్రాన్ని సాధించి తిరిగి పదేండ్ల స్వయం పాల న లో ప్రగతి పథంలో పునర్నిర్మాణం చేసుకోవడంలో తెలంగాణ జర్నలి స్టులది స్ఫూర్తివంతమైన పాత్ర అ ని అన్నారు. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో, మన అస్థిత్వాన్ని ఆగం చేసే నాటి ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు దా పురించాయని,తెలంగాణ అ స్తిత్వాన్ని కాపాడుకుంటూ స్వ యం పాలనను దెబ్బతినకుండా చూసు కోవలసిన సం ద ర్భంలో చైతన్యా న్ని ప్రదర్శించాలని హజారి పిలుపునిచ్చా రు.
తెలంగాణ చైతన్యాన్ని రగిలించే లా, మన కలలను, సంప్ర దాయాలను కాపాడుకోవడానికి ఐక్యంగా ముందుకు సాగా లని ఈ సందర్భం గా సంఘం రాష్ట్ర నేతలు పిలుపు నిచ్చా రు. నూతనంగా ఎన్నికైన అ ధ్యక్ష కార్యదర్శి కార్యవర్గానికి రా ష్ట్ర కమిటీ నేతలు అభినందనలు తెలిపారు. వారిని శా లువాలు మూమెంటోలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సంఘం కోశాధి కారి యోగానందం, తెంజు అధ్యక్ష కార్యద ర్శులు విష్ణువర్ధన్ రెడ్డి, ర మణకుమార్, సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, తిరుపతి నాయక్ త దితర నేతలు పాల్గొన్నారు.
