Wednesday, October 7, 2026
More
    HomePoliticsCM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి సం చలన వ్యాఖ్య,పదవులు,...

    CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి సం చలన వ్యాఖ్య,పదవులు, వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్నోళ్లు ఉ ద్యమకారులు ఎలా అవుతారు 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ఉద్యమం పేరుతో పదవులు, వేలకోట్ల ఆస్తులు సంపాదించుకు న్న మీరు ఉద్యమకారులు ఎలా అ వుతారని ముఖ్యమంత్రి ఎనుము ల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. ప్రజలు మిమ్మల్ని తిరస్క రించినప్పుడు అర్థం చేసుకోవాల ని, హుందాగా తప్పుకుoటే కొంతై నా మీ గౌరవం నిలబడేదoటూ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత ను ఉద్దేశించి పరోక్షంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన జస్టిస్ సంజీవ రెడ్డి కి రావి నారాయణ రెడ్డి అవార్డు ప్ర దానోత్సవం కార్యక్రమంలో భాగం గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై, ఆరో పణలు, ప్రత్యారోపణలపై స్పం ది స్తూ కేసీఆర్ తో పాటు బీఆరెస్ పార్టీ నేతలకు ముఖ్య మంత్రి రే వంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చా రు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనే…

    తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారు. ఉద్యమకారులం అని వాళ్లే చె ప్పు కుంటున్నారు. పోలీసులు చిన్న నో టీసులు ఇస్తే జాతిపితకు నోటీసు లు ఇస్తారా అంటున్నారు. ఆనాడు జాతిపిత గాంధీజీ పదవులను త్యాగం చేసి దుర్మార్గుల తూటా ల కు ప్రాణాలు వదిలారు. మరి ఇప్పు డు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు ఏం చేశారు.

    తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫె సర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా. ఆనాడు తలుపులు బద్దలు కొట్టి ఆయన్ను అరెస్టు చేసింది మీ పాలనలో కాదా, అప్పుడు ఉద్య మకారులు గుర్తుకురాలేదా. పోలీ సులు మిమ్మల్ని అలా తలుపులు బద్దలు కొట్టి తీసుకురాలేదు కదా నోటీసులు ఇచ్చి విచారణకు పిలి చారు.

    రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పో యారు. ప్రజలే తప్పు చేశారని చె ప్పడం ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇ దెక్కడి ఉద్యమకారుడి లక్షణం, ఇ దెక్కడి జాతిపిత లక్షణం. అక్రమ మార్గం ఎంచుకున్న వారు ప్రజా స్వామ్యంలో విచారణ ఎదుర్కో వాల్సిందే అని అంబేద్కర్ చెప్పా రు. శిబు సోరెన్ లాంటి వాళ్లు వి చారణ ఎదుర్కొన్నారు.

    మనమేం దైవాంశ సంభూతులం కాదు.మధ్య యుగాల చక్రవర్తులు తమ బాధను రాజ్యం బాధగా ప్ర చారం చేసేవారు. మధ్య యుగాల చక్రవర్తులకు కాలం చెల్లింది. ప్రజా స్వామ్యంలో తప్పు చేసినవారు వి చారణ ఎదుర్కోవాల్సిందoటూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యా ఖ్యలు చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.