–మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
— శాంతి భద్రతలకు విఘతాం కలి గిస్తే కఠిన చర్యలు తప్పవు
–ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక పా ర్కింగ్ స్థలాలు
Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో నల్లగొండ మున్సిపల్ కా ర్పొరే షన్‌తో పాటు ఆరు మున్సి పాలిటీలలో నిర్వహించబడిన ము న్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రి యను ప్రశాంతంగా, పారదర్శకంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వ హించేందుకు పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో సమగ్ర భద్రతా ఏర్పాట్లు చే పట్టి నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
జిల్లాలోని అన్ని కౌంటింగ్ కేంద్రాలు మరియు స్ట్రాంగ్ రూము ల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను అ మలు చేసినట్లు ఆయన వెల్లడిం చారు. టీజీఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏ ఆర్), సివిల్ పోలీస్ సిబ్బందిని ని యమించి 24 గంటల నిఘా కొన సాగుతోందన్నారు. స్ట్రాంగ్ రూ ముల వద్ద సీసీటీవీ కెమెరాల ప ర్యవేక్షణతో పాటు ప్రవేశ, నిష్క్ర మణ పాయిం ట్ల వద్ద కఠిన తనిఖీ లు చేపడుతున్నట్లు తెలిపారు.
రేపు ఉదయం 8.00 గంటలకు కౌం టింగ్ ప్రక్రియ ప్రారం భ మవుతున్న నేపథ్యంలో నల్లగొండ కార్పొరేషన్ ఓట్ల లెక్కిం పు ఆర్జాలబావి కౌంటిం గ్ కేంద్రంలో, చిట్యాల, దేవరకొండ, చండూరు, నిడుమనూరు మున్సి పాలిటీల కౌంటింగ్ నల్ల గొండ సోష ల్ వెల్ఫేర్ స్కూల్‌లో మిర్యాలగూడ, హాలియా, నందికొండ మున్సి పాలిటీల కౌంటింగ్ మిర్యాలగూడ మం డలం అవంతీపురం మార్కెట్ యార్డు ప్రాంగణంలో జరుగ నున్నా యని తెలిపారు.
ఈ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక డీఎ స్పీ అధికారి ఆధ్వర్యంలో 15 మం ది సీఐలు, 40 మంది ఎస్‌ఐలు మ రియు ఇతర సిబ్బందితో కలిపి సు మా రు 600 మంది పోలీస్ సిబ్బం దిని బందోబస్తుకు నియమిం చినట్లు తెలిపారు. శాంతిభద్రతల పరి రక్షణలో ఎటువంటి నిర్లక్ష్యం స హించబోదని ఎవరైనా శాంతి భద్రతలకు విఘా తం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.
కౌంటింగ్ కేంద్రాల భద్రతా దృష్ట్యా లోపలికి తీసుకువెళ్లే వస్తు వులపై కఠిన పరిమితులు విధించినట్లు జి ల్లా ఎస్పీ తెలిపా రు. కౌంటింగ్ హా ల్‌లోకి ఇంక్ బాటిల్స్, పెన్నులు, మార్కర్లు, సెల్ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు, పర్సులు మరియు ఇతర అనుమ తి లేని సామాన్లు తీసు కురావడం పూర్తిగా నిషేధించబడింది. ఎన్నిక ల అధికారుల ద్వారా అనుమతి పొందిన గుర్తింపు కార్డులు కలిగిన సిబ్బం ది మరియు అభ్యర్థుల ఏ జెంట్లు మాత్రమే నిర్దిష్ట నియమ ని బంధనల ప్రకారం లోపలికి అను మతించబడతారన్నా రు.
కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతా ల్లో ట్రాఫిక్ సమస్యలు త లెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏ ర్పాటు చేయబడి నట్లు తెలిపారు. అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారుల వాహ నాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అవసర మైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయడంతో పాటు అదనపు ట్రా ఫి క్ సిబ్బందిని నియమించినట్లు వెల్ల డించా రు. ప్రజలకు ఎలాంటి అసౌ కర్యం కలగకుండా ముందస్తు ప్రణా ళికతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందు న కౌంటింగ్ కేంద్రాల పరి సర ప్రాం తాల్లో గుంపులుగా చేరడం, అనవసర రద్దీ సృష్టిం చడం, నినాదాలు చేయడం వంటి చర్యలను అనుమ తించ బోమని హెచ్చరించారు. అనుమతి లేని వ్యక్తులను కౌంటింగ్ కేంద్రాల పరిధిలోకి అనుమతించ రని తెలిపారు.కౌంటింగ్ అ నంతరం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నం దున గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, భా రీ ఊరేగింపులు, బాణాసం చా కాల్చడం, డీజే సౌండ్ సిస్ట మ్ వినియోగించడం వంటి కార్యక్ర మాలకు అనుమతి లేద ని జిల్లా ఎ స్పీ స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో సంబంధితులపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించా రు.ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పూర్తిగా శాంతియుత వా తావరణంలో విజయవంతంగా ముగించేందుకు రాజకీయ పార్టీ లు, అభ్యర్థులు, వారి అనుచరు లు మరియు ప్రజలు పోలీస్ శాఖ కు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

