Minister Komatireddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో బుధ వారం పలుఅభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర రో డ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్ల గొండలో ఇక రౌడీయిజం, మాదకద్ర వ్యాల రుగ్మతలను ఉక్కుపాదంతో అణచివేస్తామని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు సంవ త్సరాలలో నల్లగొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది స్మార్ట్ సిటీ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా నని పేర్కొన్నారు.
నల్లగొండ నగరాన్ని శాంతి సామర స్యాలకు, ప్రశాంత వాతావరణానికి నిలయంగా తీర్చిదిద్దుతామని, పే దవాడి అభివృద్ధే లక్ష్యంగా పనిచే స్తామని పునరుద్ఘాటించారు. రాబో యే పదేళ్లలో నల్లగొండను ఇండస్ట్రి యల్ హబ్ గా తీర్చిదిద్దుతామని, నల్గొండ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.నల్లగొండ పట్టణంలో పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని, ఇక పై ఆకస్మి క తనిఖీలు చేస్తానని స్ప ష్టం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు వారి డివిజ న్ లో పరిధిలో సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని సూచిం చారు. పట్టణ ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 24 గం టలు తాగునీరు వచ్చేలా నీటి ట్యాంకులు నిర్మిస్తున్నామన్నారు.
శానిటేషన్, పార్కుల అభివృద్ధి అ తి ముఖ్యమని, పట్టణంలో వి ద్యు త్తులోవోల్టేజి సమస్య లేకుండా ప ట్టణం చుట్టూ సబ్ స్టేషన్ నిర్మిస్తు న్నామని లైన్లు మారుస్తున్నామని, రూ. 900 కోట్లతో ఔటర్ రింగ్ రో డ్డు పనులు శరవేగంగా కొనసాగు తున్నాయని తెలిపారు. పట్టణం లోని అంగన్వాడీలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తు న్నామన్నారు.
బొట్టు గూడా పాఠశాల మాదిరిగా నే మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల ను అభివృద్ధి చేస్తామని, రూ. 20 కోట్లతో న్యాక్ బిల్డింగు నిర్మాణంలో ఉందని,84 కోట్ల రూపాయల వ్య యంతో నిర్మించిన అడ్వాన్స్ టెక్నా లజీ కేంద్రం పూర్తయిందని చెప్పా రు. ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టు లైనింగ్ పనులు నిన్నటి నుండి ప్రారంభమ య్యాయని వివరించారు.
బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తున్నామని, నల్ల గొండ పట్టణంలో లతీఫ్ సాబ్ గు ట్ట, బ్రహ్మంగారి గుట్ట ఘాట్ రోడ్లతో పాటు, ఔటర్ రింగ్ రోడ్ ,8 సబ్ స్టే షన్లు నిర్మాణ పనులు జరుగుతు న్నాయని, రాజకీయాలకతీతంగా పనులు చేయండని తెలిపారు.
ప్రజా జీవితంలో పనులే ముఖ్య మని,ఎనభై లక్షల రూపాయల వ్య యంతో అభివృద్ధి చేయనున్న ప ద్మావతి కాలనీ పార్కు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, 50 లక్ష ల రూపాయలతో అభివృద్ధి చేసే శి వాజీ నగర్ పార్కు పనులకు శంకు స్థాపన చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, బీ ర్ల ఐలయ్య, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ జిల్లా కలె క్టర్ బి.చంద్రశేఖర్, ఇంచార్జి అదన పు కలెక్టర్ జగదీష్ రెడ్డి, మాజీ ము న్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ము ల మోహన్ రెడ్డి, బోయపల్లి శ్రీనివా స్, మార్కెట్ చైర్మన్ రమేష్, వం గూరిలక్ష్మయ్య, అల్లి సుభాస్,పు న్న గణేష్ తదితరులు పాల్గొన్నా రు.



