Telangana Rajya Sabha Elections : ప్రజా దీవెన, హై దరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘ ట్టానికి తెరలేచింది. రాజ్యసభ ఎ న్నికల కోసం నామినేషన్ ప్రక్రియ అధికారికంగా ముగియగా మొత్తం మూడు నామినేషన్లు దా ఖలయ్యాయి. ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ మూడు సెట్ల నామినేషన్లు సమర్పిం చగా మరో అభ్యర్థి వేo నరేందర్ రెడ్డి నాలుగుసెట్ల నామినే షన్లు దాఖలు చేసి పోటీకి సిద్ధమయ్యారు.
ఇదిలా ఉండగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా సాయి ఒకే ఒక సె ట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే రాజ్యసభ ఎన్నిక ల నిబంధనల ప్ర కారం అవసరమైన 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడం ఆ నామినేషన్‌పై సందేహాలు రేకెత్తి స్తోంది. దీంతో స్క్రూటినీ సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నా మినేషన్‌ను తిరస్కరించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్ర ధాన అభ్యర్థులైన అభిషేక్ మనుసింఘ్వీ, వేమ్ నరేందర్ రె డ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు స్పష్టం గా కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ రాజ్యసభ ఎన్నికల ఫలితం దాదాపు ఖరారైనట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇప్పుడు అందరి దృష్టి స్క్రూ టి నీ ప్రక్రియపై ఉందని, అక్కడ ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
