— నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్
Nalgonda district collecter Badugu Chandrashek ar : ప్రజాదీవెన, మిర్యాలగూడ: నూతన ప్రజాప్రతినిధులు గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరిం చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలు పునిచ్చారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళిక అమలులో భాగంగా శుక్రవారం నల్గొండ జి ల్లా మిర్యాలగూడలో నిర్వహించిన మిర్యాలగూడ నియో జ కవర్గస్థాయి ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక సన్నాహక సమా వేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగ తి ప్రణాళిక కార్యక్రమం లో భాగం గా 99 రోజులపాటు నిర్వహించవలసిన కార్యక్ర మాలను షెడ్యూల్ ప్రకారం రూపొందించి పది ప్రధాన అంశా లను తీసుకొని వాటిపై అవగాహనతో పాటు సమస్యల పరి ష్కారానికి కృషి చేయడమే కాకుం డా, ఇప్పటివరకు ప్రభు త్వం సాధించిన అభివృద్ధి పై ప్రజలకు తెలియజేసేందుకు చే పట్టడం జరిగిందని వెల్లడించారు. ఇందులో భాగంగా మా ర్చి 6 నుండి 15 వరకు అన్ని గ్రామాలు, పట్టణాలు, కార్యాల యాలలో పరిశుభ్రత కార్యక్రమా ల ను చేపట్టేందుకు నిర్దేశిం చడం జరిగిందని, అంతేకాక అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యా లయాలలో ఫైళ్ల పరిష్కారం చేపట్టినట్లు తెలిపారు.
ప్రజాప్రతినిధులు గ్రామాలలో పర్య టిస్తే సమస్యలు తెలుస్తా యని, వా టిని పరిష్కరించేందుకు కృషి చే యాలని పిలు పునిచ్చారు. ఎంపీడీ వోలు గ్రామ వారీగా ప్రభుత్వం ద్వా రా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాబి తాను రూపొందించి ఏప్రిల్ 2న ని ర్వహించనున్న గ్రామసభలలో వా టిని చదివి విని పించాలని, అదేవి ధంగా ప్రభుత్వం అమలుచేసే అభి వృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను గ్రా మసభలలో,మున్సిపల్ పట్ట ణాలలో చర్చించాలన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల ను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని, ఎల్ -3 నుం డి ఎల్- 1 కు వచ్చిన కొన్ని ఇండ్ల సాంకేతిక సమస్యలను పరిష్కరి స్తు న్నామని , ఉగాది నాటికి సా మూహిక ఇందిరమ్మ గృహప్రవే శాలను చేసేలా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు.
ఈ నెల 14 నుండి జరిగే ఎస్ ఎస్ సి పరీక్షలకు అన్ని ఏర్పా ట్లు చేశామని జిల్లా వ్యాప్తంగా విద్యార్థులం దరూ 10వ త రగతి పరీక్షలలో నూ టికి నూరు శాతం ఫలితాలు సా ధిం చాలన్నారు.పశ్చిమాషియా యుద్ధ నేపథ్యంలో నెలకొన్న ఎ ల్పీ జీ గ్యాస్ కొరతపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డొమెస్టిక్ సిలిం డర్ల కు ఎలాంటి కొరత లేదని, వాణిజ్య పర మైన సిలిండర్లకు మాత్ర మే కొరత ఉందని అందువల్ల ప్రజ లు అపోహలను నమ్మవద్దని, దళారీల మాటలు నమ్మి మో సపోవద్దని తెలిపారు. ఎల్పిజి గ్యాస్ సరఫరా విషయమై గు రువారమే ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీలతో సమీక్ష సమావేశం ని ర్వహించడం జరిగిందని, జిల్లాలో డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ క నెక్షన్లను అక్రమంగా కమర్షియల్ కు వాడిన 16 మందిపై కే సులు నమోదు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ ఉద్దేశాలు, మార్గదర్శకత్వాన్ని నెరవేర్చే విధంగా 99 రోజుల కార్యాచ రణ ప్రణాళికలో ప్రతి ఒక్కరూ పనిచేసి విజయవంతం చే యాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మిర్యాలగూడ శాస నసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతి నిధు లు,అధికారులందరుకలిసికట్టుగా పనిచేసి మిర్యాలగూ డ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు నిలపాల న్నా రు. మిర్యాలగూడ వాణిజ్యపరంగా ముందున్నప్పటికీ అనే క మంది పేదవారు ఉన్నారని, వారికి విద్య ,వైద్యానికి పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ తో కోరారు. యూరి యాకు సంబం ధించి మండలాల వారీగా కాకుండా ప్రాథమి క వ్యవసాయ సహకార సంఘాల వారిగా తమకు కేటా యించాలని, వైటిపిఎస్ కు సంబంధించిన సిఎస్ఆర్ నిధుల ను అభి వృద్ధి పనులకు మంజూరు చేయా లని విజ్ఞప్తి చేశా రు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్ర ణాళికలో భాగంగా నూతన ప్రజాప్రతినిధులు గ్రామాలు, మండలాలలో పర్యటించి సమస్యలు గుర్తించి పరిష్కరిం చాలని, అంతేకాక సమస్యల పరిష్కారానికి అవసరమ య్యే నిధుల అంచనాలను రూపొంది సమర్పించాలని, అం దరూ కలిసికట్టుగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవు తుం ద ని అన్నారు. ప్రజాభివృద్ధే అందరి లక్ష్యం కావాలని, నియో జకవర్గంలో తాగునీరు, విద్యుత్తు సమస్యలను గుర్తించి పరి ష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అందరికీ వి ద్య, వైద్యం అందు బాటులో ఉంచడమే తమ లక్ష్యమని, ప్ర జా సంక్షేమాన్ని బాధ్యతగా తీసుకోవాలని, రాజకీయాల కతీ తంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అ న్నారు. రాబోయే రో జుల్లో మిర్యాలగూడ పట్టణంలో ఈఎ న్టి ఆసుపత్రి,ప్రస్తుత ఆసుపత్రిని స్థాయి పెంచడం, రోడ్లు, డ్రై నేజీ, తాగునీటి సమ స్యల పరిష్కారం, రింగ్రోడ్డు ఏర్పా టు, విద్య ,వైద్యానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం వం టి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కో సం రాష్ట్ర ప్ర భుత్వం పాటుపడుతున్నదని, పేదలు, అట్ట డుగు వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం గతం నుండి ఎ న్నో సంస్కరణలు తెచ్చిందని తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్ సుధ, వైస్ చైర్మన్ తదితరులు మాట్లాడారు. ఈ సం దర్బంగా వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ ప్రాధామ్య అం శాలపై పవర్ పాయింట్ ప్రెజెం టేషన్ ద్వారా ప్రజా ప్రతి ని ధులకు వివరించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా య ణ్ అమిత్, మున్సిపల్ కమిషనర్,జిల్లా అధికారులు హా జర య్యారు.



