godavari river explosives : ప్రజా దీవెన, మంచిర్యాల: మంచి ర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని బాదంప ల్లి గ్రామ సమీపంలో గోదావరి నదిప్రవాహ ఒడ్డున ఆందోళ నకర ఘటన చోటుచేసుకుంది. వన్యప్రాణులను వేటాడేం దుకు గుర్తుతెలియని వేటగాళ్లు పేలుడు పదార్థాలు అమ ర్చినట్లు ప్రాథమికంగా సమాచారం అందింది.
గ్రామానికి చెందిన పశువుల కాపరులు తమ బర్లను మేత కోసం గోదావరి తీర ప్రాంతానికి తీసుకువెళ్లగా మేత కోసం తిరుగుతున్న బర్లల్లో కొన్ని సదరు పేలుడు పరికరాలను తి నడంతో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటన లో పలు బర్లకు తీవ్రగాయాలు కావడంతో కాపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గాయపడిన పశువులను సమీ పంలోని వెటర్నరీ వైద్యుల వద్ద చికిత్సకు తరలించారు.ఈ ఘటనతో గ్రామస్థుల్లో భయం నెలకొంది.
వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఇలాంటి ప్రమాదకర పేలుడు పరికరాలు అమర్చడం వల్ల నిరపరాధ మూగజీవాలైన ప శువులు బలవు తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. సంబంధి త అటవీ శాఖ అధికారులు, పోలీసు అ ధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇదే ప్రాంతంలో మూడు రోజుల క్రితం కూ డా ఇలాంటి ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం తెలు స్తోంది. పేలుడు పరికరాలను తినడం వల్ల నాలుగు మేకలు మృతి చెందినట్లు గ్రామస్థు లు తెలిపారు. దీంతో గ్రామ ప్రజ ల్లో మరింత భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జన్నా రం ఎస్ ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు. బాధ్యుల్ని గుర్తించి చట్టపరమైన చ ర్యలు తీసుకుంటామని ఆయన మీడియా తో తెలిపారు. ఏది ఏమై నా మూగ జీవాలు సైతం మానవు లు చేస్తోన్న అనాలోచిత నిర్ణయాల వల్ల జరిగే పేలుళ్ల బారి నపడి అర ణ్యరోదన అనుభవిస్తున్నాయని జంతు సంరక్ష ణ సంస్థలు, ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
