Tuesday, September 29, 2026
More
    HomeSportsJai Chandra Goud Black Belt Achievement : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ బుల్ బుల్...

    Jai Chandra Goud Black Belt Achievement : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ బుల్ బుల్ ఘనకీర్తి,9ఏళ్ల వయసులోనే ‘బ్లాక్ బెల్ట్’ సాధించిన జైచంద్రగౌడ్

    📰 Generate e-Paper Clip

    Jai Chandra Goud Black Belt Achievement : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన కే వలం 9 సంవత్సరాల వయసు గల వేముల జై చంద్ర గౌడ్ చిన్న వయస్సులో ఘనకీర్తి సాధించా డు. ఆ వయస్సులో మనం ఏం చేస్తుంటాం? ఆటలు, స్కూలు హోం వర్క్‌లతో బిజీగా ఉంటాం. కానీ, న ల్లగొండకు చెందిన జై చంద్ర గౌడ్ వే ముల మాత్రం నడుముకు ‘బ్లాక్ బె ల్ట్’ కట్టుకుని రికార్డుల వే ట మొద లుపెట్టాడు. బుధవారం నల్లగొండ ఎస్పీ శరత్ చం ద్ర పవార్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక బ్లాక్ బెల్ట్‌ ను అం దుకుని జిల్లాకే గర్వకారణంగా నిలిచాడు.

       3 ఏళ్లకే మొదలైన ప్రయాణం

    నల్లగొండ కు చెందిన వేముల ప్రకా ష్ గౌడ్ తనయుడు జై చంద్రగౌడ్ కరాటే జర్నీ ఈరోజో నిన్ననో మొ దలైంది కాదు. సరిగ్గా మాట్లాడటం కూడా రాని 3 సంవత్సరాల వయ సు లోనే కరాటే దుస్తులు ధరించి ప డగ విప్పిన పాములా ప్రా క్టీస్ మొదలుపెట్టాడు. నల్లగొండ పట్టణంలోని ఆర్యసమా జ్ ప్రాంగణంలో ఉన్న ‘హనుమాన్ కరాటే అకాడమీ’లో చీఫ్ కో చ్ మాస్టర్ డి. వంశీ యాదవ్ పర్యవేక్షణలో నిరంతర సాధ న చేశాడు. 9 ఏళ్ల వయసు లోనే నిరంతర క్రమశిక్షణ, పట్టు దల ఫలితంగా కరాటేలో అత్యున్నతమైన బ్లాక్ బెల్ట్ ఘన త సాధించాడు.

       నల్లగొండ ఎస్పీ ప్రశంసల జల్లు

    చిన్న వయసులోనే ఎన్నో పోటీల్లో మెరుపులు మెరిపించి, ఈ ఘనత సాధించిన జై చంద్రను నల్లగొండ జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ ప్రత్యే కంగా అభినందించారు.స్వయంగా తన చేతులతో బ్లాక్ బెల్ట్ అందిస్తూ ఈ బుడతడు భవిష్య త్తులో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారతదేశ జెండా ను ఎగరేస్తాడని ఆకాంక్షించారు. చిన్నారి సాధించిన ఈ అ ద్భుత విజయానికి హను మాన్ అకాడమీ శిక్షకులు, తల్లిదం డ్రులతో పాటు నల్లగొండ క్రీడాభి మానులు హర్షం వ్యక్తం చే స్తున్నా రు. ఆల్ ది బెస్ట్ జై చంద్రగౌడ్ కు ఈ సందర్భంగా ప్ర జా ‘దీవెన‘ సైతం అభినందనలు తెలుపుతూ భవిష్యత్ లో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.