Jai Chandra Goud Black Belt Achievement : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన కే వలం 9 సంవత్సరాల వయసు గల వేముల జై చంద్ర గౌడ్ చిన్న వయస్సులో ఘనకీర్తి సాధించా డు. ఆ వయస్సులో మనం ఏం చేస్తుంటాం? ఆటలు, స్కూలు హోం వర్క్‌లతో బిజీగా ఉంటాం. కానీ, న ల్లగొండకు చెందిన జై చంద్ర గౌడ్ వే ముల మాత్రం నడుముకు ‘బ్లాక్ బె ల్ట్’ కట్టుకుని రికార్డుల వే ట మొద లుపెట్టాడు. బుధవారం నల్లగొండ ఎస్పీ శరత్ చం ద్ర పవార్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక బ్లాక్ బెల్ట్ ను అం దుకుని జిల్లాకే గర్వకారణంగా నిలిచాడు.
3 ఏళ్లకే మొదలైన ప్రయాణం
నల్లగొండ కు చెందిన వేముల ప్రకా ష్ గౌడ్ తనయుడు జై చంద్రగౌడ్ కరాటే జర్నీ ఈరోజో నిన్ననో మొ దలైంది కాదు. సరిగ్గా మాట్లాడటం కూడా రాని 3 సంవత్సరాల వయ సు లోనే కరాటే దుస్తులు ధరించి ప డగ విప్పిన పాములా ప్రా క్టీస్ మొదలుపెట్టాడు. నల్లగొండ పట్టణంలోని ఆర్యసమా జ్ ప్రాంగణంలో ఉన్న ‘హనుమాన్ కరాటే అకాడమీ’లో చీఫ్ కో చ్ మాస్టర్ డి. వంశీ యాదవ్ పర్యవేక్షణలో నిరంతర సాధ న చేశాడు. 9 ఏళ్ల వయసు లోనే నిరంతర క్రమశిక్షణ, పట్టు దల ఫలితంగా కరాటేలో అత్యున్నతమైన బ్లాక్ బెల్ట్ ఘన త సాధించాడు.
నల్లగొండ ఎస్పీ ప్రశంసల జల్లు
చిన్న వయసులోనే ఎన్నో పోటీల్లో మెరుపులు మెరిపించి, ఈ ఘనత సాధించిన జై చంద్రను నల్లగొండ జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ ప్రత్యే కంగా అభినందించారు.స్వయంగా తన చేతులతో బ్లాక్ బెల్ట్ అందిస్తూ ఈ బుడతడు భవిష్య త్తులో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారతదేశ జెండా ను ఎగరేస్తాడని ఆకాంక్షించారు. చిన్నారి సాధించిన ఈ అ ద్భుత విజయానికి హను మాన్ అకాడమీ శిక్షకులు, తల్లిదం డ్రులతో పాటు నల్లగొండ క్రీడాభి మానులు హర్షం వ్యక్తం చే స్తున్నా రు. ఆల్ ది బెస్ట్ జై చంద్రగౌడ్ కు ఈ సందర్భంగా ప్ర జా ‘దీవెన‘ సైతం అభినందనలు తెలుపుతూ భవిష్యత్ లో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించింది.

