Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: కపస్ కాంతి పథకంలో భాగంగా పంపిణీ చే స్తు న్న పత్తి విత్తనాలను జిల్లా రైతు లు సద్వినియోగం చేసు కో వాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. గురువారం అ యన నల్గొండ జిల్లా కట్టంగూరు రైతు వేదికలో ఏర్పాటుచే సిన పత్తి విత్తనాల ప్రద ర్శన పంపిణీ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా హాజరై రైతులను ఉ ద్దే శించి మాట్లాడుతూ కపస్ కాం తి పథకంలో భాగంగా 19 ప్రముఖ కంపెనీలకు చెందిన లక్ష 65 వేల పత్తి విత్తనాల ప్యాకెట్లు జిల్లాలో సిద్ధం గా ఉన్నాయని, అలాగే వీటి తోపాటు సస్యరక్షణ మందులై న వేప నూనె, సూక్ష్మపోషకాలు , జీవ నియంత్రణ ఎరువు లు కూడా రైతులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
రెండున్నర ఎకరాలు కలిగిన రైతుకు 5 పత్తి విత్తనాల పా కెట్లను ఉచి తంగా అందజేయడం జరుగు తుందని వీటిని సద్వినియోగం చేసుకొ ని రైతులు అధిక దిగుబడులు సా ధించాలని కోరారు. ప్రస్తుతం ఎల్ నినో కారణంగా నెలకొన్న వర్షా భావ పరిస్థితులను దృష్టిలో ఉంచు కొని రైతులు ప ప్పు దినుసులు, చి రుధాన్యాలు పండించాలని, వరిలో సన్న రకాల వైపు రైతులు వెళ్లా విల్సిన అవసరం ఉందని, వ్య వ సాయ అధికారులు కూడా రై తు లను సన్నాల వైపు ప్రోత్స హించా లని కోరారు. యూరియా స్థానం లో నానో యూరి యా వాడాలని నానో యూరియా ఉపయోగాలను రైతుల కు తెలియజేసి వాటిని వినియోగించుకునే విధంగా చర్య లు తీసుకోవాల్సిందిగా ఆయన వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
కాగా కపస్ కాంతి పథకంలో భాగం గా జిల్లాలో 19 ప్రముఖ కంపెనీలకు చెందిన లక్ష 65 వేల పత్తి విత్తనాల పాకెట్ల ద్వా రా అధిక దిగుబ డులు సాధించే ఉద్దేశ్యంతో , ఇది వరకు ప త్తి సాగులో ఉన్న లోపాల ను సవరిస్తూ ఎకరాకు కనీసం 75 0 కిలోల దిగుబడిని సాధించే విధంగా ప్రదర్శన కార్యక్రమా లను నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భా గంగా రెండున్నర ఎకరాలకు 5 పాకెట్లు అధిక సాంద్ర త కలి గి దగ్గరగా పత్తి విత్తనాలు వేసే రైతులకు 10 పాకెట్లు, ఆ పై 15 ప్యాకెట్లను ఇచ్చే విధంగా రూపొందించడం జరిగింది. ఇందుకు సంబంధించి రైతులు పత్తి విత్తనాలు, యాజ మా న్య పద్ధతులు వాటి లోని మెలకువలను పాటించి లబ్ధి పొం దాలని కలెక్టర్ కోరారు.
ముఖ్యంగా వ్యవసాయ శాస్త్రవేత్త లు, అధికారులు ఇచ్చే సూచ lనలు తెలుసుకోవాలని,ఇంకా ఏవైనా స మస్యలు ఉంటే తమ దృష్టికి తీసు కురావాలని కోరారు. పత్తి విత్తనా ల పంపిణీ వివరాలను అన్ని రైతు వేదికల వద్ద వ్యవసాయ కార్యాల యాల వద్ద రైతులకు అర్థమయ్యే విధంగా ఫ్లెక్సీ ద్వారా ప్రదర్శించాల ని, ఉదయం నుండి సాయంత్రం వ రకు విత్తనాలు అందజేసేలా చర్య లు తీసుకోవాలని, ఎక్క డైనా సమ స్యలు ఉంటే వ్యవసాయ అధికా రులతో రైతు లు చర్చించాలని కలె క్టర్ సూచించారు. నకిరేకల్ వ్యవ సా య శాఖ సహాయ సం చాలకు లు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి, కట్టంగూరు త హసిల్దార్ తదిత రులు కలెక్టర్ వెం ట ఉన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మం డల కేంద్రంలో ఓటరు జా బితా ప్రత్యేక సమగ్ర సవరణ (స ర్) కా ర్యక్రమాన్ని పరిశీలించారు. సర్ కార్యక్రమాన్ని పార దర్శకంగా నిర్వ హించాలని, ఎక్కడ ఎలాంటి పొర పాట్లకు తావివ్వకుండా పూర్తిచేయాలని బిఎల్ఓలను ఆదేశించారు.
పారదర్శకంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ
నల్లగొండ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమా న్ని పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధి కారి బి.చంద్రశేఖర్ అన్నారు. గు రు వా రం అయన నల్గొండ పట్టణం లోని పలు కాలనీలలో ని ర్వ హిస్తున్న సర్ ఓటరు నమోదు కార్యక్ర మాన్ని పరిశీలించా రు. పానగల్ రహదారి లోని అర్బన్ హాస్పిటల్ ఎదురుగా , అలాగే శ్రీనగర్ కాలనీలలో బిఎల్ ఓలు ఓటర్ల ఇంటింటికి వెళ్లి సర్ కార్యక్రమం నిర్వహిస్తుం డగా జిల్లా కలెక్టర్ అక్క డికి వెళ్లి సర్ ప్రక్రియను తనిఖీ చేశారు.ఓటర్లకు ఎన్యు మరే షన్ ఫామ్స్ ఇ చ్చినది మొదలుకొని వాటిని పూ రించి తిరిగి వాపస్ తీసుకోవడం, 6,7,8 ఫారంలన్నీ బిఎల్ ఓలతో పాటు ఉన్నది లేనిది పరిశీలించారు.
అంతేకాక ఎన్నికల సంఘం ఆదే శాల మేరకు బిఎల్వోలు కిట్ తో పాటు ఐడెంటిటీ కార్డు ఇతర సా మాగ్రిని అంతటిని తీసుకువెళ్తున్న డి లేనిది,అలాగే బిఎల్ఎలు హాజ రవుతు న్నది లేనిది అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా స్థా నికం గా ప్రజలతో జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ సర్ లో ఏ మైనా ఇబ్బం దు లు ఉంటే తమ దృష్టికి తీసుకురా వాలని అన్నారు.బి ఎల్ ఓలు ఇం టింటికి వచ్చినప్పుడు సరైన స మా లచారాన్ని ఎన్యుమరేషన్ ఫామ్స్ లో పూర్తిచేసి ఇవ్వా లని చెప్పారు. సర్ కార్యక్రమం పూర్తయిన తర్వా త ఓటరు జాబితాను ప్రదర్శిం చడం , తప్పొప్పులు కొత్త ఓటరు నమో దు, సవరణలు చేసేందుకు ఆ తర్వాత అవకాశం ఉంటుంద ని తెలిపారు.




