Monday, September 28, 2026
More
    HomeOpinionCongress Internal Clashes Reach Peak : ఫ్లాష్ ఫ్లాష్, తుంగతుర్తి కాంగ్రెస్‌లో నిప్పురాజేసిన ‘మండల’...

    Congress Internal Clashes Reach Peak : ఫ్లాష్ ఫ్లాష్, తుంగతుర్తి కాంగ్రెస్‌లో నిప్పురాజేసిన ‘మండల’ చిచ్చు, రంగంలోకి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

    📰 Generate e-Paper Clip

    Congress Internal Clashes Reach Peak : ప్రజా దీవె న, తుంగతుర్తి: సూర్యా పేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ రాజ కీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మండల అధ్యక్షుల ని యామక ప్రక్రియ నియోజకవర్గ కాం గ్రెస్‌లో తీవ్ర భూకంపం సృష్టించింది. అసంతృప్తి జ్వాలలు భగ్గుమనడంతో.. పార్టీ డ్యామేజ్ కంట్రోల్‌ కోసం భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నా రు.తుంగతుర్తి నియోజకవర్గ పరిధి లో ని సూర్యాపేట, యా దాద్రి భువనగిరి జిల్లాల అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షు ల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరు తూ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు ఎo పీ చామల అత్యవసర లేఖ రాయ డం ఇప్పుడు రాష్ట్ర రా జకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరా జన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం.

       ఎంపీ చామల లేఖలో ఏముంది

    ప్రస్తుతం అధికారిక పర్యటనలో ఉన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో తలెత్తిన తీ వ్ర అసంతృప్తిని గమనించి వెంటనే స్పందించారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన ఆయన, అందరి ఏకాభి ప్రాయం కుదిరే వరకు ఈ నియామకాలను హోల్డ్‌లో పెట్టాలనికోరారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ని కీలక నే తలతో సంప్రదింపులు జ రిపిన తర్వాతే తుది నిర్ణయం తీ సుకోవాలని లేఖలో స్పష్టం చేశారు. మంత్రి ఎన్. ఉత్తమ్ కు మార్ రెడ్డి,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, పార్ల మెంట్ ఇంచార్జి బ స్వరాజు సారయ్య, అసెంబ్లీ ఇన్చా ర్జి కొం డేటి మల్లయ్య, సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు గుడిపాటి న ర్సయ్య, యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షులు బీర్ల ఇలయ్య లకు లేఖలు రాశారు..

        సీనియర్ వర్సెస్ జూనియర్

    మండల అధ్యక్షుల అధికారిక జా బితా లీక్ అవ్వడమే ఆల స్యంగా క్షేత్రస్థాయిలో సీనియర్ కార్యకర్తలు, నాయకులు తీ వ్ర ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు.”పార్టీని నమ్ముకున్న పాత కా పులను పక్కనబెట్టి, కొ త్తగా వచ్చిన వారికి పీఠాలు వేస్తా రా?” అంటూ అంతర్గత చర్చలు నడుస్తున్నాయని విశ్వసనీ య వర్గాల బోగట్టా. నియోజకవర్గం లో ని ఒక మాజీ జిల్లా ఉపాధ్యక్షుడి నాయకత్వంలో అసంతృప్త నేతలంతా ఇప్ప టికే ఒక తాటిపైకి వచ్చారు.

    ఒకటి రెండు రోజుల్లో భారీ ఎ త్తున రహస్య సమావేశం ఏర్పా టు చేయబోతున్నారు. ఆ వెంటనే వందలాది వాహనాలతో ‘గాంధీ భవన్ ముట్టడి’ కి ప్లాన్ చేస్తున్నట్లు తుంగతుర్తిలో గుసగుసలు వినిపి స్తున్నా యి. అధిష్టానం తమ మాట వినకపోతే భవిష్యత్తు కార్యాచ రణ ప్రకటిం చేందుకు కూడా వెనుకాడ బోమని హెచ్చరిస్తు న్నారు. ఈ వి వాదం తుంగతుర్తి కాంగ్రెస్‌ను ఎలాంటి మలుపు తిప్పబో తోందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

         అధిష్టానం బుజ్జగింపులు

    ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖతో అలర్ట్ అయిన పీ సీసీ, ఇరు వర్గాలను పిలిచి మాట్లాడే అవ కా శం ఉందని తెలుస్తోంది. పాత క్యా డర్ ఒత్తిడికి తలొగ్గిలిస్ట్‌లో మా ర్పు లు చేస్తే కొత్తగా చేరిన వారిలో అసంతృప్తి పెరుగుతుంది. ఒకవేళ ప్రకటించిన పేర్లకే అధిష్టానం మొ గ్గు చూపితే, రాబో యే స్థానిక సం స్థల ఎన్నికల్లో పార్టీకి రెబెల్స్ సెగ తప్పకపోవ చ్చు. ఏది ఏమైనా తుం గతుర్తి కాంగ్రెస్‌లో రేగిన ఈ ‘మండ ల’ చిచ్చును అధిష్టానం ఎలా చల్లా రుస్తుంది? పాత కాపుల కు న్యా యం జరుగుతుందా? లేక బుజ్జగిం పులతోనే సరిపె డతారా? అనేది తె లియాలంటే మరికొద్ది రోజులు ఆ గా ల్సిందే.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.