Nalgonda police constable POCSO Case : ప్రజా దీవెన, నల్లగొండ: సమాజా నికి రక్షణగా నిలవాల్సిన చే తు లే వంచనకు దిగితే? శాంతిభద్రతల ను కాపాడాల్సిన ఖాకీ చొక్కాయే కామాంధుడికి ముసుగైతే? నల్లగొండ జిల్లా కేం ద్రంలో సంచలనం సృష్టించిన పోక్సో కేసు విచారణ లో షా కింగ్ నిజాలు వెలుగు చూ శాయి.సైకిల్‌పై ప్రశాంతంగా వెళ్తు న్న ఒక అమాయక బాలికను అ డ్డగించి అసభ్యంగా ప్రవర్తిం చాడో వ్యక్తి. భయపడిపోకుండా ఆ బా లిక చూపిన ధైర్యం, వెంటనే వన్ టౌన్ పోలీసులకు అందించిన ఫిర్యాదుతో అసలు వేట మొదలైంది.
మాస్క్ వేస్తే దొరక్కపోతానను కున్నాడు… కానీ
నిందితుడు ముఖానికి మాస్క్ ధ రించి, పక్కా ప్రణాళికతో దొరక్కుండా తిరిగినా… వన్ టౌన్ పోలీసుల పదునైన ద ర్యాప్తుకు, సీసీటీవీ (CCTV) విజువల్స్ నిశిత పరిశీలనకు చిక్కిపోయాడు. పట్టుబడిన నిందితుడి ముసుగు తీసి చూ సిన విచారణ బృందం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆ కా మాంధుడు మరెవరో కాదు, గు ర్రంపోడు పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్.
పాత నేరస్తుడేనా? మిగిలిన ప్రశ్నలివే!
గతంలోనూ ఈ కానిస్టేబుల్‌పై పో క్సో (POCSO) కేసులు ఉ న్నా యి. ఇన్ని తీవ్రమైన ఆరోపణలు ఉన్నా వరుస పోస్టిం గ్లు ఎలా లభించాయి? మహిళల పట్ల అ సభ్య ప్రవర్తనపై గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. పోలీసు శాఖలోని ఆంతరంగిక పర్యవేక్ష ణ లోపించిందా? అంటూ ప్రజా ఆగ్ర హం పెల్లుబికోతోంది.
స్థానిక ప్రజా సంఘాల ఆగ్రహం
రక్షకుడే భక్షకుడిగా మారిన ఈ ఘటనపై ప్రజా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. స దరు కానిస్టేబుల్‌పై తక్ష ణమే కఠి న శాఖాపరమైన చర్యలు తీసు కోవాలని, సర్వీస్ నుండి తొల గించాలని డిమాండ్ చేస్తున్నా యి అయితే. చ ట్టం ముందు అం దరూ సమానులేనని, బాలికల భద్రత విష యంలో ఎలాంటి రా జీ పడేది లేదని, నిందితుడికి చ ట్ట ప్ర కారం కఠిన శిక్ష పడేలా చూ స్తామని ఉన్నతాధికారు లుస్ప ష్టం చేశారు. కాగా ప్రస్తుతం నిందితు డిని అదుపులోకి తీసు కున్న వన్ టౌన్ పోలీసులు, న్యాయస్థానం లో హాజరుపరి చారు.


